
చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. క్రిములు మరియు ఇన్ఫెక్షన్‌ల నుంచి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కాపాడేందుకు మీరు ఇవ్వగల మొట్టమొదటి మరియు సరళమైన రక్షణ ఇది. ఎవరైనా సరే దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, వాళ్ళ నుంచి వెలువడే తుంపరలు 3 అడుగుల వరకు వెళతాయని ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. ఇవి సమీపంలోని ఉపరితలాలపై కూడా స్థిరపడవచ్చు, మీరు రోజంతా వీటిని తాకుతూనే ఉంటారు. మీ చేతులు కడకపోతే మరియు మీరు వాటితో మీ ముఖం తాకితే, మీకు ఇన్ఫెక్షన్‌ల ు సులభంగా సోకవచ్చు. అందుకే మీరు మీ చేతులు తరచుగా మరియు సరిగా కడుక్కోవడం ముఖ్యం.
మీరు ఎంత తరచుగా మీ చేతులు శుభ్రం చేసుకోవాలి?
సాధ్యమైనంత తరచుగా మీరు మీ చేతులు శుభ్రం చేసుకోవడం మంచి ఆలోచన. భోజనం తయారుచేయడం, తినడం, బాత్‌రూమ్‌కి వెళ్ళొచ్చాక, మీ ముఖం (కళ్ళు, ముక్కు, నోరు) తాకిన తరువాత, దగ్గిన లేదా తుమ్మిన తరువాత, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మరియు తిరిగొచ్చాక, శుభ్రంచేశాక, మరొక వ్యక్తికి సహాయపడిన తరువాత లాంటి కొన్ని పనులు చేయడానికి ముందు మరియు చేసిన తరువాత మీ చేతులు శుభ్రంచేసుకోవలసిందిగా సిఫారసు చేయబడుతోంది.
మీరు తప్పకుండా సబ్బు లేదా శానిటైజర్‌ని ఉపయోగించాలా?
సబ్బు మరియు నీటితో మీ చేతులు కడుక్కోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. మీరు ప్రయాణంలో ఉంటే లేదా మీకు సబ్బు మరియు నీళ్ళు లేకపోతే, ఉపరితలం తాకిన తరువాత లేదా డబ్బు పట్టుకున్న తరువాత, బాత్‌రూమ్‌కి వెళ్ళొచ్చాక లేదా సహచరులతో కరచాలనం చేసిన తరువాత మీ చేతులు శుభ్రం చేసుకోవాలనుకుంటే, మీరు హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించవచ్చు, ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ చేతులను శుభ్రంచేసుకునేందుకు లైఫ్‌బాయ్ నుంచి లభించే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని మీరు ఉపయోగించవచ్చు.

మీరు మీ చేతులు కరెక్టుగా మరియు బాగా ఎలా రుద్దుకోవచ్చో ఈ చర్యలు మీకు చూపిస్తున్నాయి.
స్టెప్ 1: మీ చేతులు తడుపుకొని సబ్బు రాయండి
మీ చ ేతుల ఉపరితలం మొత్తాన్ని కవర్ చేసేందుకు అవసరమైనంత నురుగు తెప్పించాలి. బొటనవేళ్ళు, చేతివేళ్ళ మధ్య, గోళ్ళ కింద మరియు మీ చేతులు వెనుక సబ్బు రుద్దడానికి ప్రయత్నించండి. మీరు కనీసం 20 సెకనుల సేపు చేతులు రుద్దుకోవడం వల్ల సాధ్యమైన మేరకు మీరు ఎక్కువ క్రిములు పోగొట్టవచ్చు.
స్టెప్ 2: మీ అరిచేతులు కడుక్కోండి
మీ అరిచేతులను విస్త్రుతంగా రుద్దండి, మొదటగా ఒక చేతిని మరొక చేతిపై, ఆ తరువాత చేతులు మార్చి రుద్దుకోవాలి.
స్టెప్ 3: మీ చేతివేళ్ళు రుద్దుకోండి
మీ చేతివేళ్ళ బేస్‌ని శుభ్రంచేయడానికి, మీ చేతివేళ్ళను పరస్పరం దూర్చి, అరిచేతులను ఒకదానిలో మరొకటి పెట్టి రుద్దాలి. తరువాత, చేతి వెనుక వైపు నుంచి కూడా మీ చేతివేళ్ళను పరస్పరం దూర్చండి, అంటే ఈ కుడి అరిచేతిని ఎడమ చేతి వెనుక వైపున ఉంచి మీ చేతివేళ్ళ వెనుక భాగాన్ని రుద్దండి. అనంతరం చేతులు మార్చి చేయండి.
స్టెప్ 4: మీ బొటనవేళ్ళను రుద్దండి
మీ ఎడమ బొటనవేలిని మీ కుడి చేతితో పట్టుకొని మెల్లగా ముందుకు మరియు వెనక్కి రుద్దండి. తరువాత మరొక బొటనవేలిని ఇలా రుద్దండి.
స్టెప్ 5: మీ చేతి వేళ్ళ కింద రుద్దండి
మీ మరొక చేతితో లేదా కుచ్చులు గల బ్రష్‌తో, మీ చేతివేళ్ళ కింద మరియు బాహ్య చర్మంపై శుభ్రం చేయండి. అనంతరం చేతులు మార్చి చేయండి.
స్టెప్ 6: మీ చేతులు ఆరబెట్టుకోండి
పరిశుభ్రమైన టవల్‌తో మీ చేతులు బాగా ఆరబెట్టుకోండి. మీ చేతులను మీ దుస్తులకు తుడిచి ఆరబెట్టుకోవడానికి ప్రయత్నించకండి.
మీ చేతులు కడుక్కోవడం సులభ మైన పని. వ్యాధి కలిగించే క్రిముల వ్యాప్తిని నిరోధించడానికి వాటిని సరైన మార్గంలో కడుక్కోవడం ముఖ్యం. పరిశుభ్రంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి!
కీలక చర్య:
మీకు పిల్లలు ఉంటే, వాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు పాడుకునే 20 సెకనుల పాట పాడుకోవడానికి ప్రయత్నించేలా చేయండి. ఉదాహరణకు, ‘హ్యాపీ బర్త్‌డే’ పాట రెండు సార్లు పాడుతూ వాళ్ళు చేతులు కడుక్కోవచ్చు.
ఆధారాలు: