పిల్లల్ని బయటకు తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తలు

ఈ మహమ్మారి సమయంలో పిల్లల్ని పార్కులకి, హోటల్స్ కి, మాల్స్ కి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకి తీసుకుని వెళ్ళాలి అంటే మనం ఎంతో ఆందోళనకి లోనవుతున్నాము. అలా మీరు ఆందోళనకి లోను కాకుండా ఉండడానికి, పిల్లలను జాగ్రత్తగా ఉంచడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

వ్యాసం నవీకరించబడింది

పిల్లల్ని బయటకు తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తలు
ప్రకటన
Nature Protect Wipes

తల్లిదండ్రులుగా మనం మన పిల్లలను సూక్ష్మక్రిములు ఉన్న వాతావరణాలకు తీసుకుని వెళ్ళడానికి భయపడుతూ ఉంటాము, ఎందుకంటే పిల్లలకి ఎక్కడ నుంచి అయినా ఇన్ఫెక్షన్ అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం ఎంతవరకు ఈ జాగ్రత్తలు తీసుకుంటాము? అదీ ఈ మహమ్మారి సమయంలో! బయటకు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ప్రదేశాలలో సూక్ష్మక్రిములు లేకుండా ఉన్నాయి అనే నమ్మకం మనకు ఉండదు.

అలా అని అక్కడ మనం ఇంట్లో వాడినట్టు సబ్బు, నీళ్ళు, క్లబ్ సోడా, వెనిగర్ లాంటివి ఉపయోగించలేము. కాబట్టి, మీ పిల్లల చేతులతో పాటు ఇతర అపరిశుభ్రమైన వస్తువుల మీద క్రిములు లేకుండా చేయడానికి సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం మన చేతిలో ఉండటం మంచిది. మనం అటువంటి పరిస్థితులు ఇంతకు ముందు చూసాము కాబట్టి, మీరు, మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండటానికి సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలను మీతో పంచుకుంటున్నాము.

1. పిల్లల్ని ఎప్పుడు బయటకు తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయించుకోండి

పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇది అతి ముఖ్యమైన విషయం. మా అనుభవంలో పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు, వారు హుషారుగా ఉన్నప్పుడు సామాజిక దూరం పాటించమనడం అతి కష్టమైన విషయం. అందుకే ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది లేని సమయంలో వారికి నచ్చిన ప్రదేశాలకి తీసుకుని వెళ్లడం ఉత్తమం. ఉదాహరణకి: ఎక్కువమంది లేని సమయంలో మాల్ కి వెళ్ళచ్చు, అలాగే ఉదయం పూట తక్కువ మంది ఉండే, చక్కగా పరిగెత్తి ఆడుకోవడానికి వీలుగా ఉండే పార్క్ కి తీసుకొని వెళ్ళచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే పిల్లలు ఎక్కువమంది లోకి వెళ్ళక్కర్లేకుండానే చక్కని సమయం గడుపుతారు.

2. పార్క్ లకి, ప్లే గ్రౌండ్స్ కి, హోటల్స్ కి వెళ్ళే ముందు అత్యవసరాలు అయిన డిస్ ఇన్ఫెక్షన్ వైప్స్ వంటివి ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టుకోండి.

ప్రకటన

Nature Protect Wipes

ఎక్స్ట్రా మాస్క్ లు, వాటర్ బాటిల్, తినుబండారాలు, హ్యాండ్ టవల్స్ తో పాటు చిన్నారుల చేతుల నుండి మరియు అన్ని పరికరాల మీద నుంచి సూక్ష్మక్రిములను పోగొట్టే చిన్న శానిటైజింగ్ బాటిల్ కూడా మీ బ్యాగ్ లో ఉండేలా చూసుకోండి. మనం వాడే డిస్ ఇంఫెక్టన్ట్ లో కఠినమైన రసాయనాలు లేకుండా ఉండడం చాలా ముఖ్యం. అందుకే మేము నేచర్ ప్రొటెక్ట్స్ ఆన్-ది-గో డిస్ ఇంఫెక్టన్ట్ వైప్స్ ని ఉపయోగించమని సిఫార్సు చేస్తాము. వీటిల్లో వేప, తులసి మరియు కలబంద వంటి సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ పదార్థాలు ఉంటాయి, వీటిని వాడిన తర్వాత మంచి సువాసనను కూడా వెదజల్లుతాయి.

పిల్లలు ఒక చోట ఉండనే ఉండరు. ఎప్పుడూ ఏదోకటి ముట్టుకుంటూనే ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్స్, హోటల్ లోని టేబుల్స్, పార్క్ లో ఉయ్యాలలు ఇలా అన్ని ముట్టుకుంటూనే ఉంటారు. అందుకే పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు శానిటైజింగ్ వైప్స్ తీసుకుని వెళ్లడం మంచి ఐడియా.

శానిటైజింగ్ వైప్స్ తో చేతుల్నే కాకుండా, మొబైల్ ఫోన్, కార్ కీస్, ఇతర పరికరాల మీద సూక్ష్మక్రిములు లేకుండా చేయవచ్చు. వైప్స్ తో తుడిచిన తర్వాత వాటిని గాలికి ఆరనివ్వాలి.

3. వారు ఎల్లప్పుడూ మాస్క్ వేసుకునేలా చూసుకోండి

ఈ విషయంలో ఎలాంటి చర్చలకి తావు లేదు. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకోవాలి. వినకపోతే పిల్లలు చెప్పిన మాట విననప్పుడు వారికి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్ ఉన్న మాస్క్ వేసుకోమని ప్రోత్సహించవచ్చు. మేము మాస్కులు తయారు చేసి వేసుకోవడం ఒక చక్కని ప్రాజెక్ట్ లాగా చేసాము. మాస్క్ లకు అందమైన రంగులు వేస్తూ, స్టికర్స్ అంటిస్తూ మీరు పిల్లలతో చక్కని సమయాన్ని గడపచ్చు, దీని వల్ల వాళ్ళు మాస్క్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ పద్ధతి మాకు చాలా సహాయం చేసింది. ఈ పద్ధతి వల్ల మీ పిల్లలు సురక్షితంగా ఉండడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతని బయటికి తీసుకు వస్తుంది.

4. పబ్లిక్ టాయిలెట్ వాడినప్పుడు  ఎక్కువ జాగ్రత్తగా ఉండండి

మార్కెట్స్ కి, మాల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాష్ రూమ్స్ వాడాల్సి రావచ్చు. అంటే, అందరూ ఉపయోగించే వాటినే మనం కూడా ఉపయోగించాలి. పబ్లిక్ టాయిలెట్స్ అంతగా శుభ్రంగా ఉండవు, అలాగే అందరూ వీటిని ఉపయోగించడం వల్ల సూక్ష్మక్రిములు, వైరస్ల వల్ల సులభంగా అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. మన జాగ్రత్త కోసం, ఎక్కువమంది లేని సమయంలో నేచర్ ప్రొటెక్ట్ ఆన్-ది-గో డిస్ఇన్ఫెక్షన్  వైప్స్ తో డోర్ హ్యాండిల్స్,  ఇంకా అవసరమైన ప్రదేశాలు తుడుచుకుని వెళ్లడం ఆరోగ్యకరం. వీటిని ఉపయోగించిన తర్వాత మన చేతుల నుంచి సువాసనలు వస్తాయి. ఈ వైప్స్ లో బ్లీచింగ్ ఏజెంట్స్ లేని కారణంగా పిల్లలు వాడినా ఎలాంటి హాని కలగదని మేము గ్రహించాము.

పిల్లలను బయటకు తీసుకుని వెళ్ళినప్పుడు లేదా తీసుకుని వెళ్ళాలి అంటే పిల్లల భద్రత గురించి మనం తల్లిదండ్రులుగా ఎప్పుడూ ఆందోళనకు గురి అవుతూనే ఉంటాము. ఈ మహమ్మారి సమయంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ అయ్యింది. మేము ఈ పరిస్థితుల్లో నుంచి వచ్చాము కాబట్టి మాకు మీరు పడే ఆందోళన అర్థం అవుతోంది. అందువల్ల మీరు పిల్లలను పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలకి తీసుకొని వెళ్లినప్పుడు సూక్ష్మక్రిములు లేకుండా ఉండడానికి సహాయపడే ఆల్కహాల్ శానిటైజింగ్ వైప్‌లను ఉపయోగించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాము!

https://www.cdc.gov/handwashing/show-me-the-science-hand-sanitizer.html

రహస్య సూచన : మీరు భారతదేశంలోని ఉత్తమమైన ఉత్పాదనలు ఇక్కడ చూడండి

వ్యాసం మొదట ప్రచురించబడింది