
మన చిన్నారుల దుస్తులను, సూక్ష్మక్రిమిరహితంగా మరియు పరిశుభ్రమైన స్థితిలో ఉంచడం చాలా అవసరం అని, మన అనుభవం మనకు ఎన్నోసార్లు నేర్పింది. పసికందులు చాలా సున్నితమైన చర్మం కలిగి ఉంటారు. అందువల్ల, సరైన సంరక్ష్ణ లేకపోతే, వారి చర్మం ఎన్నో రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. కనుకనే, వారు ఎల్లప్పుడూ, శుభ్రంగా మృదువుగా, సూక్ష్మక్రిములు మరియు బాక్టీరియా దరి చేరకుండా, హాయిగే మరియు సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించి ఉండేలా జాగర్తలు తీసుకోవాలి. సాధారణంగా పసికందుల దుస్తుల పై చిందే పాల వల్ల, దుస్తులు నుంచి ఒక విధమైన పాల వాసన వస్తూ ఉంటుంది. దానిని పోగొట్టేందుకు, మనం దుస్తులను పదే పదే శుభ్రపరచడం వల్ల, అవి మొద్దుబారినట్టు అయి, శిశువు ధరించినప్పుడు, వారికి ఎంతో చికాకును కలిగిస్తాయి. దీనికి తోడు, మనం సాధారణంగా వాడే డిటర్జెంట్నే, పసికందుల దుస్తులను శుభ్ర పరచడానికి కూడా వినియోగించడం వల్ల, ఆ డిటర్జెంట్లలో ఉండే కెమికల్ పదార్ధాలు, చిన్నారుల చర్మానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తాయి. అటువంటప్పుడు, ఇంటి చిట్కాలు అయిన వెనిగర్ ను ఉపయోగించినా కూడా, అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా, ఒక విచిత్రమైన దుర్వాసనను దుస్తులు మీద వదిలి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కనీసం, దుస్తులను అంటి పెట్టుకొని ఉండే, సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాను, వదిలించడంలో కూడా, ఈ చిట్కా ఏమాత్రం తోడ్పడదు. ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు చేసిన తరువాత, మీ చిన్నారుల దుస్తులను మృదువుగా, సురక్షితంగా ఉంచడానికి మేము మీ ముందుకు కొన్ని చిట్కాలతో వచ్చేశాము. అవేమిటో, ఒకటొకటిగా చూద్దాము.
మీ చిన్నారులకు తగ్గ దుస్తులనే ఎంచుకోండి
మీ చిన్నారులకు దుస్తులను కొనేటప్పుడు, తేలికగా సంరక్షించుకోగలిగేవి, తొందరగా ఆరేవాటిని మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా గాలి ఆడే కాటన్ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆ దుస్తులు చెమటను అరికట్టడంతో పాటు, చర్మానికి ఎటువంటి చికాకు కలగకుండా చూసుకుంటాయి. ప్రత్యేకమైన సూచనలతో వచ్చేఇతర దుస్తుల కన్నా, కాటన్ ను తేలికగా వినియోగించవచ్చు. అంతే కాకుండా, గజ్జలు, చమ్కీలు, తళుకుబెళుకు హంగులు ఉండే దుస్తులు, చిన్నారుల శరీరానికి హాని కలిగించే ప్రమాదం ఉంది కనుక, అటువంటి దుస్తులను ఎంచుకోకపోవడమే మంచిది. పైగా, అటువంటి దుస్తులను శుభ్రపరచేటప్పుడు, ఆ చమ్కీలు ఊడి పడిపోయే అవకాశం కూడా ఉంది.