క్యాబ్ లో ప్రయాణించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇప్పుడు మనం ఉద్యోగం కోసం లేదా ఇతర పనుల కోసం బయటికి వెళ్తున్నాం, అలాంటప్పుడు టాక్సీ లేదా క్యాబ్ లో వెళ్లాల్సి రావచ్చు. అలాంటప్పుడు క్యాబ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ చిట్కాలు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచుతాయి.

వ్యాసం నవీకరించబడింది

క్యాబ్ లో ప్రయాణించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రకటన
Nature Protect Germ Kill Spray

ఈ మహమ్మారి ఆవహించే ముందు కూడా క్యాబ్ లో తిరగడం అనేది మనకి చాలా మామూలు విషయం. కానీ, ఇప్పుడు మనం బయటకు వెళ్లాలన్నా, క్యాబ్ లో ప్రయాణించాలన్నా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. టాక్సీ సర్వీస్ ఇచ్చే వారు ప్రతి రైడ్ కి మధ్యలో కార్ ని శానిటైజ్ చేస్తున్నాము అని చెప్పినా, ప్రతి 48 గంటలకి కార్ ని ఫ్యుమీగేషన్ చేయిస్తున్నాము అని చెప్పినా, అది ఎంత వరకు మంచిదో మనకి తెలియని పరిస్థితిలో ఉన్నాము. అందుకే ఆందోళన కలిగించే విషయాలు అన్నిటి గురించి బాగా అలోచించి మేము ఈ లిస్ట్ తయారు చేసాము. క్యాబ్ లో ప్రయాణం చేసేటప్పుడు ఈ సులభమైన చిట్కాలను పాటించండి.

1) అందరూ మాస్క్ వేసుకుని ఉండేలా జాగ్రత్త పడండి

ఇది మీకు, మీ డ్రైవర్ కి కూడా వర్తిస్తుంది. అనుభవం ద్వారా మేము తెలుసుకున్నది ఏమిటంటే, మూసి ఉన్న ప్రదేశాల్లో మాస్క్ లు వేసుకోవడం మరీ ముఖ్యం. ఎందుకంటే వైరస్ లు మరియు సూక్ష్మక్రిములు శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అందుకే, ఎవరైనా మాస్క్ వేసుకోకుండా దగ్గినా, తుమ్మినా, ఇన్ఫెక్షన్ ఇతరులకు అంటుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, క్యాబ్ లోకి ఎక్కే ముందు డ్రైవర్ మాస్క్ సరిగా వేసుకున్నారా లేదా అని సరి చూసుకోండి. మేము కూడా అదే చేస్తాము. రైడ్ కాన్సుల్ చేయడానికి లేదా డ్రైవర్ మాస్క్ వేసుకోకపోతే వారిని మాస్క్ వేసుకోమని చెప్పడానికి మొహమాట పడకండి. అలాగే, మీరు కూడా క్యాబ్ లో ప్రయాణం చేస్తున్నంత సేపు మాస్క్ వేసుకుని ఉండండి. అలాగే, ప్రతి సారి మాస్క్ ని ఉపయోగించాకా తప్పక శుభ్రం చేయండి.

2) డ్రైవర్ నుంచి దూరంగా ఉండండి 

ఈ మధ్య కాలంలో మేము చేసిన క్యాబ్ ప్రయాణాల్లో మేము డ్రైవర్ తో సామాజిక దూరం పాటించాము. మేము తీసుకున్న కొన్ని జాగ్రత్తల్లో భాగంగా డ్రైవర్ కి వీలైనంత దూరంలో కూర్చున్నాము. అలాగే ముందు సీట్ లో కూర్చోకుండా, వెనుక సీట్ లో డ్రైవర్ కి క్రాస్ గా కూర్చోండి. అలాగే ఎవరి దగ్గర వైరస్ లు, సూక్ష్మ క్రిములు ఉంటాయో మనకి తెలియదు కాబట్టి తెలియని వారితో రైడ్స్ చేయకుండా ఉంటే మంచిది అని మేము సిఫార్సు చేస్తాము.

ప్రకటన

Nature Protect Germ Kill Spray

3) ఎక్కువగా ముట్టుకునే ప్రదేశాలని డిస్ఇన్ఫెక్ట్ చేయండి

క్యాబ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాలను ముట్టుకోకుండా ఉండలేము. డోర్ హ్యాండిల్స్, కార్ సీట్స్, సీట్ బెల్ట్స్, హెడ్ రెస్ట్ లాంటి వాటిని మనం తప్పక ముట్టుకోవాల్సిందే. రోజు మొత్తంలో వీటన్నిటిని మనమే కాకుండా ఎంతో మంది ముట్టుకుంటారు. ఈ వస్తువులు అన్నిటి మీదా క్యాబ్ లో ప్రయాణించిన ప్రయాణికుల అందరి దగ్గర నుంచి వచ్చే  వైరస్ లు, సూక్ష్మ క్రిములు తప్పకుండా ఉంటాయి.

అందుకే ఈ ప్రదేశాలు అన్నిటి మీదా నేచర్ ప్రొటెక్ట్ ఆన్-ది-గో డిసిన్ఫెక్టెంట్ స్ప్రేని ఉపయోగించమని మేము సూచిస్తున్నాము. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళచ్చు, అందువల్ల ఈ స్ప్రే ని మృదువుగా మరియు మెత్తగా ఉండే ప్రదేశాల మీద సులభంగా స్ప్రే చేయవచ్చు అని మేము సిఫార్సు చేస్తున్నాము. ఏదైనా వస్తువును మనం నీళ్లు, సోప్ పెట్టి శుభ్రం చేయకుండా ఈ స్ప్రే ని ఉపయోగించడం వల్ల మనకి పని సులువు అవుతుంది. ఈ స్ప్రేని ఉపయోగించమని మేము సిఫార్సు చేయడానికి మరొక కారణం ఏమిటంటే ఇది వేప, కలబంద మరియు తులసి లాంటి సహజ పదార్థాలతో తయారు చేయబడింది. అలాగే సిడిసి వెబ్సైటు లో సూచించినట్లు ఈ స్ప్రే లో 60% కంటే ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉండడం వల్ల సూక్ష్మక్రిములు సులభంగా అంతమై పోతాయి. వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని మనకి తెలుసు, ఇది వస్తువుల పైన ఉన్న క్రిముల్ని అంతం చేయడంలో శక్తివంతంగా పని చేస్తుంది. మాలాగా, మీరు కూడా ఈ స్ప్రే ఉపయోగించిన తర్వాత దాని నుంచి వచ్చే ఆహ్లాదకరమైన తాజా సువాసనను ఇష్టపడతారు.

4) కార్ కిటికీలను దించి ఉంచండి

గాలి కదలిక ఎక్కువగా లేని ప్రదేశాల్లో కొంచెం సేపు ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ గాలి వచ్చేలా చూసుకోవాలి. మీరు క్యాబ్ ఎక్కిన వెంటనే, డ్రైవర్ ని కార్ కిటికీలు దింపమని అడగడం వల్ల తాజా గాలి లోపలికి వస్తుంది. మేము ప్రయాణం చేస్తున్నంత సేపు కూడా కార్ అద్దాలు కిందికి దించి ఉండేలా చూసుకుంటాము. కార్ అద్దాలను క్రిందికి దించేప్పుడు అద్దం బటన్ ముట్టుకునే ముందు దాని మీద మొదట డిస్స్ఇన్ఫెక్షన్  స్ప్రే చేయండి.

5) కాంటాక్ట్‌లెస్ చెల్లింపు పద్ధతులను ఎంచుకోండి

మేము సాధారణంగా ముందుగానే క్యాబ్ చార్జీలను చెల్లించేస్తాము లేదా క్యాబ్ లో ప్రయాణించేటప్పుడు కాంటాక్ట్‌లెస్ చెల్లింపును ఎంచుకుంటాము. కుదిరిన చోట క్యాష్ ఉపయోగించడం తగ్గిస్తే మంచిది. ఒకవేళ తప్పక క్యాష్ ఇవ్వాల్సి వస్తే మీ దగ్గర తగినంత క్యాష్ ఉండేలా చూసుకోండి, లేదా క్యాష్ అందుకోగానే దాన్ని పక్కన పెట్టి మీరు మీ చేతులను శానిటైజ్ చేసుకోండి.

6) ఇంటికి చేరుకోగానే మీ బట్టలు ఉతికి వేయండి మరియు ఇతర వస్తువులను డిస్ఇన్ఫెక్ట్ చేయండి

ఇంటికి చేరుకోగానే, మీరు క్యాబ్ లో తీసుకుని వెళ్లిన వస్తువులు అంటే మీ బ్యాగ్, షూస్, పర్స్, కీస్, ఫోన్ లాంటి అన్ని వస్తువులను డిస్ ఇన్ఫెక్ట్ చేయండి. మా విషయంలో అయితే, నేచర్ ప్రొటెక్ట్ ఆన్-ది-గో డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రే చాలా ఉపయోగపడింది - ఎందుకంటే దీన్ని సులభంగా తీసుకుని వెళ్ళచ్చు మరియు అన్ని రకాల పరిసరాల మీద, వస్తువుల మీద ఉన్న సూక్ష్మక్రిములను దూరం చేస్తుంది. ప్యాక్ మీద ఇచ్చిన సూచనలను అనుసరించండి. అన్ని వస్తువులతో పాటు, మీరు మీ దుస్తులను కూడా సరైన మార్గంలో శుభ్రపరచడం ఎంతో అవసరం!

ఈ మహమ్మారి సమయంలో క్యాబ్ లో ప్రయాణం చేయడం తిరిగి మొదలుపెడుతున్న ఈ సమయంలో ఈ సూచనలు పాటించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి

https://www.cdc.gov/handwashing/show-me-the-science-hand-sanitizer.html

రహస్య సూచన : మీరు భారతదేశంలోని ఉత్తమమైన ఉత్పాదనలు ఇక్కడ చూడండి

వ్యాసం మొదట ప్రచురించబడింది