మీ రోజువారీ జీవన అలవాట్లు మీ గోడలపై మురికి మరియు మరకలు కలిగించి, వాటి అందాన్ని తగ్గిస్తాయి. చింతించకండి, వాటిని తుడిచి శుభ్రం చేసేందుకు ఈ సూచనలు ఉపయోగించండి. సాధ్యమైనంత వెంటనే మరకలను శుద్ధి చేయడం మరకలను తొలగించే ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన భాగం. మీరు ఎంత త్వరగా మరకకు శుద్ధి చేస్తే, దానిని తొలగించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీ బెడ్‌రూమ్ గోడల నుంచి ఆ చేతి మరకలను పోగొట్టేందుకు ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించండి. 1) డిష్‌వాషింగ్ లిక్విడ్ + గోరువెచ్చని నీటిని ఉపయోగించండి మొదటగా. మీ గోడలపై పెయింట్‌ని పరిగణనలోకి తీసుకోండి. మీ గోడలపై వాటర్‌ప్రూఫ్ పెయింట్ ఉంటే, వాటిని మీకు మీరే వాటిని కడగవచ్చు. ఒక బౌల్ గోరు వెచ్చని నీరు మరియు 4-5 చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్ తీసుకోండి. దీనిని బాగా మిశ్రమం చేసి ఈ ద్రావణంలో పరిశుభ్రమైన స్పాంజిని ముంచి శుభ్రం చేయడం ప్రారంబించండి. ఒకవేళ మీ గోడలకు వాటర్‌ప్రూఫ్ పెయింట్ వేయకపోతే, మీరు ప్రొఫెషనల్ సలహా తీసుకోవలసి ఉంటుంది. 2) వినీగర్ + బేకింగ్ సోడా ఉపయోగించండి మీరు తప్పకుండా సరైన క్లీనింగ్ సొల్యూషన్‌ని ఎంచుకోండి, ఎందుకంటే అత్యధిక మరకలను గోరువెచ్చని, సబ్బు నీటితో శుభ్రం చేయలేము. మంచి క్లీనింగ్ ఏజెంట్ కోసం 1 కప్పు వినిగర్ ద్రావణం మరియు ¼ కప్పు బేకింగ్ సోడాను ఒక బక్కెట్ గోరువెచ్చని నీటిలో మిశ్రమం చేయండి. పరిశుభ్రమైన వస్త్రం తీసుకొని ఈ ద్రావణంలో ముంచి మీ గోడలను తుడిచి శుభ్రం చేయండి. చిందిన మరకలు ఏవీ లేకుండా ఉండేందుకు మీరు తప్పకుండా పై నుంచి కిందకు క్రమేపీ తుడవాలి. 3) బేకింగ్ సోడా + గోరువెచ్చని నీటిని ఉపయోగించండి బేకింగ్ సోడా మరియు గోరువెచ్చని నీటితో పేస్టు చేయడం ద్వారా కూడా మీరు మరకలను తొలగించవచవ్చు. ఒక బక్కెట్ గోరు వెచ్చని నీటిలో ¼ కప్పు బేకింగ్ సోడా ద్రావణం మిశ్రమం చేయండి. మరకలపై పై నుంచి కిందకు ఈ ద్రావణాన్ని మెల్లగా రుద్దడం ప్రారంభించండి. కడిగిన తరువాత పరిశుభ్రమైన, పొడి వస్త్రంతో శుభ్రం చేయండి. మీ ఇంట్లో గోడలు శుచిగా మరియు శుభ్రంగా ఉన్నాయని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మెచ్చుకున్నప్పుడు గర్వంగా ఉంటుంది కదూ. మాకు తరువాత ధన్యవాదాలు చెప్పండి!