మీ విభిన్న కాటన్ చీరలను ఎలా నిర్వహించాలి మరియు సంరక్షించాలి

కాటన్ చీరలు మసకబారకుండా ఉండడానికి వాటికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాటిని కొత్తగా ఉంచడం ఎలాగో ఇక్కడ సూచించబడింది

వ్యాసం నవీకరించబడింది

How to Maintain and Care for Your Different Cotton Sarees
ప్రకటన
Comfort core

కాటన్ చీరలు కలకాలం ఉంటాయి. అవి సౌకర్యవంతమైన, సౌందర్యంగలవి మరియు సొగసైనవి. కానీ మీరు మీ కాటన్ చీరలను సంభాళించుకోవాలి మరియు రాబోయే సంవత్సరాల్లో వాటిని ఉత్తమంగా చూడటానికి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.

మీ కాటన్ చీరలు ఉత్తమంగా కనిపించేలా ఉంచడానికి మా దగ్గర కొన్ని ఉపయోగకరమైన సంరక్షణ చిట్కాలు ఉన్నాయి.

కాటన్ కోటా చీర

సాదా నీరు మరియు తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించి మీ కాటన్ కోట చీరను చేతితో ఉతుక్కోవాలని మేము సూచిస్తున్నాము. వాషింగ్ మెషిన్ లో వీటిని ఉతకడం ఉత్తమైన ఆలోచన కాదు ఎందుకంటే దాని రాపిడి వల్ల దెబ్బతినవచ్చు. ఉతుక్కోవడానికి ముందు, మీ చీరను 5-6 నిమిషాలకు మించకుండా మాములు నీటిలో నానబెట్టండి. నీడ ఉన్న ప్రదేశంలో ఆరబెట్టండి. మీరు మీ చీరను ఇస్త్రీ చేయాలనుకుంటే, అతి తక్కువ వేడి అమరికను ఉపయోగించండి. మీ చీరను నిల్వ చేసేటప్పుడు దాన్ని గట్టిగా మడవటం మానుకోండి, బదులుగా, మీరు వ్రేలాడదీయడానికి మరియు నిల్వ చేయడానికి హ్యాంగర్‌ను ఉపయోగించండి.

కాటన్ చందేరి చీర

ప్రకటన
Comfort core

ఒక కాటన్  చందేరి చీర సార్వత్రిక ఆకర్షణీయంగా ఉంటుంది. వీటిని చల్లటి నీళ్లు మరియు తేలికపాటి డిటర్జెంట్ తో  ఉతకాలని గుర్తుంచుకోండి. మరియు, దీన్ని చేతితో ఉతుక్కోవడం మంచిది. ఎండకి ఆరబెట్టడం వల్ల రంగు వెలసిపోతుంది, కాబట్టి మీ చీరను ఆరబెట్టడానికి నీడ ఉన్న స్థలాన్ని ఎంచుకోండి. అలాగే, మీ చందరీసారీలో నేరుగా పెర్ఫ్యూమ్ వాడకుండా ఉండండి. నిల్వ చేసేటప్పుడు, మీ చీరను గట్టిగా మడవవద్దు, బదులుగా వదులుగా మడవడానికి హ్యాంగర్‌ను ఉపయోగించండి.

కాటన్ సంబల్పూర్ చీర

మీ కాటన్ సంబల్పూర్ చీర యొక్క మృదుత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి, ఎల్లప్పుడూ చల్లటి నీరు మరియు తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించి ఉతుక్కోవాలి. అలాగే, దీన్ని చేతితో ఉతకడం మంచిది, వాషింగ్ మెషీన్ వల్ల మీ చీర దెబ్బతింటుంది. మీరు మంచి తేలికపాటి డిటర్జెంట్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్‌ను ఉపయోగించటానికి ప్రయత్నించవచ్చు. మీ కాటన్ చీరను ఇస్త్రీ చేయడానికి ఎల్లప్పుడూ తక్కువ వేడి అమరికను ఎంచుకోండి.

మీ కాటన్ చీరను ఎప్పుడూ ప్లాస్టిక్ సంచిలో ఉంచవద్దని గుర్తుంచుకోండి. మీరు వాటిని పలుచని వస్త్రంలో లేదా శుభ్రమైన కాటన్ టవల్ లో చుట్టి దుమ్ము లేకుండా ఉంచండి.

అలాగే, మీరు మొదటిసారిగా మీ కాటన్ చీరను ఉతుకుతున్నట్లయితే, ఉతకడానికి ముందు 20 నిమిషాల పాటు ఉప్పుతో కలిపిన బకెట్ నీటిలో నానబెట్టండి. ఇది రంగును లాక్ చేయడానికి మరియు పాడుకాకుండ ఉండే విధంగా సహాయపడుతుంది.

ఈ సంరక్షణ మరియు నిర్వహణ చిట్కాలతో, మీరు మీ కాటన్ చీరలను చాలా కాలం పాటు చక్కగా చూడవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది