
పండ్లు మరియు కూరగాయలు, మనకు చేరేముందే చాలా చేతులు మారతాయని మనకి తెలుసు, కానీ వాటి మీద వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ లు పెరగడానికి చోటు ఎక్కువవుతాయి అని మీకు తెలుసా? మా అనుభవంలో తెలుసుకున్నది ఏమ ిటంటే మామూలు నీటితో వీటిని శుభ్రపరిస్తే ఈ కలుషితాలను తీసివేయలేము. బేకింగ్ సోడా మరియు వెనిగర్ తో కూరగాయలను కడగడం వంటి చిట్కాలు ప్రయత్నించవచ్చు, కాని అవి పదార్థాల మీద ఉన్న క్రిములను పూర్తిగా తీసివేయలేకపోతున్నాయి. దీనివల్ల అర్ధం అయ్యింది ఏమిటంటే ఈ సమస్యకి ఒక్క పరిష్కారం అంటూ లేదని. మనం దీనిని ఒక సమగ్ర దృష్టితో చూడాలి. అందుకనే పండ్లు మరియు కూరగాయలు ఇంటికి వచ్చాక వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 5 విషయాలు:
1) మీ చేతులను చక్కగా శుభ్రపరుచుకోండి
తెలియకుండానే సూక్ష్మక్రిములు మనలో ప్రవేశించకుండా నివారించడానికి , పండ్లు మరియు కూరగాయలు శుభ్రపరిచే ముందు మనం 20 సెకన్ల పాటు గోరు వెచ్చని నీటితో చేతుల్ని శుభ్రపరుచుకోవాలి. అలాగే, పండ్లు మరియు కూరగాయలు శుభ్రపరిచిన తరువాత కూడా చేతులు కడుక్కోవడం అంతే ముఖ్యం.
2) పండ్లను మరియు కూరగాయలను వేరు చేసి సరైన పద్ధతిలో శుభ్రపరచండి
అన్ని రకాల పండ్లు మరియు కూరగాయలకు ఒకే రకమైన పొరలు మరియు దృఢత్వం ఉండవని మనకి తెలుసు, కాబట్టి ప్రీ-వాష్ దశలో వాటిని వర్గాలుగా విభజించాలి. సాధారణంగా గట్టిగా ఉండేవి, మెత్తగా ఉండేవి మరియు ఆకుకూరలుగా పండ్లను మరియు కూరగాయల్ని విభజించవచ్చు. పండ్లు మరియు కూరగాయల క్లీనర్ ఉపయోగించే ముందు వాటిని నీటితో కడగడం వల్ల వాటి పైన ఉన్న దుమ్ము వదిలిపోతుంది. మనం వాడే ఉత్పత్తులను ప్రీ-వాష్ చేసే కొన్ని మార్గాలు:

బంగాళదుంపలు, నారింజ, నిమ్మకాయలు లాంటి గట్టిగా ఉండే పండ్లను కూరగాయల్ని మృదువైన కుచ్చులు ఉన్న బ్రష్ తో నీటి కింద పెట్టి కడగాలి. దీనివల్ల వాటి మీద ఉండే దుమ్ము ధూళి వంటివి పూర్తిగా తొలగిపోతాయి.
మెత్తగా ఉండే టమాటాలు మరియు పుట్టగొడుగుల వంటి వాటిని శుభ్రం చేసేప్పుడు, చేతి వేళ్ళను ఉపయోగించి పంపు నీటిలో మెత్తగా రుద్దాలి.
క్యాబేజీ, పాలకూరల లాంటి ఆకుకూరలకు మొదట వాటి బయటి పొరను, రంగుపోయిన వాటిని మరియు వాడిపోయిన ఆకుల్ని తీసేసిన తరువాత శుభ్రం చేయాలి.
3) పండ్లు మరియు కూరగాయలను శుభ్రం చేయడానికి ప్రకృతి సహజమైన క్లీనర్ ని ఉపయోగించండి
వినియోగదారులుగా, మనం నెమ్మదిగా మరింత పర్యావరణ స్పృహతో మన ఆహారానికి సంబంధించిన విషయాల్లో హానికరమైన రసాయనాలు వాడకుండా ఉండేలా చూసుకోవాలి. అలానే తల్లితండ్రులుగా, మనం పిల్లలకి ఏమి తినిపిస్తున్నాము అని ఎప్పుడూ చూసుకుంటూ మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే పండ్లు మరియు కూరగాయల బయటి పొరను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అందుకే వాటిని కడగడం పట్ల సరైన అవగాహన ఉండాలి. దీనికోసం మార్కెట్లో దొరికే సహజమైన క్లీనర్ కోసం చూసుకోవాలి.
మేము నేచర్ ప్రొటెక్ట్స్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ క్లీనర్ ఉపయోగించాము కాబట్టి, దీనిని మేము సిఫార్సు చేస్తాము ఎందుకంటే, ఇందులో కఠినమైన రసాయనాలు వాడలేదు, అలానే ఇది వేప, తులసి, నిమ్మ మరియు సిట్రస్ వంటి మొక్కల ఆధారిత క్రియాశీలక శక్తితో పనిచేస్తుంది. వేప యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ది చెందింది, ఇది సహజమైన పండు మరియు కూరగాయల క్రిమిసంహారక మందుగా పనిచేస్తుంది. ఈ క్లీనర్ లో ఉన్న మంచి విషయం ఏమిటంటే ఇందులో క్లోరిన్, బ్లీచ్, ఆల్కహాల్ లేదా ఇతర హానికరమైన రసాయనాలు వాడలేదు. ఈ క్లీనర్‌ను ఉపయోగించిన తర్వాత పండ్లు మరియు కూరగాయలు ఎక్కువ సేపు తాజాగా కూడా ఉంటున్నాయి. పండ్లు మరియు కూరగాయల మీద సూక్ష్మక్రిములు లేకుండా చేయడానికి ఈ క్లీనర్ వాడడం సులభమైన పరిష్కారం. మనం చేయాల్సిందల్లా ప్యాకేజింగ్‌లోని సూచనలను పాటించడమే.
4) మీ వంటింటి గట్టు మరియు వంట పాత్రల్ని శుభ్రంగా ఉంచుకోండి
పండ్లు మరియు కూరగాయలను తరగడానికి ముందు, చెక్కు తీసిన తర్వాత కట్టింగ్ బోర్డులు, వంట పాత్రలు మరియు కౌంటర్‌టాప్‌ను శుభ్రపరచడం చాలా కీలకమైన పని అని అనుభవంలో నేర్చుకున్నాము. అయితే వంటింటి గట్టుని శుభ్రంగా ఉంచడం వల్ల పండ్లు, కూరగాయల పైన తొక్క తీసి తరిగే సమయంలో అవి పాడవకుండా ఉంటాయి. పండ్లు మరియు కూరగాయల వాష్ ఉపయోగం బాగా అర్థం అయ్యే ముఖ్య దశ ఇది.
ఒకవేళ మీరు కనుక మాంసాలు మరియు ఇతర మాంసాహారన్ని భుజిస్తుంటే, మీరు దాని కోసం వేరే కత్తులు, కట్టింగ్ బోర్డులు, మొదలైనవి ఉపయోగించేలా చూసుకోండి. ఇతర పాత్రల లాగానే, వీటిని కూడా డిష్ వాష్ జెల్ మరియు వేడి నీటిని ఉపయోగించి బాగా కడగాలి.
5) వస్తువులు నిలువ చేసే ప్రాంతం శుభ్రంగా ఉండేలా చూసుకోండి
చాలాసార్లు, మనం కూరగాయల్ని రిఫ్రిజిరేటర్ లో పెడతాము. ఎప్పటికప్పుడు అక్కర్లేని, పాడైపోయిన పదార్ధాలను తీసివేసి ఫ్రిడ్జ్ ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కొత్తగా తెచ్చే వస్తువుల కోసం స్థలం ఉంటుంది, అలాగే సూక్ష్మక్రిముల నుంచి కొత్త వస్తువులను దూరంగా ఉంచవచ్చు. ఒకసారి వంట కొరకు వంట పదార్థాలు ఫ్రిడ్జ్ లోనుంచి తీశాకా వంటచేసే / భుజించే ముందుగా మరిచిపోకుండా పండ్లు మరియు కూరగాయల క్లీనర్ తో శుభ్రపరచాలి.
కొన్ని పండ్లు మరియు కూరగాయలను బుట్టలు మరియు కూరగాయల స్టాక్ లో నిల్వ చేయవచ్చు. దుమ్ము, సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియా లేకుండా ఉండేలా వీటిని శుభ్రపరచాలి లేదా క్రిమిసంహారక స్ప్రే వాటి మీద పిచికారీ చేయాలి.
ఈ సులభమైన చిట్కాలు పాటించి మీరు, మీ కుటుంబం ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోండి.