టైటిల్: రోజువారీ వినియోగించే దుస్తులను సంరక్షించుకోవడానికి చిట్కాలు

ప్రతీ రోజూ బట్టలు ఉతకడం అనేది మన ఇళ్ళల్లో సాధారణంగా జరిగే ప్రక్రియే కదా! అయితే, ఇలా ప్రతీ రోజూ ఉతకడం వల్ల, బట్టలకు చిన్న రంధ్రాలు ఏర్పడటం, కుచించుకుపోవడం, రంగులు వెలిసిపోవడం, పోగులు ఊడి రావడం, ఇలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే, ఇలా అవడం మనలో చాలా మందికి నచ్చదు. అందుకే, సాధ్యమైనంత వరకు వీటిని నివారించాలని ప్రయత్నిస్తాము. అలా, మీరు దుస్తులను ఎప్పుడూ క్రొత్త వాటిలా ఉంచడానికి కొన్ని సూచనలు చూడండి.

వ్యాసం నవీకరించబడింది

బట్టలు ఉతికేప్పుడు కావాల్సిన చిట్కాలు
ప్రకటన
Comfort core

మనకు ఎంతో ఇష్టమైన దుస్తులను, ఒకసారి నీటిలో ఉతికి బయటకు తీసి చూడగానే, అవి వాటి రంగు మారిపోవడం మనం చాలా సార్లు గమనించే ఉంటాము. మనలో చాలా మందికి సాధారణంగా ఎదురయ్యే అనుభవమే ఇది. మరికొందరు అయితే, బట్టలు కుంచించుకుపోవడం, వాటి ఆహార్యం మారిపోవడం, పోగులు, బటన్లు ఊడి రావడం వంటి రకరకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఉంటారు. అయితే, మనం చాలా సార్లు ఏమని అనుకుంటాము అంటే, ఒకసారి దుస్తులను మెషీన్లో వేసి, అంత డిటర్జెంట్ వేస్తే సరిపోతుంది అని. కానీ, చాలా సార్లు అది మాత్రమే సరిపోదు. అలా చేయడం వల్ల ఎన్నో సార్లు, మన దుస్తులు రంగు వెలిసిపోవడమో, చిరిగి పోవడమో, ఇంకా చెప్పాలి అంటే, అస్సలు ఉతికినట్లు అనిపించకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళా అటువంటి సమస్యల నుంచి బయట పడటానికి, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తూ కూడా ఉంటాము. అందులో భాగంగా, మనం కాస్తంత వెనిగర్ ను కలిపి బట్టలు ఉతికితే, అది మనం అనుకున్న ఫలితం కాకుండా, వేరేదో ఫలితాన్ని ఇచ్చి, మనకి మరింత పని పెడుతుంది. ఇలాంటి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి, ప్రతీ ఉతుకు తరువాత, మీ దుస్తులను సురక్షితంగా ఉంచుకోవడానికి, పాటించవలసిన కొన్ని చిట్కాలను గుర్తించాము.

వస్త్రాల కేర్ లేబుల్ మీద ఉండే సూచనలను జగర్తగా పాటించండి

వస్త్రాల యొక్క కేర్ లేబుల్ మీద ఇచ్చే సూచనలను జగర్తగా పాటించడం ద్వారా, మీరు మీ దుస్తులను ఎక్కువ కాలం మన్నేలా చేసుకోవచ్చు. కేర్ లేబుల్ అనేది, వస్త్రాలను చేతితో ఉతకాలా లేక మెషిన్లో ఉతకాలా అన్న విషయాలతో పాటు, ఉతికిన వెంటనే, వాటికి కుంచించుకుపోయే స్వభావం ఉందా లేదా వంటి ఎన్నో వివరాలను తెలియచేయడం మేము గమనించాము. ఈ సమాచారం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే, తగిన విధానంలో దుస్తులను శుభ్రం చేస్తూ, వాటిని జగర్తగా సంరక్షించుకోవడానికి, కనీసంగా అరుగుదల మరియు తరుగుదలని కలిగించి , ఈ సూచనలు ఎంతో దోహదపడతాయి. దుస్తులు శుభ్రం చేసేటప్పుడు ఉండవలసిన నీటి ఉష్ణోగ్రత దగ్గర నుంచి, దుస్తులను ఇస్త్రీ చేసేటప్పుడు తీసుకోవలసిన జగర్తల వరకూ, మీరు మీ దుస్తులను సంరక్షించడం కొరకు పాటించవలసిన ప్రతీ ముఖ్యమైన సూచనను ఈ లేబల్ తెలియ చేస్తుంది.

మీ దుస్తులను లోపల నుంచి బయట వైపుకు ఉతకండి

బట్టలు ఉతికే సమయంలో, దుస్తుల పై భాగాన్ని సురక్షితంగా ఉంచడానికి, ఒక చక్కటి మార్గం ఉంది. మేము దీనిని ప్రయత్నించి చూశాము. మాకు అయితే అద్భుతంగా పని చేసింది. అందుకే, మీకు కూడా చెప్దాము అని అనుకున్నాము. దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, ఉతకడానికి మీ దుస్తులను నానబెట్టే ముందు, వాటిని తిరగ తిప్పి నానబెట్టండి. ఆలోచించి చూస్తే, ఇది చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ, అది మన దుస్తుల యొక్క, అలంకారాలు, ఎంబ్రాయిడరీ, బీడింగ్ మొదలైన వాటిని  చెక్కు చెదరకుండా, సురక్షితంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతే కాకుండా, ఈ చిన్న చిట్కా ద్వారా, దుస్తుల మీద ఉన్న ప్రింట్లను మరియు దుస్తుల రంగులను వెలిసిపోకుండా కూడా కాపాడుకోవచ్చు.

ప్రకటన
Comfort core

మంచి ఫ్యాబ్రిక్ కండిషనర్ ను వినియోగించడం

మనలో చాలా మంది, ఫాబ్రిక్ కండిషనర్ యొక్క వినియోగం, దుస్తులను మృదువుగా, పరిమళభరితంగా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటాము. కానీ, అంతకు మించిన మరెన్నో ప్రయోజనాలు కలిగి ఉంది అనంటే, మీరు ఆశ్చర్యపోక మానరు. ఇప్పుడు ఇక్కడ, మేము ముఖ్యంగా మాట్లాడేది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ గురించి. దాని వినియోగం, మా దుస్తులు ఎక్కువ కాలం మన్నేలా చేసింది అని చెప్పడంలో, ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. అందుకు గల కారణాన్ని, మేము లేబుల్ పూర్తిగా చదివిన తరువాతనే తెలుసుకున్నాము. అదేమిటంటే, కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ కు, దుస్తుల యొక్క, ప్రతీ పోగుకు ఒక సురక్షితమైన పొరను ఏర్పాటు చేసే శక్తి ఉంది. ఈ పొర వాషింగ్ మెషిన్లో తక్కువ ఘర్షణను అనుమతిస్తుంది, తద్వారా దుస్తుల అరుగుదలను తగ్గిస్తుంది. అందుచేతనే, ఈ ఫాబ్రిక్ సాఫ్టనర్ ను వినియోగించడం వల్ల, మా దుస్తులు ఎక్కువ కాలం మన్నుతున్నాయి అన్న విషయాన్ని గ్రహించాము. దానితో పాటు, మా దుస్తులు మునిపటి కన్నా, అంటే కేవలం డిటర్జెంట్ మాత్రమే వాడుతున్నప్పటి కన్నా, ఇప్పుడు మరింత మెత్తగా ఉండటాన్ని కూడా గమనించాము. అలాగే, ప్రతీ వాష్ తరువాత, మా దుస్తులు, ఏమాత్రం రంగు మారకుండా, ఆహార్యం మారకుండా, కొన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అలానే ఉండటాన్ని గమనించాము.

దుస్తులు రంగు మారకుండా ఉండడానికి, వాటిని గాలికి ఆరబెట్టండి

డ్రైయర్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ, దాని నుంచి వచ్చే వేడి వల్ల, దుస్తులు దెబ్బతింటున్నట్లు మేము చాలా సార్లు గమనించాము. ఎలక్ట్రిక్ డ్రైయర్లు దుస్తులు కుంచించుకుపోవడానికి కారణమవడమే కాక, అవి వెలిసిపోయినట్టుగా కనపడేలా కూడా చేస్తాయి.  అందువల్లనే మేము, సాధ్యమైనంత వరకూ, ర్యాక్ల  పైన ఆరేసే బట్టలకు, గాలి ద్వారా ఆరే వెసులుబాటును, కల్పించమని సూచిస్తాము.

మీ దుస్తులను సరయిన పద్ధతిలో భద్రపరచుకోండి

మనం సాధారణంగా ఇంటికి వచ్చిన వెంటనే, మన దుస్తులను, కుర్చీల మీదనో లేక మంచాల మీదనో ఆరేస్తూ, ఇంకా చెప్పాలి అంటే కొన్నిసార్లు అలా విసురుగా పడేస్తూ కూడా ఉంటాము. ఆ తరువాత, అలా మడతలు లేని వాటిని, అల్మారాలలోకి తోసేస్తూ కూడా ఉంటాము. కానీ, మీరు మీ దుస్తులను భద్ర పరిచే విధానం, వాటి మన్నిక మీద ప్రభావం చూపుతాయని మీకు తెలుసా ? ఆ ప్రశ్నకు సమాధానంగానే, మేము గమనించిన కొన్ని విషయాలను మీకు చెప్తాము. అందులో మొదటగా, స్వెట్టర్లను హ్యాంగర్లకు వేలాడదీసే బదులు, వాటిని చక్కగా మడతలు వేసి, అల్మారాలో, ఒక దాని మీద ఒకటి అందంగా అమర్చి పెడితే కనుక, అప్పుడు అవి వాటి ఆకృతిని, ఎంతో కాలం కాపాడుకోగలవు అని మేము గమనించాము. చాలా సందర్భాల్లో, మీరు వాడే హ్యాంగర్లు కూడా, తేడాను చూపించగలవు. అదెలా అనుకుంటున్నారా ? వైరు హ్యాంగర్లు కానీ లేదా ప్లాస్టిక్ హ్యాంగర్లు కానీ, మీ దుస్తుల యొక్క భుజాలను వెడల్పు చేసే ప్రమాదం ఉంది. అందుకే, సాధ్యమైనంత వరకూ, చెక్క హ్యాంగర్ల వినియోగానికే ప్రాముఖ్యత ఇవ్వడం ఎంతో మచింది. అలాగే, మా అనుభవం మాకు నేర్పిన మరొక విషయం ఏమిటి అంటే, దుస్తులను ప్లాస్టిక్ షీట్ల కన్నా, కాటన్ షీట్లు లేదా కాటన్ బ్యాగ్లలో భద్ర పరచడం ఎంతో మంచిది అని. ఎందుకంటే, ప్లాస్టిక్ షీట్లు ఎక్కువగా తేమను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటాయి. తద్వారా అవి ఆ తేమను, దుస్తులకు కూడా అంటించి, వాటిని పాడు చేసే ప్రమాదం కూడా ఉంటుంది కనుక.

మీ దుస్తులు పాడవకుండా ఉండటానికి, వాటిని మార్చి మార్చి వినియోగిస్తూ ఉండండి

‘ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్’ రూలు కేవలం ఉత్పతులకే కాదు, మన అల్మారాలో ఉండే బట్టలకు కూడా వర్తిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది ఏమో కానీ, ఈ చిన్న రూలు పాటించడం ద్వారా, మీరు మీ దుస్తులను పాడవకుండా, చిరుగు పడకుండా కాపాడుకోవచ్చు. అందుకోసం, మీరు శుభ్రంగా ఉతికిన దుస్తులను, మీ అల్మారాలో వెనకకు సర్ది పెట్టుకోండి. అలా చేయడం ద్వారా, అల్మారాలో ఏమేమి దుస్తులు ఉన్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తాయి మరియు తీసుకోవడానికి కూడా తేలికగా ఉంటుంది.

ఇక పై, ఈ చిట్కాలు పాటిస్తూ, మీ దుస్తులను ఎల్లప్పుడూ క్రొత్త వాటిలా మెరుస్తూ ఉండేలా చూసుకోండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది