కొత్త నీటి నీళ్ళ సీసా కొన్నారా? మొదటిసారి ఉపయోగించడానికి ముందు దీనిని శుభ్రం చేయండి!

కొత్తగా కొన్న నీళ్ళ సీసా అప్రియకరమైన వాసన రావచ్చు మరియు శుభ్రం చేయకుండా ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్‌లు కలిగించవచ్చు. కానీ చింతించకండి. మీరు మీ సీసాని మొదటి సారి ఉపయోగించడానికి ముందు దీనిని బాగా శుభ్రం చేయడానికి ఈ సులభ పద్ధతులు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Bought a New Water Bottle? Clean It Before First Use!
ప్రకటన
Surf Excel Matic Liquid

అపరిశుభ్రమైన సీసాలో నీటిని నిల్వచేయడం అప్రియకరమైన వాసన రావచ్చు మరియు భిన్న రుచితో ఉండొచ్చు. ఇది వ్యాధులకు కూడా దారితీయొచ్చు. కానీ మీరు అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకుంటే నీటి వల్ల కలిగే వ్యాధులను కూడా మీరు సులభంగా నిరోధించవచ్చు.

కొత్త నీళ్ళ సీసా కొన్న తరువాత దానిని కడగడం మరియు వెంటనే ఉపయోగించడం మన మదిలో వచ్చే మొదటి ఆలోచన. అయితే, బాగా శుభ్రం చేయవలసిన ఆవశ్యకత ఉంది మరియు ఈ పని చేయడం కష్టం కూడా కాదు. మీ సీసాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉన్నాయని నిర్థారించుకునేందుకు రెండు ప్రభావవంతమైన, సరళమైన మార్గాలను ఇక్కడ ఇస్తున్నాము.

వినిగర్‌ని ఉపయోగించుట

స్టెప్‌ 1:

గోరువెచ్చని నీటితో మీ సీసాని కడగండి.

ప్రకటన

Surf Excel Matic Liquid

స్టెప్‌ 2:

మీ సీసాని పరిశుభ్రమైన నీటిని నింపి, 2 పెద్ద చంచాల వినిగర్‌  కలపండి మరియు బాగా కుదపండి.

స్టెప్‌ 3:

ద్రావకాన్ని సెటిల్‌ కావడానికి 10-15 నిమిషాల సమయం ఇవ్వండి.

స్టెప్‌ 4:

వినిగ్‌ వాసన పోగొట్టేందుకు సీసాని ఖాళీ చేసి పరిశుభ్రమైన నీటితో, గోరువెచ్చని నీటితో దానిని సరిగ్గా కడగండి.

వినిగ్‌ వాసన పోగొట్టేందుకు సీసాని ఖాళీ చేసి పరిశుభ్రమైన నీటితో, గోరువెచ్చని నీటితో దానిని సరిగ్గా కడగండి.

స్టెప్‌ 5:

దాదాపు 20 నిమిషాల సేపు సీసాని గాలికి ఆరబెట్టండి.

బేకింగ్‌ సోడాను ఉపయోగించుట

స్టెప్‌ 1:

కప్పు నీటిలో 2 పెద్ద చంచాల బేకింగ్‌ సోగాను మిశ్రమం చేసి పేస్టు తయారు చేయండి.

స్టెప్‌ 2:

స్పాంజి సహాయంతో, సీసా లోపల పేస్టు పూయండి.

స్టెప్‌ 3:

దాదాపు 15-20 నిమిషాల సేపు సీసా లోపల పేస్టు ఉంచండి.

స్టెప్‌ 4:

పేస్టు సీసా నుంచి పూర్తిగా కొట్టుకుపోయేంత వరకు గోరువెచ్చని నీటితో సీసాని కడగండి.

స్టెప్‌ 5:

ఎండలో ఉంచడం ద్వారా లేదా నేరుగా ఫ్యాన్‌ కింద ఉంచడం ద్వారా సీసాని పూర్తిగా ఆరబెట్టండి.

మీరు కొత్త సీసాలను ఉపయోగించే ముందు ఈ రెండు పద్ధతులు పాటించండి, దీనివల్ల తాగే ప్రతి గుటక నీళ్ళు తాజాగా అనిపిస్తాయి!

వ్యాసం మొదట ప్రచురించబడింది