
దుర్వాసన ఉన్న చోట మీ మెడచుట్టు ఉండవలసిన స్కార్ఫ్‌తో మీ ముక్కుని మూసుకోవడం అనేది మీరు అనుకోకుండా చేసే మొదటి చర్య. మీ స్కార్వ్స్ కి ఆహ్లాదకరమైన సెంట్‌ని వేయడం అనేది మంచి ఆలోచన. ఇలా చే యడానికి గల కారణం ఏమంటే, మీ చుట్టూ ఉన్న గాలిలో దుర్వాసన ఉన్నప్పటికీ, మీ స్కార్ఫ్ పై మీకిష్టమైన సెంట్ ఉంటే రోజంతా మీ మూడ్ ఆహ్లాదంగా ఉంటుంది.
మీ స్కార్ఫ్‌ని ఉతికేటపుడే పరిమళాలని చేర్చడానికి సులువైన చిట్కాలని తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.
1) సువాసన గల డిటర్జెంట్‌ని వాడండి
మీ స్కార్ఫ్ ని ఉతికేటపుడు సెంటెడ్ డిటర్జెంట్‌ని లేబుల్‌పై ఇచ్చిన సూచనల ప్రకారం వేయాలి. దయచేసి గమనించండి, సిల్క్ మరియు ఉన్ని వంటి సున్నితమైన దుస్తులను మీ మెషీన్‌లో జెంటిల్ సైకిల్‌లో ఉంచి ఉతకాలి.
2) ఎస్సెన్షియల్ ఆయిల్స్‌ని జోడించండి.
మీకు ఇష్టమైన ఎస్సెన్షియల్ ఆయిల్‌ని 10-15 చుక్కలు వాషింగ్ లోడ్ వేసేటపుడు వేయండి మరియు సాధారణంగానే వాష్ చేయండి. మీ సొంత అనుకూలతని బట్టి సెంట్‌ని మరికొన్ని చుక్కలు వేయడానికి సందేహించకండి.

3) వాషర్ నుండి తొలగించండి
మీ స్కార్వ్స్ ఉతకడం పూర్తయ్యాక, వాటిని ఎలాంటి ఆలస్యం లేకుండా ఆరేయండి మీ స్కార్వ్స్ ని మెషీన్‌లో ఉంచి ఉతికినపుడు, వాటి నుండి కొంత దుర్వాసన వస్తుంది.
4) పూర్తిగా ఆరనివ్వండి
మీ స్కార్వ్స్ ని తిన్నగా ఎండలో ఆరబెట్టకూడదు, అలా చేస్తే మీ స్కార్ఫ్ వెలిసిపోతుంది. అలాగే, డ్రైయర్‌ని వాడకండి, ఇది మీ స్కార్ఫ్ బట్టని పాడయ్యేలా చేస్తుంది. జాగ్రత్తగా ఉంచుకోవడానికి మీ స్కార్వ్స్ ని ఇంటి లోపల సూర్య కాంతి పడని చోట ఆరేయాలి.
మీ స్కార్వ్స్ పూర్తిగా ఆరినట్లు నిర్ధారించుకుని బీరువాలో పెట్టుకోవాలి. స్కార్ఫ్ లో తడి ఉంటే వాసన బావుండదు.
ఈ సాధారణ చిట్కాలని పాటించి మీ స్కార్వ్స్ మంచి పరిమళాలని వెదజల్లేలా చేసుకోవచ్చు.