సోఫాలు మరియు కుర్చీలను కుటుంబ సభ్యులందరూ ఉపయోగిస్తారు కాబట్టి ఇవి ఎక్కువగా తాకుతుండే ప్రదేశాలు. కాబట్టి వీటిని శుభ్రంచేయడం చాలా ముఖ్యం. సాధ్యమైన మేరకు వాటిని రెగ్యులర్‌గా శుభ్రంచేయడానికి ప్రయత్నించాలి. ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలను క్షుణ్ణంగా లోతుగా శుభ్రంచేయడానికి ఉపయోగపడే కొన్ని సూచనల కోసం మీరు ఎదురుచూస్తుంటే, మేము వాటిని మీకు ఇస్తున్నాము. మీ సోఫాలను శుభ్రంచేయండి ఉపరితల దుమ్ము మరియు మురికిని తొలగించేందుకు మీ సోఫాలను క్షుణ్ణంగా శుభ్రంచేయడం ముఖ్యం, ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు దానిలో చాలా సేపు విశ్రాంతి తీసుకుంటారు. మీ సోఫాను బాగా శుభ్రంచేసేందుకు, దాని నుంచి వదులుగా ఉన్న మురికి మరియు ఆహార పదార్థాల తునకలు తొలగించేందుకు మొదటగా వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించండి. సరైన వాక్యూమ్ క్లీనర్ ఎటాచ్‌మెంట్‌ని ఉపయోగించి సందులను తప్పకుండా శుభ్రం చేయండి. ఊడదీయదగినవి అయితే కుషన్‌లను తీయండి మరియు కుషన్ కవర్‌లను ఉతకండి. మీరు వాటిని చేతులతో లేదా వాషింగ్ మెషీన్‌లో ఉతకవచ్చు. తరువాత, 1 పెద్ద చెంచా లాండ్రీ డిటర్జెంట్ ద్రావణం లేదా డిష్‌వాషింగ్ లిక్విడ్‌కి ఒక స్ప్రే బాటిల్‌లో 2 కప్పులు వేడి నీటిని తయారుచేసి ద్రావణం తయారు చేయండి. దీని కోసం మీరు విమ్ డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించవచ్చు. సోఫాపై ఈ ద్రావణాన్ని పిచికారి చేయండి. సెక్షన్‌లుగా శుభ్రం చేయండి. ఒక సెక్షన్‌పై పిచికారి చేసిన తరువాత, పరిశుభ్రమైన వస్త్రం లేదా స్పాంజితో తేలికగా దానిని తుడవండి. వస్త్రం లేదా స్పాంజి చాలా ఎక్కువ తడిగా ఉంటే పిండండి. దానిని గాలికి ఆరబెట్టండి. సోఫా మొత్తానికి అప్లై చేయడానికి ముందు, దీనిని కొద్ది సెక్షన్‌పై పరీక్షించండి. సోఫాను ఎలా కడగాలో మరియు ఆరబెట్టాలో తెలుసుకునేందుకు కేర్ ఏబుల్‌ని లేబులుని చదవండి. ప్యాక్‌పై గల వాడకపు సూచనలను పాటించండి. ఫ్యాబ్రిక్, లెదర్ లేదా ఫావుక్స్ లెదర్‌తో తయారుచేసిన భిన్న సోఫాలను ఎలా శుభ్రం చేయాలనే విషయంపై సూచనల కోసం మీరు ఈ వ్యాసం చదవవచ్చు. వెనుక గట్టిగా ఉండే మీ కుర్చీలను శుభ్రం చేయండి వెనుక గట్టిగా ఉండే మీ కుర్చీలు ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలు, వీటిని క్రమంతప్పకుండా శుభ్రం చేయాలి. వదులుగా ఉన్న మురికిని తొలగించేందుకు వాటిని రోజూ దుమ్ము దులపండి మరియు రెగ్యులర్‌గా ఇంట్లో వాడే డిటర్జెంట్ మరియు నీటితో శుభ్రం చేయండి. శుభ్రం చేసిన తరువాత, మెరుగైన శుభ్రత కోసం మీరు వాటిని క్రిమిసంహారం చేయవచ్చు. దీని కోసం మీరు డోమెక్స్ మల్టీపర్పస్ డిజ్‌ఇన్ఫెక్టంట్ స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇంట్లోని వస్తువులను క్రిమిసంహారం చేసేందుకు ప్రముఖ ఆరోగ్య సంస్థలు సిఫారసు చేసినట్లుగా దీనిలో సోడియం హైపోక్లోరైట్ ఉంది. గదుల్లో తరచుగా తాకుతుండే ఉపరితలాలపై క్రిములను ఇది సురక్షితంగా చంపుతుంది మరియు కమ్మని సువాసన ఇస్తుంది. మొదటగా అనుకూలతను పరీక్షించేందుకు ఎల్లప్పుడూ ప్యాక్‌పై గల వాడకపు సూచనలను పాటించండి, కొద్దిపాటి గుప్త ప్రదేశంలో పరీక్షించండి మరియు కడగండి. ఏదైనా వస్తువును తాకిన తరువాత, సబ్బుతో మీ చేతులు కడుక్కోవలసిందిగా లేదా లైఫ్‌బాయ్ లాంటి వాటి నుంచి లభించే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ని ఉపయోగించవలసిందిగా మేము మీకు సూచిస్తున్నాము. మీ ఇంటిని లోతుగా శుభ్రం చేసేందుకు మరియు మీ కుర్చీలను మరియు సోఫాలను శుభ్రంగా ఉంచేందుకు మీరు ఈ సూచనలను ప్రయత్నించవచ్చు. ఈ సులభమైన విషయాలను ఉపయోగించి మీ ఆరోగ్యాన్నిమరియు సురక్షతకు సంబంధించిన ముందుజాగ్రత్తలను పెంచుకోండి. ఆధారాలు: https://www.cdc.gov/coronavirus/2019-ncov/prevent-getting-sick/cleaning-disinfection.html