మీ లగేజ్ను శుభ్రం చేయడానికి సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలు

మీ లగేజ్‌ను శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. అలా పెట్టడానికి ఇక్కడ మేము కొన్ని చిట్కాలు సూచిస్తున్నాం, ట్రై చేయండి.

వ్యాసం నవీకరించబడింది

Follow These Simple and Effective Steps to Clean Your Luggage
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు గుర్తుంచుకోవలసిన నియమం, మీరు తీసుకెళ్లే లగేజ్‌ తక్కువ బరువు ఉండే విధంగా చూసుకోవాలి. తక్కువ లగేజ్‌ బ్యాగ్స్ ఉంటే, మీరు సందర్శించే ఆనందంగా అస్వాదించవచ్చు. అలాగే విడిచిన బట్టలు పెట్టడానికి అనువుగా ఓ క్యారీ బ్యాగ్ లేదా, సూట్ కేసులు తీసుకొని వెళ్లవచ్చు. కానీ ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు బట్టలతో పాటు వ్యాధులు వ్యాపింప చేసే క్రిములను కూడ తీసుకెళ్తారు. ఈ విషయం మీకు తెలుసా?

అలాంటి మీ లగేజ్‌ ను దశల వారీగా ఏ విధంగా శుభ్రం చేయాలో ఇక్కడ తెలియజేస్తున్నాం. 

మీ సూట్‌కేస్‌ను ఖాళీ చేయండి

మీరు మీ సూట్‌కేస్‌ను శుభ్రం చేసే ముందు, అందులో ఉన్న బట్టలను, ఇతర పాకెట్స్ లో ఉన్న వస్తువులను ఖాళీ చేయాలి. 

మీ సూట్‌కేస్‌కు వ్యాక్యూమ్‌ పెట్టండి

వ్యాక్యూమ్ క్లీనర్ తో ఖాళీ చేసిన సూట్ కేసు పై ఉన్నదుమ్ము, ధూళి, ఇతర చెత్తను తీసివేయండి. సూట్‌కేస్‌లోని సైడ్ పాకెట్స్‌ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒకవేళ వాక్యూమ్ క్లీనర్ లేకపోతే ఓ పొడి గుడ్డతో శుభ్రం చేసుకోవచ్చు.

ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

రిమూవబుల్ స్టోరేజ్‌  పాకెట్స్ ను కడగాలి

తయారీదారు సూచనల మేరకు రిమూవబుల్ స్టోరేజ్‌  పాకెట్స్ ను శుభ్రం చేయవచ్చు. ఆ రిమూవబుల్ పాకెట్స్ ను వాషింగ్ మెషిన్ లేదా చేతితో కానీ ఉతికేటప్పుడు గోరు వెచ్చని నీళ్లు, తేలికపాటి డిటర్జెంట్ ను మాత్రమే ఉపయోగిస్తే మంచిది. 

లోపలి  లైనింగ్స్ శుభ్రం చేయండి

మీ సూట్‌కేస్ లోపలి భాగం నైలాన్ లేదా ఇతర సింథటిక్ తో తయారు చేయబడితే, తడిగా ఉన్న వస్త్రంతో మృదువుగా తుడవాలి. లేకపోతే లిక్విడ్ సబ్బు నీళ్ళలో స్పాంజిని నానబెట్టి సూట్ కేసు లోపలి భాగాలను తుడుచుకోవాలి. తరువాత శుభ్రమైన నీళ్లలో నానబెట్టిన కాటన్ వస్త్రంతో కడగాలి. చివరిగా పొడి టవల్ తో తుడిచి గాలికి ఆరబెట్టాలి. తేమతో దుర్వాసన రాకుండా ఉండటానికి లోపలి భాగాల్లో బాగా ఆరే విధంగా చూసుకోవాలి. 

మరకలు ఉంటే వాటిని తుడవాలి

ఒక గిన్నెలో 2 పెద్ద చెంచాల  నీళ్లు, బేకింగ్ సోడా తీసుకొని పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టును సూట్ కేసు మీద ఉన్న మరకల పై రుద్ది 10 నిమిషాలు ఆగాలి. పాత టూత్ బ్రష్ తో స్క్రబ్ చేసి తడిగా ఉన్న గుడ్డతో శుభ్రం చేయాలి. అవసరమైతే, ఈ ప్రక్రియను మళ్లీ చేయండి. 

హ్యాండిల్, వీల్స్ ను క్రిమిసంహారకం చేయాలి

క్రిములు వ్యాప్తి చెందకుండా ఒక టిష్యూ పైన కొద్దిగా సైనిటేజర్‌ని పిండి  సూట్ కేసు ప్లాస్టిక్‌ హ్యాండిల్‌/లైనింగ్స్‌ వీల్స్ ని తుడుచుకోవాలి.

సూట్ కేసు బయటి భాగం శుభ్రం చేసుకోవడం

చిన్న చీపురు లేదా వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించి మీ సూట్‌కేస్ వెలుపలి భాగంలో ఉన్న మురికిని తొలగించండి.

సూట్‌కేసు బాడీని శుభ్రపరచండి

లెదర్ సూట్‌కేసుల కోసం, తయారీదారుని లేబుల్‌లో సూచించిన ప్రకారం లెదర్ షాంపూ, కండీషనర్‌ను ఉపయోగించాలి. ఫాబ్రిక్ సూట్‌కేసుల కోసం, తేలికపాటి డిటర్జెంట్ లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. చివరగా, అల్యూమినియం బ్యాగ్స్ అయితే, గోరువెచ్చని నీటిలో నానబెట్టిన తువ్వాలుతో తుడిచివేస్తే సరిపోతుంది. 

క్లీన్ జిప్పర్స్,మరియు లాచెస్ శుభ్రం చేసుకోండి

మీరు మీ సూట్‌కేసు వీల్స్, జిప్పర్‌లు ఇతర  హార్డ్‌ వేర్‌ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఒక గిన్నెలో సబ్బు నీళ్ళు  తీసుకొని అందులో ఓ గుడ్డను ముంచి హార్డ్‌ వేర్‌ని తుడుచుకోవాలి. మరో పొడి వస్త్రంతో తేమ లేకుండా తుడుచుకోవాలి, లేదా గాలిలో ఆరబెట్టిన సరే.

ఇలా చేసుకుంటే మీతో పాటు మీ లగేజ్‌ బ్యాగ్ మరో ప్రయాణానికి సిద్థంగా ఉన్నట్టే.

వ్యాసం మొదట ప్రచురించబడింది