మీ పట్టు చీరలను ఎలా చక్కగా ఉంచుకోవాలి

ఒక పట్టు చీర ఎల్లప్పుడూ అద్భుతంగా కనిపిస్తుంది. మరి అలాంటి దాన్ని మీరు ఎలా చక్కగా ఉంచుకోవాలో మరియు శ్రద్ధ వహించవచ్చో ఇక్కడ ఉంది సూచించబడింది.

వ్యాసం నవీకరించబడింది

How to Maintain Your Silk Sarees
ప్రకటన
Comfort core

పట్టు చీర సృష్టించే ప్రభావం సాటిలేనిదిగా ఉంటుంది. మీరు మీ పట్టు చీరలను సరిగ్గా నిల్వ చేసి, నిర్వహిస్తే, రాబోయే సంవత్సరాల్లో మీరు వాటి మెప్పును అలానే కొనసాగించవచ్చు మరియు ఇంకా ఏమిటంటే, మీరు వాటిని రాబోయే భవిష్యత్ తరాలకు కూడా అందించవచ్చు.

వాటి ప్రకాశమానమైన మెరుపు మరియు వాటి రూపలావణ్యములు కాపాడుకోవడానికి ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి.

దాన్ని సరిగ్గా నిల్వ చేయండి

మీ పట్టు చీరలకు ఊపిరి అవసరం, అందువల్ల ప్లాస్టిక్‌లో నిల్వ చేయడం సిఫారసు చేయడం లేదు . మీరు చేయవలసింది ఏమిటంటే, మృదువైన నూలు వస్త్రంలో చుట్టండి. అలాగే, వెలుతురు  మరియు ధూళి మీ పట్టు చీర యొక్క శత్రువులు అని గుర్తుంచుకోండి, కాబట్టి మీరు దానిని సరిగ్గా సంరక్షించుకున్నారని నిర్ధారించుకోండి.

గాలికి ఆరనివ్వాలి

ఇతర వస్త్రంలాగానే, మీ చీరకు ఎప్పుడు స్వచ్ఛమైన గాలి తాకే విధంగా సుకుంటే మంచిది. ప్రతి 2-3 నెలలకు, మీ పట్టు చీరను నీడలో 10 నిమిషాలు గాలి తీసుకొనే విధంగా చూసుకోవాలి. ఏదేమైనా, ప్రత్యక్షంగా ఎండ పడే  ఉండే చోట వీటిని ఎక్కువసేపు బహిర్గతం చేయవద్దు.

ప్రకటన
Comfort core

హ్యాంగర్‌లు వాడండి

మీ చీరల కోసం ఎల్లప్పుడూ  హ్యాంగర్‌లను ఉపయోగించడం మంచిది ఎందుకంటే ఇలా చేస్తే ముడతలు పడకుండా ఉంటాయి. మెటల్ హ్యాంగర్‌లు వాడకూడదు ఎందుకంటే మెటల్, పట్టుతో స్పందించి అసహ్యకరమైన తుప్పు మరకలకు దారితీస్తాయి అందుకే వాటిని ఉపయోగించవద్దు. దానికి బదులుగా మీ పట్టు చీరను చెక్క హ్యాంగర్‌లపై వేలాడదీయండి.

వికర్షకాలను వాడండి

చిమ్మటలు మరియు సిల్వర్ ఫిష్లను దూరంగా ఉంచడానికి, కలరా ఉండలని ఉపయోగించండి. ఏదేమైనా, కలరా ఉండ  చీరను నేరుగా తాకకూడదు,  ఎందుకంటే అవి జరీకి ఉన్న రంగును మస్కా మారుస్తూంది.  వాటిని మీ చీరకు దూరంగా లేదా మీ బట్టలకు సమీపంలో ఉన్న పర్సులో ఉంచండి. యాంటీ-పెస్ట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉన్న కర్పూరం, ఎండిన మిరపకాయలు లేదా ఎండిన వేప ఆకులు వంటి సహజ పదార్ధాలను కూడా మీరు  మీ చీర దగ్గర ఉంచవచ్చు.

తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించి ఉతకాలి

మీ చీరలను ఉతకడం కోసం , తరచుగా వాడే డిటర్జెంట్ కాకుండా తేలికపాటి డిటర్జెంట్ వాడే విధంగా చూసుకోండి. ఇది పనిని సమర్థవంతంగా చేస్తుంది మరియు మీ చీర యొక్క బట్ట దెబ్బతినకుండా కాపాడుతుంది. మీరు ద్రవ డిటర్జెంట్‌ను కూడా ఉపయోగించవచ్చు. మేమైతే సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ సరైన ఎంపిక అని సూచిస్తాం .

ఈ చిట్కాలను ప్రయత్నించండి మరియు మీకు ఇష్టమైన పట్టు చీర పాడైపోవడం గురించి మీరు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!

వ్యాసం మొదట ప్రచురించబడింది