మీ పాత్రలు కొత్త వాటి వల్లే తళ తళ మెరవాలంటే ఏం చేయాలి

మనం తరుచుగా వండుకునే పాత్రలు కొద్దికాలం తరువాత నల్లగా, జిడ్డుగా మారుతాయి. మీ వంటింటి పాత్రలను శుభ్రం చేయడానికి మరియు వాటిని సేనిటైజ్ చేయడానికి సరైన పద్ధతులు క్రింద సూచించబడ్డాయి

వ్యాసం నవీకరించబడింది

How to Deep-Clean Your Utensils and Restore their Shine
ప్రకటన
Vim Dishwash Gel

మీ కుటుంబానికి వంటచేసిపెట్టడంలో మీరు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు, కాని కొన్ని సార్లు వంట పూర్తిచేసిన తరువాత పాత్రలను వెంటనే కడగడానికి వీలుకాకపోవచ్చును. అలా చేయడం వల్ల మీ పాత్రలపై జిడ్డు మరియు మలినం పేరుకుపోతుంది. ఈ వ్యాసంలో, మీ వంటపాత్రలు మురికి లేకుండా చేసుకోవడానికి కొన్ని సహాయకరమైన శుభ్రతకు సంబంధించిన  చిట్కాలు సూచించబడ్డాయి.

1) స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు

ఒక గిన్నెలో గోరు వెచ్చని నీళ్లు తీసుకోవాలి. వాటిలో డిష్ వాషింగ్ ద్రవం కలపాలి. డిష్  స్ర్కబ్బర్ తో పాత్రల మీద ఉండే మరకల పై రుద్ది నీళ్లు పోసి కడగాలి.. ఒకవేళ  స్టీల్ పాత్రల పై బాగా మాడిపోయిన మరకలు ఉంటే వీటిని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీళ్లల్లో 1 చిన్న చెంచా వెనిగర్ కలపాలి. మాడిన మరకల పై డిష్‌ స్క్రబ్బర్‌ను ఉపయోగించాలి మరియు 10 నిమిషాలు ఆగాలి. దాని తరువాత బేకింగ్ సోడా మాడినచోట కొంచెం చల్లి రుద్దాలి. మంచి నీటితో కడిగేసుకోవాలి.  

2) అల్యూమినియం పాత్రలు

మరకలను రుద్దడానికి డిష్‌వాషింగ్‌ ద్రవం(పైన పేర్కొనబడినట్లుగా) యొక్క శుభ్రపరచే ద్రావకాన్ని ఉపయోగించండి. అవి వదలకుండా ఉంటే, శుభ్రంగా ఉన్న పాత్రలో నీటిని పోసి మరగకాచాలి. మరిగిన నీటిని జాగ్రత్తగా ఒక బకెట్‌లో పోసి 2 పెద్ద చెంచాల నిమ్మ రసాన్ని కలపాలి. అల్యమినియమ్‌  గిన్నెలను దానిలో వేసి అరగంట వేచి ఉండాలి. నీరు పారబోసి పాత్రలు  చల్లబడేలా చూడాలి. డిస్‌వాషింగ్‌ ద్రావకం మరియు డిష్‌ స్క్రబ్బర్‌తో మీరు తేలికగా వదులయిన మరకలను శుభ్రపరచవచ్చును.  

ప్రకటన

Vim Dishwash Gel

3) చెక్క లేదా వెదురు చెంచాలు

ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని, 2 టేబుల్  చెంచాల డిష్ వాషింగ్ ద్రవం కలిపి బాగా కలియబెట్టాలి.. ఒక నైలాన్ స్ర్కబ్బింగ్ ప్యాడ్ తీసుకొని మరకలను తొలగించాలి. కడిగి చెంచాలను ఆరనివ్వండి

4) నాన్-స్టిక్ ప్యాన్లు

నాన్ స్టిక్ ప్యాన్ లో పట్టిన నూనె తెరకను  తొలగించటానికి. దానిలో నీళ్ళు పోసి అర(1/2) కప్పు వెనిగర్ కలపి 10 నిమిషాల వరకు మరగపెట్టాలి. మరకలను శుభ్రపరచే ద్రావకంతో రుద్దాలి. నాన్‌-స్టిక్‌ పాన్‌పై లోహపు స్క్రబ్బర్‌ని ఉపయోగించవద్దు.  ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ల పై మొండి మరకలు ఉంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 2 చెంచాల  బేకింగ్ సోడాను కలుపుకుని బాగా కలియబెట్టాలి.  ఆ పేస్ట్ ను మరకల పై  ఉపయోగించి 20 నిమిషాలు వదిలేయాలి. ఒక 1 చిన్న చెంచా  డిష్ వాషింగ్ ద్రవంతో మరియు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళతో దీనిని శుభ్రపరచుకోవాలి. 

5) స్టీల్ కత్తులు

పదునుగా ఉండే స్టీలు కత్తులను మిగిలిన పాత్రలకు తగలకుండా విడిగా నిల్వచేసుకోవాలి. . ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లుతీసుకోని అందులో అర చిన్న చెంచా  (1/2) డిష్ వాషింగ్ ద్రవాన్ని కలుపుకోని అందులో ఈ కత్తులను నానబెట్టాలి. 30 నిమిషాల వరకు వేచి ఉండాలి. తరువాత  వాటిని తీసి మంచి నీళ్లతో కడిగి మెత్తని బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. 

ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. జిడ్డును వదిలించుకోవడానికి ఎల్లప్పుడూ  మీకు వీలైనంత త్వరగా పాత్రలను శుభ్రపరచుకోవాలి

వ్యాసం మొదట ప్రచురించబడింది