మీరు ఏ ఇంటికి వెళ్ళిన మీ దృష్టిని ఆకర్షించే మొదటి విషయం ఫ్లోరింగ్. ఈ పండుగ సీజన్ రాబోతుంటే, శుభ్రపరచే కొన్ని వస్తువులు దగ్గర పెట్టుకోవడం మంచిది; ప్రత్యేకించి నూనె మరకొల కొరకు . నోరు ఊరించే రుచికరమైన వంటలు ఎన్నో వంటింట్లో మీరు వండుతూ ఉంటే ప్రమాదవశాత్తు నూనె కింద పడే అవకాశం ఉంది, కానీ చింతించకండి; ఆ రాతి నేలపై ఇబ్బందికరమైన చమురు మరకలను వదిలించుకోవడానికి మేము సూచించే తేలికపాటి కాని ప్రభావవంతమైన చిట్కాలను ప్రయత్నించండి. దశల వారిగా ఏ విధంగా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టెప్ 1: అదనపు నూనెను తొలగించండి పేపర్-తువ్వాళ్లను ఉపయోగించి నేల నుంచి అదనపు నూనెను తొలగించాలి. స్టెప్ 2: పిండిని వాడండి జిడ్డుగల భాగంలో పిండిని చల్లండి. స్టెప్ 3: మరకలపై రుద్దండి నేల పొడిగా మారే వరకు పిండిని జిడ్డుగల భాగాలపై రుద్దండి. స్టెప్ 4: పిండిని తీసివేయండి నూనె భాగల పై చల్లిన పిండిని తీసివేయాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో 1 పెద్ద చెంచా డిష్ వాషింగ్ లిక్విడ్ కలపాలి. ఒక స్పాంజితో ఈ ద్రావణంలో ముంచి జిడ్డు ప్రాంతం అంతా రుద్ది శుభ్రం చేసుకొవాలి. స్టెప్ 5: ఉప్పు చల్లుకోండి నూనె పడ్డ ప్రాంతం అంతా ఉదారంగా కావలసినంత ఉప్పు చల్లుకోవాలి. అలాగే 15 నిమిషాలు వరకు వేచి ఉండాలి. ఉప్పు నూనెతో కూడిన జిడ్డునను పీల్చుకుంటుంది. తరువాత తడి స్పాంజితో ఉప్పునంతా తీసివేయాలి. అర ½ బకెట్ నీళ్లలో 1 పెద్ద చెంచా వెనిగర్, 2 చిన్న చెంచాల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసుకొని మాప్ తో తుడచి వేయాలి. అంతే! ఈ దశల వారి సులభమైన చిట్కాలు పాటించండి, మీ ఫ్లోర్ ను అందంగా తీర్చిద్దిండి.