ఇత్తడి వస్తువులను వంటగది లో ఉండే సామాగ్రితో శుభ్రం చేయడం ఎలా
ఇత్తడి ఒక లోహం, ఇది చాలా తేలికగా నల్లబడుతుంది. దాని ప్రకాశాన్ని తిరిగి పొందడానికి అధిక శుభ్రత అవసరం.
వ్యాసం నవీకరించబడింది


ఇత్తడి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్న లోహం. అందుకే దీనిని దేవత విగ్రహాలకు, పూజ సామాగ్రి, డిష్వాషర్ అమరికలు, లాంప్ ఫిట్టింగ్స్, పురాతన వస్తువులు, వంట సామాగ్రి, నగలు, సంగీత వాయిద్యాలు, తలుపుల గొళ్ళాలు మరెన్నో వాటికి ఈ లోహంనే వాడుతుంటారు. ఇత్తడితో చేసిన వస్తువులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ త్వరగా నల్లబడతాయి. అందుకే వీటిని తరుచుగా శుభ్రం చేయల్సి ఉంటుంది. వంటగది లో ఉండే సామాగ్రిని ఉపాయోగించి బంగారానికి సమానంగా మెరిసే విధంగా వీటిని శుభ్రం చేయవచ్చు.
ఇత్తడి వస్తువులను శుభ్రం చేయడానికి సులభమైన మార్గాలు
1) కెచప్
శుభ్రమైన వస్త్రంపై కొంత కెచప్‌ను చల్లి, నల్లబడ్డ ఇత్తడి భాగం పై రుద్దాలి. కొద్ది సమయం తరువాత తడిగా ఉన్న వస్త్రంతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుంది.
2) సబ్బు లేదా తేలికపాటి డిటర్జెంట్

ఒకవేళ మీ ఇత్తడి వస్తువు నల్లబడడం కాకుండా దుమ్ము, ధూళితో జిడ్డుగా మారితే దానిని వదిలించుకోవడానికి సింపుల్ ట్రిక్ ఉంది. గోరు వెచ్చని నీటిలో వెచ్చని సబ్బు నురుగు కలిపి దాని పై రుద్దాలి. కాసేపు తరువాత మృదువైన వస్త్రంతో శుభ్రం చేస్తే ఎలాంటి జిడ్డు అయిన తొలిగిపోతుంది. లేకపోతే టూత్ బ్రష్ ఉపయోగించి జిడ్డు ఉన్న ఇతర భాగం పై రుద్దాలి.
3) వెనిగర్, ఉప్పు మరియు పిండి కూడ ఉపయోగించుకోవచ్చు
వెనిగర్, ఉప్పు పిండి కలిపి నల్లబడ్డ ఇత్తడిని శుభ్రం చేయవచ్చు. ముందుగా ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒకటిన్నర కప్పు వెనిగర్ తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసి కరిగించాలి, అందులో కాస్త పిండి వేసి మందంగా పేస్ట్ అయ్యేవరకు కలుపుకోవాలి. ఈ పేస్టును నల్లబడ్డ ఇత్తడి వస్తువుల పై రుద్దాలి. దాదాపు 10 నిమిషాలు ఆ పేస్టును అలాగే ఉంచి, తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకొని పొడి గుడ్డతో తుడుచుకుంటే మీ ఇత్తడి వస్తువులు అందంగా మెరుస్తాయి.
4) నీరు
ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో, 2 పెద్ద చెంచాల ఉప్పు, వైట్ వెనిగర్ కలిపి ద్రవం సిద్దం చేసుకోవాలి. దీనిని నల్లబడ్డ ఇత్తడి పై రుద్దాలి. ఆరిన తరువాత మంచి నీటితో కడుక్కొని , పొడి గుడ్డతో తుడుచుకుంటే మీ వస్తువులు మెరిసిపోతాయి.
5) నిమ్మరసం
ఒక గిన్నె తీసుకోని దానిలో 1/2 నిమ్మరసం పిండాలి, దానికి ఒక సుమారు చిన్న చెంచా బేకింగ్ సోడా జతచేసి బాగా కలుపుకొని పేస్టు సిద్దం చేసుకోవాలి. ఈ పేస్టును నల్లబడ్డ ఇత్తడి భాగాలపై పూసి 5 నిమిషాలు ఆగాలి. తరువాత మంచి నీటితో కడిగి, పొడి కాటన్ గుడ్డతో తుడుచుకుంటే మీ ఇత్తడి వస్తువులు బంగారంలా ధగధగ మెరుస్తాయి.
వ్యాసం మొదట ప్రచురించబడింది