
దక్షిణ భారత దేశపు పట్టు చీరలను ప్రతి భారతీయ మహిళ వార్డ్‌రోబ్ యొక్క నిధిలాగాపలశంలో మహిళలు పట్టుచీరలను నిధిలాగా భావిస్తారు. అలాంటి పట్టుచీరల పై నూనె మరకలు ఉంటే దిగులు పడకండి వాటిని ఇప్ పుడు తేలికగా తొలిగించుకోవచ్చు. ఆ నూనె మరకలు సలాడ్ డ్రెస్సింగ్ చేసేటప్పుడు పడి ఉండవచ్చు, ఫ్రై చేసే టప్పుడు ఒలికి ఉండవచ్చు, లేదా వండేటప్పుడు మన చేతికి ఉన్న అయిల్ నూనె చీరాలకు అంటుకోవచ్చు. మరకలను తొలగించడానికి క్రింద సూచించబడిన చర్యలను అనుసరించండి
నూనె మరకలను తొలగించడానికి చర్యలు
స్టెప్ 1: బేకింగ్ సోడా లేదా కార్న్ స్టార్చ్ ఉపయోగించండి
ముందుగా పట్టు చీరను నలుచదరంగా ఉండే ప్రదేశంలో పరుచుకోవాలి. నూనె మరక ఉన్న చోట బేకింగ్ సోడా, కార్న్ స్టార్చ్ లేదా ఉప్పు లాంటి పీల్చుకునే పొడిని మందంమైన పొరగా మరకపై కప్పాలి.
స్టెప్ 2: వేచి ఉండాలి
ఇలా 2 గంటలు వరకు ఉంచాలి. అప్పుడు పొడి నూనెను గ్రహిస్తుంది.

స్టెప్ 3: దానిని బ్రష్ చేయాలి
మరక పై ఉన్న పొడిని తడి బట్టతో లేదా మెత్తటి కుచ్చులున్న బ్రష్‌తో రాని లేదా ఒక శుభ్రమైన తెల్లటి బట్టతో కాని తీసివేయాలి. ఏదైనా మరక మిగిలి ఉంటె, ఈ ప్రక్రియను మళ్లీ చేయండి. ఈ పద్ధతి ఫాబ్రిక్ దెబ్బతినకుండా నూనె మరకలపై ఉత్తమంగా పనిచేస్తుంది.
స్టెప్ 4: డిష్ వాషింగ్ లిక్విడ్ వాడండి
రెండవ పద్దతి ఏమిటంటే, కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ ను పట్టు వస్త్రం పై ఉన్న మరక పై రుద్దాలి. తరువాత దాన్ని శుభ్రం చేసి, నీటి మరక పడకుండా డిస్టిల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. మరక పై ఉన్న తడి ప్రదేశాన్ని హెయిర్ డ్రైయర్‌తో ,చల్లని గాలిలో లేదా ఫ్యాన్ ముందు ఆరబెట్టాలి. ఇలా చేస్తే మరక పడకుండా సహాయపడుతుంది.