ఇంటి పనివారి సహాయం లేనప్పుడు మీరు ఇంటి పనులతో మునిగిపోతున్నారా? మీరుజిమ్ లో చేసే వర్కౌట్స్ సమయమును కోల్పోతున్నారా? మీరు మీ ఇంటిని శుభ్రంగా మరియు సూక్ష్మక్రిమిరహితంగా చేస్తున్నట్లయితే, మీరు ఇప్పటికే చాలా వ్యాయామం చేస్తున్నారు. ఈ వ్యాసంలో, సాధారణ ఇంటి పనులు మీకు ఆరోగ్యంగా ఉండటానికి మరియు మీ ఇంటిని చక్కగా మరియు శుభ్రంగా ఉంచడానికి ఎలా సహాయపడతాయో మేము మీకు చెప్తాము. 1) చక్కబెట్టుకోవడం శుభ్రమైన ఇంటి కోసం, మీరు చేయవలసిన మొదటి విషయం క్రమములో పెట్టాలి. మీరు నేల, సోఫాలు లేదా మంచం నుండి బొమ్మలు, పుస్తకాలు, పేపర్లు, బట్టలు మొదలైనవాటిని తీసేటప్పుడు వంగడం లేదా గొంతుకు కూర్చోవడం మంచిది. గొంతుకు కూర్చోవడం మొత్తం శరీరానికి గొప్ప వ్యాయామం. 2) శుభ్రపరచడం హై-టచ్ ఉపరితలాలన్నింటినీ ప్రతిరోజూ శుభ్రం చేసి క్రిమిసంహారకం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇస్తుంది. ఇందులో టేబుల్స్, కుర్చీలు, డోర్ హ్యాండిల్స్, క్యాబినెట్ హ్యాండిల్స్ మొదలైనవి ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు, బిందువులలోని సూక్ష్మక్రిములు 3 అడుగుల వరకు ప్రయాణించి సమీప ఉపరితలాలపైకి వస్తాయి. వీటిని శుభ్రం చేయడానికి, మీరు సాధారణ గృహ డిటర్జెంట్ మరియు నీటిని ఉపయోగించవచ్చు. ఉపరితలాలను క్రిమిసంహారకం చేయడానికి, మీరు డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ వంటి బ్లీచ్-బేస్డ్ (సోడియం హైపోక్లోరైట్) ఉత్పత్తి వంటి తగిన క్రిమిసంహారక మందును ఉపయోగించవచ్చు, ఇది సూక్ష్మక్రిములను చంపుతుంది. మరుగుపరచబడిన ప్రదేశంలో మొదట దీనిని పరీక్షించండి మరియు అనుకూలతను తనిఖీ చేయడానికి శుభ్రం చేసుకోండి. మీరు ఇవన్నీ శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకం చేసినప్పుడు, మీ శరీరం కూడా కఠినమైన వ్యాయామం పొందుతుంది. ఉదాహరణకు, ఫర్నిచర్ ఊడ్చుకోవడం మరియు తుడుచుకోవడం చేస్తున్నప్పుడు, అటూఇటూ కదిలించడం, మూలలు మరియు ఇరుకైన స్థలం నుండి దుమ్మును మరియు ధూళిని తొలగించడం మంచి వ్యాయామం. మీరు ఒక స్థాయి కష్టాన్ని జోడించాలనుకుంటే, నిలబడటానికి బదులు గొంతుకు కూర్చుని చేతితో తుడువండి. 3) పాత్రలు కడగడం సూక్ష్మక్రిములు నోరు మరియు ముక్కు నుండి బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి.కాబట్టి, ఇంట్లో ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైన పాత్రలు మరియు వంటకాలు, కప్పులు, గిన్నెలు, చెంచాలు వంటి పాత్రలు ఉండటం మంచిది. అందరికీ ప్రత్యేకమైన పాత్రలు ఉంటే, శుభ్రం చేయడానికి మీకు తగినంత పాత్రలు ఉంటాయి పూర్తిగా. పాత్రలను శుభ్రం చేయడానికి, మీరు నిలబడి మీ చేతులు మరియు భుజాలు రెండింటినీ ఉపయోగించాలి. మంచం మీద కూర్చోవడం మరియు టీవీ చూడటం కంటే కేలరీలను కరిగించడానికి నిలబడడం సహాయపడుతుంది. అంతేకాకుండా, వంటలను రుద్దడం వల్ల మీ చేతులు మరియు భుజాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది. 4) బట్టలు ఉతకడం సూక్ష్మక్రిములను నివారించడానికి మరియు అంటువ్యాధులను అరికట్టడానికి మీ దుస్తులను క్రమం తప్పకుండా మరియు పూర్తిగా ఉతకడం చాలా ముఖ్యం. మీరు ఇంట్లో వాషింగ్ మెషీన్ కలిగి ఉన్నప్పటికీ, రంగు వెలిసే బట్టలు లేదా సున్నితమైనవస్త్రాలు ఉంటే మీరు చేతితో ఉతుక్కోవడానికి ఇష్టపడే కొన్ని బట్టలు ఉండవచ్చు. మీరు ఈ దుస్తులను గొంతుకు కూర్చుని బాత్రూమ్ నేల పైఉతకవచ్చు. మీరు వాటిని బేసిన్లో ఉతకడానికి ఇష్టపడితే, ఆ సమయంలో మీరు నిలబడటం కూడా మంచి వ్యాయామం. ఈ రెండు సందర్భాల్లో, మీ చేతులు మరియు భుజాలతో పాటు, మీ దిగువ శరీరం కూడా కొంత వ్యాయామం పొందుతుంది. చూడండి? ఇంటి పనులను చేయడం మీరు మీ ఇంటి నుండి బయటపడలేని సమయాల్లో గొప్ప వ్యాయామం.