
వాషింగ్ మెషీన్‌ల గురించి ఈ 5 విషయాలను తెలుసుకోండి.
ఏ రకమైన వస్త్రం లేదా దుస్తులను అయినా వేడి నీటిలో ఉతికేందుకు ముందుగా వాటి లేబుల్‌పై ఇచ్చిన సూచనలను గమనించండి.
కొనేందుకు ముందు
సామర్థ్యం
మీ కుటుంబం కేవలం ఒక జంట మాత్రమే అయితే, మీకు 5 కిలోల సామర్థ్యం గల వాషింగ్ మెషీన్ సరిపోతుంది. కానీ, మీరు ఒకవేళ తల్లిదండ్రులు మరియు పిల్లలతో కలిసి నివసిస్తుంటే మాత్రం, 7 లేదా 8 కిలోల సామర్థ్యం గల మెషీన్‌ను కొనేందుకు ప్రయత్నించండి. ఇంకా పెద్దగా ఉండే, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం అయితే, మరింత పెద్దగా ఉండే 9.5 కిలోల లోడ్‌ను ఉతికే సామర్థ్యం గల వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయండి.

ఆటోమేటిక్ లేదా సెమి-ఆటోమేటిక్
మీరు ఉద్యోగస్తులు అయితే, ఆటోమేటిక్ మెషీన్‌ను కొనుగోలు చేయడమే ఉత్తమం. ఎందుకంటే ఇది త్వరితంగా పని చేయడమే కాదు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. అయితే, దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుందనే విషయం గుర్తుంచుకోండి.
టాప్ లోడ్ లేదా ఫ్రంట్ లోడ్
పై నుంచి దుస్తులు వేసే (టాప్ లోడ్) వాషింగ్ మెషీన్‌లు చవకగా లభిస్తాయి. కానీ ఇవి దుస్తులను ఉతికేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి, కొన్ని సార్లు వాటి నుంచి వచ్చే శబ్దం చాలా చికాకును కూడా కలిగించవచ్చు. ముందు నుంచి దుస్తులు వేసే (ఫ్రంట్ లోడ్) వాషింగ్ మెషీన్‌లు త్వరితంగా పని చేస్తాయి, సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ పెద్ద పరిమాణం కలిగి ఉండడంతో పాటు, ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
ఉపయోగించే సమయంలో
వెనిగర్
మీ వాషింగ్ మెషీన్‌ను త్వరితంగా మరియు ప్రభావవంతంగా శుభ్రపరచడానికి అత్యుత్తమ పదార్ధం ఇదే. మీరు ఏం చేయాలంటే, మీ వాషింగ్ మెషీన్‌లో దుస్తులను వేయకుండా కేవలం 2 కప్పుల వెనిగర్ వేయండి, సాధారణ ఉతకడం మాదిరిగానే యంత్రాన్ని రన్ చేయండి.
బ్యాక్టీరియా మరియు క్రిములను చంపడానికి వేడి నీరు
చన్నీరు ఉపయోగించడం కంటే దుస్తులు మరియు బెడ్ షీట్‌లను వేడి నీటితో ఉతకడం ద్వారా, మీరు ఎక్కువ క్రిములను చంపగలుగుతారు.