పర్యావరణానికి స్నేహపూర్వకమైన సబ్బు ఇంట్లో తయారు చేసేందుకు సులభ మార్గం

పర్యావరణానికి స్నేహపూర్వకమైన ఉత్పాదనలను ఉపయోగించి మీరు ఇంట్లో సబ్బు తయారు చేయాలనుకుంటున్నారా? ఉపయోగకరమైన గైడ్‌ని ఇక్కడ ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

An Easy Way to Make Eco-Friendly Soap at Home
ప్రకటన
Nature Protect Floor Cleaner - leaderboard

ప్రస్తుతం మనకు పర్యావరణానికి స్నేహపూర్వకమైన ఉత్పాదనల అవసరం ఉంది. పర్యావరణానికి స్నేహపూర్వకమైన సబ్బులను ఉపయోగించడం వల్ల మీ చర్మమే కాకుండా భూమండలం కూడా  సురక్షితంగా ఉంటుంది. మీరు సబ్బు తయారు చేయాలనుకుంటుంటే, అన్నీ సహజమైన ఘటికాంశాలతో  పాటు మీ ఇంటికి అత్యుత్తమ సువాసన వచ్చే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ని ఉపయోగించి దీన్ని తయారు చేసే ఉపయోగకరమైన గైడ్‌ని ఇక్కడ ఇస్తున్నాము. 

స్టెప్‌ 1: సబ్బు బేస్‌ని వేడి చేయండి

గ్లిజరిన్‌, షియా బటర్‌, కలబంద, కొకొవా బటర్‌, ఆలివ్‌ ఆయిల్‌ తదితర లాంటి సహజ ఘటికాంశాలతో తయారు చేయబడే సబ్బు బేస్‌లు భారతదేశంలో సులభంగా లభిస్తాయి. సబ్బు బేస్‌ని ముక్కలుగా కోయండి. అనంతరం, మైక్రోవేవ్‌కి సురక్షితమైన బౌల్‌లో పెట్టాలి. మీ మైక్రోవేవ్‌ని అత్యధిక ఉష్ణోగ్రతలో ఉంచండి మరియు 30 సెకనుల సేపు సబ్బు బేస్‌ని వేడి చేయండి. సబ్బు ముక్కలను కరిగించేందుకు మరుగుతున్న నీటి పాన్‌పై కూడా మీరు బౌల్‌ని పెట్టవచ్చు. చేతులు కాలకుండా ఉండాలంటే మీరు వేడి సబ్బును మీ చేతులతో తాకకుండా జాగ్రత్త వహించండి.

స్టెప్‌ 2: ఎసెన్షియల్ ఆయిల్స్‌ కలపండి

మరిగించిన నీటిలోని పాన్‌లో మీరు బౌల్‌ని వేడిచేస్తే, మీకు ఇష్టమైన అత్యావశ్యక ఆయిల్‌ 25-30 చుక్కలు నేరుగా కలిపి చెంచాతో జాగ్రత్తగా కలియబెట్టండి. మీరు మైక్రోవేవ్‌లో పెట్టగల బౌల్‌ని ఉపయోగిస్తుంటే, ఆయిల్‌ కలపడానికి ముందు మొదటగా మైక్రోవేవ్‌ నుంచి దానిని బయటకు తీయండి.

ప్రకటన

Nature Protect Floor Cleaner - mpu

స్టెప్‌ 3: దీనిని మౌల్డ్‌ చేయండి

ఇప్పుడు మీకు నచ్చిన ఆకారం మూస తీసుకోండి. సబ్బు మూసలు మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. బేస్‌లో కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేయండి. సబ్బు మిశ్రమాన్ని దీనిలో పోయండి. దీనిని 6-7 గంటల సేపు చల్లార్చండి. త్వరగా చల్లారాలంటే మీరు సబ్బును రిఫ్రిజిరేటర్‌లో 2-3 గంటలు లేదా ఎక్కువ సేపు పెట్టవచ్చు. 

స్టెప్‌ 4: దీనిని నిల్వ చేయండి

సబ్బు గట్టిపడగానే, దానిని మూసల నుంచి బయటకు తీసి మీరు కావాలనుకుంటే దానిని కత్తితో చిన్న ముక్కలుగా చేయవచ్చు. ముక్కలను మైనం పేపరులో చుట్టండి. క్యూర్‌ కావడానికి వాటిని నాలుగు వారాలు నిల్వ చేయండి.

మీ సహజమైన, పర్యావరణానికి స్నేహపూర్వకమైన సబ్బు నెల రోజుల సమయంలోనే సిద్దమవుతుంది! భిన్న ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ని ఉపయోగించి మీరు సబ్బును సువాసనగా చేయవచ్చు. రోజ్‌మేరీ, పెప్పర్‌మెంట్‌, లావెండర్‌, టీ ట్రీ, లవంగ పట్టి (సిన్నమామ్‌)లు సబ్బులో ఉపయోగించే కొన్ని అత్యుత్తమ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌.

వ్యాసం మొదట ప్రచురించబడింది