
సేంద్రీయ ఘటికాంశాల నుంచి మీరు మీ సొంత సిగ్నేచర్ పెర్‌ఫ్యూమ్‌ని తయారు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన ఆలోచన, ఎందుకంటే ఇది పర్యావరణానికి స్నేహపూర్వకమైన ఘటికాంశాలని ఉపయోగించి సెంట్‌ని తయారుచేసే అవకాశం ఇది మీకు కల్పిస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది, కానీ అంత సమయం కేటాయించదగినంత విలువైనదే. మీకు మరియు పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండే సువాసన పెర్‌ఫ్యూమ్‌ని ఎలా తయారుచేయాలో మేము మీకు ఇక్కడ సూచిస్తున్నాము.
సుదీర్ఘ సమయం ఉండే సెంటును ఉత్పత్తిచేసే అబ్బురపరి చే పెర్‌ఫ్యూమ్‌ని తయారుచేయడానికి మేము సులభ రెసిపీని రూపొందించాము. మీరు చిన్న కంటెయినర్‌లో నిల్వ చేయండి, మీరు ప్రయాణించేటప్పుడు ఇది మీకు మంచి ఎంపిక అవుతుంది మరియు పనిచేయడానికి మీరు దీనిని వెంట తీసుకెళ్ళేటప్పుడు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో కూడా దీనిని పెట్టుకోవచ్చు. ఇది మీ బట్టలను నిజంగా సువాసనతో ఉంచుతుంది!
పెర్‌ఫ్యూమ్ చాలా ఘాటుగా ఉందని మీరు భావిస్తే, మరొక టేబుల్‌స్పూన్ డిస్టిల్డ్ నీటిని కలిపి పలచన చేయండి.
స్టెప్ 1: ద్రావణం తయారుచేయండి
ఒక బాటిల్‌లో 2 చిన్న చెంచాల బాదం నూనె మరియు 6-7 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్, లేదా మీ రుచి ప్రకారం భిన్న ఎసెన్షియల్ ఆయిల్స్ సమ్మేళనం కూడా కలపవచ్చు.

స్టెప్ 2: దీనిని స్థిరపడనివ్వండి
1 నిమిషం సేపు బాటిల్‌ని కుదిపేయండి. తరువాత దీనిని నీడ ఉన్న మూలలో పెట్టి 2-3 రోజుల పాటు దానిని స్థిరపడనివ్వండి.
స్టెప్ 3: దీనిని ఫిల్టర్ చేయండి
2-3 రోజుల తరువాత, 2 పెద్ద చెంచాల డిస్టిల్డ్ నీటిని కలపండి. 1 నిమిషం సేపు బాటిల్‌ని బాగా కుదిపేయండి మరియు మెష్ ఫిల్టర్ ద్వారా పదార్ధాన్ని ఫిల్టర్ చేయండి.
స్టెప్ 4: దీనిని నిల్వ చేయండి
పిచికారి బాటిల్‌లో పోయండి. వేడి మరియు కాంతికి దూరంగా 1 వారం పాటు దీనిని నిల్వ చేయండి.
స్టెప్ 5: ఇది సిద్ధంగా ఉంది!
1 వారం తరువాత, బాటిల్ అడుగుకు చేరిన ఏదైనా మడ్డిని మెష్ ఫిల్టర్‌తో ఫిల్ట ర్ చేయండి. పెర్‌ఫ్యూమ్‌ని బాటిల్‌లో పోయండి.
ఇప్పుడు మీరు దీనిని ఉపయోగించడం ప్రారంభించవచ్చు. పండుగలు మరియు పుట్టిన రోజులకు కూడా ఈ పెర్‌ఫ్యూమ్ మంచి బహుమతిగా ఇవ్వవచ్చు. మీరు సృష్టించిన సువాసనలు ఆనందించండి మరియు మీ అనుభవాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబంతో కూడా పంచుకోండి!