మీ గోడల నుండి అగరబత్తుల పొగ మరకలను ఎలా తొలగించాలి

ధూప కర్రల వల్ల మీ గోడల మూలల్లో చీకటి పొగ మరకలు కనిపిస్తే, చింతించకండి. మా దగ్గర వీటిని శుభ్రం చేయడానికి సులభమైన పద్ధతి ఉంది.

వ్యాసం నవీకరించబడింది

How to Remove Ooodhubatti Smoke Stains from Your Walls
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

చాలా మంది ఇండ్లల్లో వారి పూజా గది / ప్రార్థన గదిలో వారి గోడల మూలలో ఒక నల్లని ప్రదేశాన్ని గమనించవచ్చు. ధూప కర్రలు లేదా అగరబత్తుల నుండి వచ్చే పొగ ఈ మరకలకు కారణం. మనం వాటిని ప్రతిరోజూ శుభ్రం చేయనందున,  అవి కాలక్రమేణా మొండి మరకలుగా మిగిలిపోవచ్చు. వాటిని సులభంగా తొలగించడానికి ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి.

దశ 1: టిష్యూ పేపర్‌తో తుడవండి

పొగ మరకను పొడి టిష్యూ కాగితంతో తుడవండి, పొగ మరక యొక్క పొడి పొరను తొలగించడానికి, వాటిని ఇతర శుభ్రమైన ప్రదేశానికి వ్యాపించకుండా చూసుకోండి.

దశ 2: శుభ్రపరిచే  ద్రావకం తయారుచేసుకోండి

ఖాళీ స్ప్రే బాటిల్ తీసుకొని గోరువెచ్చని నీటితో నింపండి. దానికి ఒక చిన్న చెంచా వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి. అవసరమైతే మీరు బ్లీచ్ కూడా ప్రయత్నించవచ్చు.

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner

దశ 3: పిచికారీ చేసి 10 నిమిషాలు వేచి ఉండండి

ద్రావణాన్ని స్టెయిన్ మీద సమానంగా పిచికారీ చేసి 10 నిమిషాలు వదిలి వేయండి.

దశ 4: మరకను రుద్దండి

ఇప్పుడు మరక మీద కొంచెం నీరు పిచికారీ చేసి వృత్తాకార కదలికలలో బ్రష్ తో రుద్దండి.

దశ 5: తుడిచివేయండి

ఇప్పుడు తడి గుడ్డ తీసుకొని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా మెల్లగా తుడవండి.

దశ 6: ప్రక్రియను పునరావృతం చేయండి

మరోసారి నీటితో పిచికారీ చేసి, గోడ శుభ్రంగా ఉండే వరకు పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి.

దశ 7: ఆరనివ్వండి

సహజంగా ఆరడానికి వదిలేయండి.

ఇక పై ముదురు పొగ గోడల గురించి చింతించాల్సిన అవసరం లేదు !!

వ్యాసం మొదట ప్రచురించబడింది