మార్బుల్ ఫ్లోరింగ్ మీ గృహాన్ని ఎంతో అందంగా మారుస్తుంది. కానీ మార్బుల్ లోని సూక్ష్మరంధ్రాలున్న గుణగణాల కారణంగా, అది త్వరగా ద్రవాలను నిలిచేలా చేస్తుంది. మీ అందమైన మార్బుల్ ఫ్లోర్ పై గిన్నె లోని గ్రేవి పడిపోతే వెంటనే అసహ్యంగా ఉండే మరక ఉండిపోతుంది. అయితే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మేము సూచించే సరళమైన పద్థతి ద్వారా మార్బుల్ పై ఎలాంటి మరకలు పడిన వాటిని సులభంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. స్టెప్ 1: మచ్చను తొలగించండి ముందుగా టిష్యూ పేపర్‌ను ఉపయోగించి సాధ్యమైనంత వరకు గ్రేవీ మరకలను తొలగించే ప్రయత్నం చేయాలి. స్టెప్ 2: కొద్దిగా నీళ్ళను పిచికారీ చేయాలి మార్బుల్ ఫ్లోర్ పై మరక తడిగా ఉండటానికి నీళ్లు పిచికారీ చేయాలి. మరక ఎండిపోతే శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. స్టెప్ 3: క్లీనింగ్ సొల్యూషన్ సిద్ధం చేసుకోవాలి ఒక గిన్నెలో 1 కప్పు నీరు, ½ (అర) కప్పు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. స్టెప్ 4: మరక పై పూయాలి ఈ పేస్ట్ మందమైన పొరను ఫ్లోర్ పై ఉన్న మరక మీద మృదువైన బ్రష్ తో సమానంగా రుద్దాలి. స్టెప్ 5: క్లింగ్ ర్యాప్‌తో కప్పాలి మరక ఉన్న ఆ భాగాన్ని క్లింగ్ ర్యాప్‌తో కప్పాలి. ఒక రోజంతా అలాగే కప్పి ఉంచాలి. బేకింగ్ సోడా మార్బుల్ ఫ్లోర్ పై ఉన్నమరకను పీల్చుకుంటుంది. స్టెప్ 6: మరో శుభ్రపరచే ద్రావకాన్ని సిద్ధం చేసుకోవాలి మరుసటి రోజు 2 కప్పుల గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో 2 చిన్న చెంచాల డిష్ వాషింగ్ లిక్విడ్ కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. స్టెప్ 7: క్లింగ్ ర్యాప్‌ను తొలగించాలి ఒకసారి శుభ్రపరచే ద్రావకం సిద్ధం కాగానే, క్లింగ్ ర్యాప్‌ను తొలగించాలి శుభ్రపరచే ద్రావకాన్ని మరక ఉన్న చోటు రుద్దాలి. తర్వాత మృదువైన బ్రష్ లేదా వస్త్రాన్ని ఉపయోగించి మిగిలిన మరకను రుద్దితే సరిపోతుంది. స్టెప్ 8: మంచి నీటితో కడగాలి ఒక బట్టను మామూలు నీళ్ళతో తడిపి ఆ ప్రదేశాన్ని తుడవాలి మీ మార్బుల్ ఫ్లోర్ పై మరకలు పడిన వెంటనే ఈ ప్రక్రియను మొదలుపెట్టాలి. లేకపోతే అలాగే మిగిలిపోతాయి మరియు తొలగించడానికి కష్టతరం అవుతుంది. మీ మార్బుల్ ఫ్లోర్ల పై గ్రేవి మరకలను ఈ సారి మీరు గమనిస్తే, ఈ గైడ్‌ను దగ్గరపెట్టుకోండి.