మీ రిఫ్రిజిరేటర్‌లో అప్రియకరమైన దుర్వాసనకు గుడ్‌ బై చెప్పేందుకు సరళ సూచనలు

మీరు మీ రిఫ్రిజిరేటర్‌ని తెరిచినప్పుడు అప్రియకరమైన, దుర్వాసన వస్తోందా. చింతించకండి. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ఈ సమస్యను సులభంగా పరిష్కరించేందుకు ఈ సూచనలు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Simple Tips to Bid the Unpleasant Odour in Your Refrigerator Goodbye
ప్రకటన
Vim Dishwash Gel

రోజులో బ్రేక్‌ఫాస్ట్‌ అత్యంత ముఖ్యమైన భోజనం అనే విషయం నిపుణులు చెబుతున్నారు, కానీ ఫ్రిజ్‌ వాసన వస్తుంటే మీరు తక్షణం ఆకలి కోల్పోతారు. తమ చీజ్‌ కోడిగుడ్లు వాసనతో, లేదా కోడిగుడ్లు కూర వాసనతో ఉండాలని ఎవ్వరూ కోరుకోరు.

మీరు ఫ్రిజ్‌ తెరవగానే రెండు రాత్రుల క్రితం మీరు వండిన డిన్నర్‌ వాసన వస్తుండటంతో విసిగిపోతున్నారా? అయితే మీ ఫ్రిజ్‌ని శుచిగా, శుభ్రంగా మరియు తాజా సువాసనతో ఉంచేందుకు మీకు సహాయపడే కొన్ని సూచనలు మా వద్ద ఉన్నాయి!

రిఫ్రిజిరేటర్‌ లోపల శుభ్రం చేసేందుకు ఎప్పుడూ బ్లీచ్‌ని ఉపయోగించకండి ఎందుకంటే ఇది మీ ఆహారాన్ని కలుషితం చేయవచ్చు. ఆహారానికి దగ్గరలో ఉపయోగించడానికి సురక్షితమైన ఉత్పాదనలు మాత్రమే ఉపయోగించండి.

1) డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ మరియు గోరువెచ్చని నీళ్ళు ఉపయోగించండి

మీ రిఫ్రిజిరేటర్‌ని శుభ్రంచేయడం మీరు అనుకున్న దానికంటే సులభంగా ఉంటుంది. మీ ఫ్రిజ్‌ని ఖాళీ చేయడం ద్వారా ప్రారంభించండి, అవసరం లేని వస్తువులను వదిలించుకోండి. ఆ తరువాత షెల్వ్‌లు మరియు డ్రాయర్‌లు తీయండి. 3-4 చుక్కల డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ని ఒక బౌల్‌ గోరువెచ్చని నీటిలో కలిపి క్లీనింగ్‌ ద్రావణం తయారుచేయండి. ఈ ద్రావణంలో స్పాంజిని ముంచి మీ ఫ్రిజ్‌ లోపలి భాగాన్ని బాగా తుడవండి. దుర్వాసనకు గల మూల కారణాన్ని పోగొట్టేందుకు ఇది సహాయపడుతుంది.

ప్రకటన

Vim Dishwash Gel

ఏ ఉత్పాదననైనా ఉపయోగించడానికి ముందు, నిర్దేశాలను చదవండి మరియు మొదటగా దానిని ఫ్రిజ్‌లో కొద్ది ప్రాంతంపై పరీక్షించండి. ఎల్లప్పుడూ లేబుల్‌పై గల సూచనలు పాటించండి.

2) శక్తివంతమైన ఫ్రిజ్‌ దుర్వాసన నివారిణిని ఉపయోగించండి

మీ రిఫ్రిజిరేటర్‌ని బాగా శుభ్రంచేసిన తరువాత కూడా, మీకు దుర్వాసన వస్తుంటే, చింతించకండి. ఈ వదలకుండా ఉన్న దుర్వాసనను పోగొట్టేందుకు, మీ ఫ్రిజ్‌ లోపల చిన్న బౌల్‌లో బేకింగ్‌ సోడా పెట్టండి, ఇది దుర్వాసనను సంగ్రహిస్తుంది. ప్రత్యామ్నాయంగా, ఈ పని చేయడానికి మీరు వాణిజ్య ఉత్పాదనను కూడా ఉపయోగించవచ్చు.

3) నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీయండి

మీ రిఫ్రిజిరేటర్‌ నుంచి అప్రియకరమైన వాసనలను వదిలించుకోవడం మరొక పని, కానీ మ్యాట్‌ దుర్వాసనను పోగొట్టడం మరొక పని! ఇది సరళమైనది, మీ ఫ్రిజ్‌ని తనిఖీ చేసేందుకు మరియు నిల్వ ఉన్న ఆహార వస్తువు దేనినైనా తొలగించేందుకు ప్రతి వారం కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. కుళ్ళిపోయిన ఆహారం దుర్గంధం వెదజల్లుతుంది మరియు ఇతర పదార్థాలను కూడా కలుషితం చేస్తుంది.

4) బాగా నిల్వ చేయండి

ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టడానికి ముందు మూత బిర్రుగా పెట్టడం లేదా వాసన బయటకు రాకుండా ఆపేందుకు దానిని గాలి సోకని డబ్బాలో నిల్వ చేయడం దుర్వాసనను పోగొట్టడానికి చేసుకోవలసిన మంచి అలవాటు.

వ్యాసం మొదట ప్రచురించబడింది