మీ మార్బుల్ ఫ్లోర్ తళతళ మెరుస్తూ ఉండేందుకు సహాయపడే సులభ గైడ్

మీ మార్బుల్‌ ఫ్లోర్‌లు మరకలు మరియు క్షీణత లేకుండా తళతళ మెరుస్తూ ఉంచేందుకు ఈ గైడ్‌ని చదవండి.

వ్యాసం నవీకరించబడింది

An Easy Guide to Help Keep Your Marble Floor Sparkling Bright
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

మీ అవగాహన, శుభ్రత మరియు అభిరుచిని చాటేందుకు మార్బుల్‌ ఫ్లోరింగ్‌ గొప్ప మార్గం. ఇది మీ ఇంటి అందాన్ని తక్షణం పెంచుతుంది. అంతే కాదు, వేసవి కాలంలో మీ ఇంటిని చల్లగా ఉంచుతుంది. కానీ, అన్ని సహజమైన రాళ్ళ మాదిరిగానే, మార్బుల్‌కి కూడా మరకలు పడుతుంటాయి మరియు అవి క్షీణిస్తుంటాయి.

కానీ చింతించకండి, మా వద్ద సులభ పరిష్కారం ఉంది.

మీ ఫ్లోర్‌ని పరిశుభ్రంగా మెరుస్తూ ఉంచేందుకు ఈ సులభ పరిశుభ్రమైన పద్ధతిని పాటించండి.

స్టెప్‌ 1:

లూజు మురికిని తుడించేందుకు వీలుగా ఫ్లోర్‌ని బాగా ఊడవడంతో ప్రారంబించండి.

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner

స్టెప్‌ 2:    

ఇప్పుడు, మీ సొంత పరిశుభ్రత ద్రావకం తయారుచేయండి. 3 పెద్ద చెంచాల బేకింగ్‌ సోడా మరియు 2 చుక్కల డిష్‌వాషింగ్‌ జెల్‌ని ఒక బక్కెట్‌ గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిశ్రమం చేయండి.

స్టెప్‌ 3:

పరిశుభ్రమైన స్పాంజిని ఈ సబ్బు నీటిలో ముంచి ఫ్లోర్‌ని బాగా తుడవండి. జమయిన మురికిని తొలగించేందుకు స్పాంజిని తరచుగా పరిశుభ్రమైన నీటిలో కడుగుతూ ఉండండి. దీనివల్ల మిగతా మురికి సులభంగా సంగ్రహించబడుతుంది.

స్టెప్‌ 4:

ఇప్పుడు తుది మెరుగులు దిద్దాలి. మురికి మొత్తాన్ని తొలగించాక మీ మార్బుల్‌ ఫ్లోర్‌ దాదాపుగా పరిశుభ్రం కాగానే, అదనంగా ఉన్న నీటిని తొలగించేందుకు పొడి గుడ్డతో ఫ్లోర్‌ని బాగా శుభ్రం చేయండి. దీనివల్ల ఫ్లోర్‌ చాలా పరిశుభ్రంగా ఉంటుంది.

అంతే! కొద్ది సేపటలోలనే మీ మార్బుల్‌ ఫ్లోర్‌ పరిశుభ్రంగా మరియు మెరుస్తూ ఉంటుంది. మార్బుల్‌ ఫ్లోర్‌కి మెయింటెనెన్స్‌ ఎక్కువని మీరు భావిస్తే, మీరు పప్పులో కాలేసినట్లే! ఈ సారి మీరు మీ మార్బుల్‌ ఫ్లోర్‌ని శుభ్రం చేయాలనుకున్నప్పుడు, ఈ సులభ పద్ధతి పాటించండి. ఇది ఉపయోగించదగిన విలువైన పద్ధతి.

ముఖ్య చర్య

మార్బుల్‌ ఫ్లోరింగ్‌ని శుభ్రం చేయడానికి వినిగర్‌ లేదా నిమ్మ రసం ఉపయోగించకండి. వీటిల్లో క్షార గుణాలు ఉన్నందున ఇవి మార్బుల్‌ని పాడు చేయవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది