కఠిన మైన నీటి మరకలు మీ బాత్రూమ్ కొళాయిపై పడుతున్నాయా? మా వద్ద దీనికి సులభ పరిష్కారం ఉంది!

మీ ట్యాప్‌కి మొండి కఠిన మైన నీటి మరకలతో నిండిపోతే చింతించకండి. దీని ప్రకాశాన్ని పునరుద్ధరించేందుకు ఈ సరళ పద్ధతిని ఉపయోగించండి.

వ్యాసం నవీకరించబడింది

Hard Water Stains on Your Bathroom Tap?We have an Easy Fix!
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

మనమంతా మన ఇంటిని ప్రకాశవంతంగా మరియు మరకలు లేకుండా ఉంచాలనుకుంటాము. అయితే, కొన్నిసార్లు, కఠిన మైన నీళ్లు ఈ పనిని కష్టంగా చేయవచ్చు, ఎందుకంటే మీ ఇంట్లో కొళాయిల చుట్టూ ఇది మొండి మరకలు కలిగిస్తుంది కాబట్టి.

కఠిన మైన నీళ్ళు ఆవిరైపోయినప్పుడు, మీ కొళాయి చుట్టూ తెల్లని, చాకీ, గట్టి పదార్థాన్ని జమచేసే లైమ్‌స్కేలు డిపాజిట్‌లు మిగిలిపోతుంటాయి మరియు దీనిని చూడలేకుండా చేస్తాయి.

లైమ్‌స్కేలు హానికరమైనప్పటికీ, కొళాయిని అవరోధించడం ద్వారా నీటి ప్రవాహాన్ని ఇది తగ్గిస్తుంది. శాంతంగా ఉండండి, చింతించవలసిన అవసరం లేదు.

నిపుణుడి మాదిరిగా మీ కొళాయి నుంచి ఆ కఠిన మైన నీటి మరకలను తొలగించేందుకు 3 సరళ చర్యలను ఇక్కడ ఇస్తున్నాము.

వినిగర్‌ని మరియు నిమ్మ రసం యొక్క మిశ్రమం ఎక్కువ క్షారంగా ఉంటుంది మరియు నిజమైన మొండి మరకలను శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు. వినిగర్‌ని ఉపయోగించేటప్పుడు గ్లౌజులు ధరించాలని గుర్తుంచుకోండి.

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

స్టెప్‌ 1:

పాత, కానీ పరిశుభ్రమైన బ్రిసల్స్‌ గల బ్రష్‌తో మీ బాత్‌రూమ్‌ కొళాయి చుట్టూ కొద్దిగా డైల్యూట్‌చేయని వినిగర్‌ని పూయడం ద్వారా ప్రారంభించండి. సులభంగా వినియోగించేందుకు, వినిగర్‌ని పిచికారి సీసాలో పోయండి. ప్రత్యామ్నాయంగా, మీరు ½ కప్పు నిమ్మ రసం కూడా ఉపయోగించవచ్చు. శుభ్రంచేసే పనులకు మీరు ఎప్పుడు వినిగర్‌ని ఉపయోగిస్తున్నా రక్షణాత్మక గ్లౌజులు ధరించాలని గుర్తుంచుకోండి.

స్టెప్‌ 2:

మరకల మొండిదనాన్ని బట్టి, దీనిని 15-30 నిమిషాల సేపు మరకలపై ఉంచండి. మరకలు చాలా మొండిగా ఉంటే, గంట సేపు ఆగండి.

స్టెప్‌ 3:

పాత, కానీ పరిశుభ్రమైన టూత్‌బ్రష్‌ని ఉపయోగించి, ఆ ప్రాంతాన్ని బాగా రుద్దండి. ఎక్కువ ఒరపిడిగా ఉన్న బ్రష్‌ని ఉపయోగించకండి, ఎందుకంటే ఇది మీ బాత్‌రూమ్‌ కొళాయి ఉపరితలాన్ని పాడు చేయవచ్చు.

స్టెప్‌ 4:

ఒకసారి మరకలు పోతే, అమితంగా ఉన్న నీటిని తొలగించేందుకు పరిశుభ్రమైన వస్త్రంతో తుడవండి.

మీకు అర్థమై ఉంటుందనుకుంటా! కఠినమైన నీటి మరకలు కష్టంగా ఉండొచ్చు, కానీ పోరాటంలో గెలిచేందుకు సరైన కోణం నుంచి ఆ మరకలపై ఎలా పోరాడాలో మీరు తప్పకుండా తెలుసుకోవాలి!

ఇది సరళమైనది. ఇది త్వరితమైనది.

వ్యాసం మొదట ప్రచురించబడింది