
దుస్తుల నుంచి దుర్వాసనను దూరం చేయడం కోసం, వాటిని పదే పదే ఉతకడం వల్ల, దుస్తుల పోగులు ఊడిపోవడం, వాటికి రంధ్రాలు పడటం వంటి ఇబ్బందులు ఎదురవడం సహజం అని, మన అనుభవం మనకు ఎన్నోసార్లు నేర్పింది కదా!! కానీ, ఇలా జరగడం, మనకు ఎంత మాత్రమూ ఇష్టముండదు. అందులోనూ, ఖరీదయిన దుస్తుల విషయంలో ఇలా జరిగితే, మనకు ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ మీ దుస్తులలో, ఎక్కువగా చెమట పట్టే దుస్తులు ఉంటే కనుక, అదేనండీ మీరు జిమ్ కు వేసుకువెళ్ళే దుస్తుల గురించి !! అటువంటి దుస్తులు, ఒకసారి ఉతికిన తరువాత కూడా, చెమట వాసన వస్తూ ఉంటే, దాని అర్ధం అవి మురికిగా ఉన్నాయని ఎంత మాత్రమూ కాదు. కాకపోతే, మనం ఒకసారి ఉతికిన తరువాత, అవి చక్కగా, పరిమళభరితంగా ఉండాలని మాత్రం కోరుకుంటాము. అవునా ? అందుకోసం మనం, ఇంటి చిట్కాలు అయిన, కాఫీ, వెనిగర్ మరియు బేకింగ్ సోడా వంటి ఎన్నిటినో ఉపయోగించినా కూడా, ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నాము. అయినా ఏమి పర్లేదు. మీ దుస్తులను పదే పదే ఉతికే అవసరం లేకుండానే, వాటిని ఎల్లప్పుడూ తాజాగా, అందంగా ఉంచడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి. రండి, అవేమిటో చూద్దాము.
మీ దుస్తులను వెంట వెంటనే శుభ్రం చేసుకోండి
మీ దుస్తుల నుంచి దుర్వాసనను దూరం చేయడానికి, మీరు మొదటగా చేయవలసినది ఏమిటంటే, వాటిని వాడిన వెంటనే శుభ్ర పరచడం. మీ చెమట పట్టిన దుస్తులను, ఎక్కువ సమయం లాండ్రీలో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే, ఆ తరువాత వాటి నుంచి దుర్వాసనను తొలగించడం చాలా కష్టం అవుతుంది కనుక. మీరు ఈ దుస్తులను ఎంత తొందరగా శుభ్ర పరిస్తే, మీరు అంత తేలికగా, వాటి నుంచి బ్యాక్టీరియా, క్రిములు మరియు చెడు వాసనలను తొలగించగలుగుతారు.
చెడు వాసనను తొలగించడం కొరకు గోరువెచ్చని నీటిని ఉపయోగించండి
మా అనుభవంలో, మేము తెలుసుకున్నది ఏమిటంటే, మురికి బట్టలను గోరువెచ్చని నీటిలో ఉతకడం ఎంతో అవసరం అని. అయితే, మీ దుస్తులను సురక్షితంగా ఉంచుతూనే, వాటిని ఎంత ఎక్కువ వేడి నీటిలో వాష్ చేయవచ్చు అన్న విషయాన్ని, మీరు మీ వస్త్రాల మీద ఉన్న లేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, ఆ దుస్తులను ఉతికే ముందు, ఓ పది నిముషాల పాటు, డిటర్జెంట్లో నానబెట్టడం మంచిది అని మా అభిప్రాయం. ఒకవేళ ఆ దుస్తుల నుంచి దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే కనుక, అప్పుడు వాటిని 30 నుంచి 45 నిముషాల పాటు, నానబెట్టడం చాలా అవసరం.

దుస్తులను శుభ్రపరచిన తరువాత, వాటిని మెత్తగా మరియు పరిమళభరితంగా ఉంచడానికి దోహదపడే, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ను వినియోగించమని, మేము సూచిస్తాము. ఒకసారి కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ తో ఉతికిన తరువాత, పాత దుస్తులు కూడా అచ్చంగా క్రొత్త వాటిలా కనిపించడాన్ని మేము గమనించాము. అది దుస్తులకు చక్కటి మెరుపును అందించడంతో పాటు, అవి రోజంతా పరిమళభరితంగా ఉండేలా కూడా చేస్తుంది. అలాగే, ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించడం కూడా, చాలా తేలిక అని మేము గ్రహించాము. కేవలం అర కప్పు లిక్విడ్ తో, బోలెడన్ని బట్టలకు పరిమళాన్ని, మృదుత్వాన్ని అందించవచ్చు. దీని యొక్క వినియోగం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, ప్యాకింగ్ పైన ఉన్న సూచనలను చదవండి.
మెషిన్లో వేసే దుస్తులు ఓవర్ లోడ్ కాకుండా చూసుకోవడం చాలా అవసరం
ఒక వాష్ సైకిల్ లో, మెషిన్లో ఎన్ని దుస్తులు వేస్తున్నాము అన్న విషయాన్ని గమనించుకోవడం ఎంతో అవసరం. ఒకవేళ, మెషిన్ ఓవర్ లోడ్ అయితే కనుక, అప్పుడు లోపల దుస్తులు సరిగ్గా తిరగడానికి వీలు పడదు. అటువంటప్పుడు, దుస్తులు శుభ్రంగా వాష్ చేయబడవు. అందువల్ల, చెమట మరియు దుర్వాసన బట్టలను వదిలి వెళ్ళడం అనేది జరగదు. ఎక్కువగా చెమట పట్టే దుస్తులకు, మెషిన్ అనుమతించినట్లయితే, మరో రిన్స్ సైకిల్ జోడించి, వాష్ చేయడం మంచిది అని కూడా మేము గమనించాము. అలా బట్టలు వాష్ చేయడం పూర్తి అవగానే, వాటిని వెంటనే బయటకు తీసి, ఎండలో ఆర వేయండి.
చెడు వాసనలను తొలగించడానికి, దుస్తులను ఎండలో ఆరబెట్టాలి
మీ దుస్తులను పదే పదే ఉతికే అవసరం లేకుండానే, వాటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడానికి, అన్నిటికన్నా తేలికయిన పద్ధతి ఏదన్నా ఉంది అంటే, అది వాటిని ఎండలో ఆరబెట్టడమే !! ఫాబ్రిక్ కండిషనర్ కు, సూర్యరశ్మి తోడయితే కనుక, అది ఎటువంటి దుర్వాసనను అయినా, అత్యంత సమర్థవంతంగా తొలగిస్తుంది. మీ దుస్తులు, వీచే గాలికి అలా అటు ఇటూ కదలాడుతూ ఉంటే, అప్పుడు చిన్న చిన్న పోగుల ద్వారా, దుస్తులలోకి గాలి సహజంగా ప్రవహించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా దుస్తులలోకి చక్కగా గాలి ప్రవేశించాలి అంటే, వాటిని కనీసం ఒక గంటసేపయినా, ఎండలో ఆరబెట్టడం అవసరం అని, మేము గమనించాం. ఇలా చేయడం వల్ల, దుస్తులను రెండుమూడు సార్లు ఉతికే అవసరం లేకుండానే, వాటి నుంచి దుర్వాసనను దూరం చేయడం సాధ్యపడుతుంది.
వాసనలను గ్రహించడానికి వార్తాపత్రికను ఉపయోగించండి
ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, మీ దుస్తులను ఎల్లప్పుడు శుభ్రంగా మరియు పరిమళభరితంగా ఉంచాలి అంటే, వార్తాపత్రికలను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. అదెలా అంటారా ? న్యూస్ పేపర్ తో, కొన్ని ఉండలను తయారు చేసి, వాటిని రాత్రంతా చెమట పట్టే అవకాశం ఉండే ప్రదేశాలలో ఉంచండి. అప్పుడు ఆ కాగితపు ఉండ, దుర్గంధాలతో పాటు తేమను కూడా మొత్తంగా పీల్చేసుకుంటుంది. ఒకవేళ రాత్రంతా కుదరకపోయినా, కనీసం కొన్ని గంటల పాటు అన్నా, ఆ న్యూస్ పేపర్ ఉండలను, చెమట పట్టే ప్రదేశాలలో ఉంచితే, అవి చక్కటి ఫలితాలను ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ చిట్కా కేవలం, చక్కటి ఫ్యాబ్రిక్ కండిషనర్ ను ఉపయోగించిన తరువాత పాటిస్తే మాత్రమే ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది.
ఈ చిట్కాల ద్వారా, మీ దుస్తులను పదే పదే ఉతికే అవసరం లేకుండానే, వాటి నుంచి వచ్చే దుర్వాసనను వదిలించుకోండి.