ఇంటిని డెకోరేట్ చేయడానికి సిరామిక్ ఒక అద్భుతమైన ఇంటి ఆలోచన. ఇది మనోహరంగా కనిపిస్తుంది, నీటి నిరోధకత స్వభావం కలిగినది, చాలా మన్నికైనది. ఇది రెండు రకాలుగా వస్తుంది - మెరుస్తున్న మరియు మెరుస్తున్నది మెరుస్తున్న సిరామిక్ టైల్ పై గాజు పొరతో అందంగా, మృదువుగా కనిపిస్తుంది. అంతే కాకుండా దీనిని నిర్వహించడం చాలా సులభం. నాన్ గ్లాసీ సిరామిక్ టైల్ క్లీన్ చేయడం కష్టం. వీటిపై దుమ్ము, ధూళి ఇతర మొండి మరకలు ఉంటే వాటిని శుభ్రం చేయడానికి కొంచెం కష్టతరం అవుతుంది. దీని గురించి చింతించాల్సిన పని లేదు. వీటిని ఏ విధంగా ఈజీగా క్లీన్ చేయవచ్చు అనేది కొన్ని చిట్కాలు తెలియజేస్తాం. దశల వారీగా వీటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా దీని కోసం స్టెప్ 1: క్లీనింగ్ సొల్యూషన్ ఈ నాన్ గ్లాసీ సిరామిక్ టైల్స్ లేదా ఫ్లోరింగ్ క్లీన్ చేయడానికి మొదట ఓ ద్రవం సిద్దం చేసుకోవాలి. దాని కోసం ఓ బకెట్ లో 3/4 నీళ్లను తీసుకోని అందులో 1 కప్పు వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ డిష్ వాషింగ్ లిక్విడ్ కలపాలి. వీటిని బాగా మిక్స్ చేయాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు రబ్బరు చేతి తొడుగులు ధరించాలి. స్టెప్ 2 : పూర్తిగా స్క్రబ్ చేయాలి ఇప్పుడు ఓ స్క్రబ్బింగ్ ప్యాడ్ తీసుకోని నీటిలో ముంచి సిరామిక్ ఫ్లోర్ లేదా టైల్స్ పై రుద్దాలి. సిరామిక్ ఫ్లోర్ పై ఉన్న దుమ్ము ధూళిని ఈ విధంగా క్లీన్ చేసుకోని సోల్యూషన్ అప్లై చేయాలి. స్టెప్ 3 : నేల శుభ్రం.. ఇప్పుడు ఓ పొడి గుడ్డను ముందుగా సిద్ధం చేసుకున్న ద్రావణంలో ముంచాలి. ఆ గుడ్డతో సిరామిక్ ఫోర్ల్ పై రుద్దాలి. మొండి మరకలు ఉన్న చోట ఈ సొల్యూషన్ ను ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఫోర్ల్ పై ఎలాంటి మచ్చలు ఉన్నా, బూజు ఉన్నా చాలా ఈజీగా ఈ సోల్యూషన్ తొలగిస్తుంది. మీ ఫ్లోర్ మసకబారుతున్నట్టు గమనించిన ప్రతిసారి ఈ విధంగా చేసి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. స్టెప్ 4 : మొండి మరకలకు చెక్ టైల్స్ మీద మొండి మరకలు కఠినంగా ఉంటే ఈ విధంగా చేయండి. ముందుగా సిద్ధం చేసుకున్న సోల్యూషన్ ను టైల్స్ పై రుద్ది 10-15 నిమిషాల వరకు ఆగాలి. దీనిలో ఉన్న వెనిగర్ మరకలు మటుమాయం చేయడానికి సహాయపడుతుంది. స్టెప్ 5 : నీటితో శుభ్రం చేసుకోండి టైల్స్ లేదా ఫ్లోరింగ్ ప్రాంతమంతా సొల్యూషన్ రుద్దిన తర్వాత మంచి నీటితో కడిగితే సరిపోతుంది. లేదా ఓ వస్త్ర్రంతో మంచినీటిలోముంచి ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే మీ సిరామిక్ టైల్స్ కొత్త షైనింగ్ తో మెరిసిపోతాయి. ఈ రోజే ఈ చిట్కాలను ప్రయత్నిచండి...మీ ఇంట్లో ఉన్న టైల్స్ మెరుపుతో షైన్ అవ్వండి.