మీ బట్టల నుంచి బెల్లం మరకలను ఎలా తొలగించాలి

బెల్లం, మీ బట్టలపై పడితే, మొండి పట్టుదలగల గోధుమ రంగు మరకలను కలిగించవచ్చును. దీన్ని తొలగించడానికి ఈ శుభ్రపరిచే పద్ధతిని ప్రయత్నించండి.

వ్యాసం నవీకరించబడింది

How to Remove Jaggery Stains from Your Clothes
ప్రకటన
Surf Excel Matic Liquid

బెల్లం, తీపి వంటలను తయారు చేయడానికి ఉపయోగించే ప్రధాన పదార్థాలలో ఒకటి. రుచికరమైన వంటలు చేసేటప్పుడు, అనుకోకుండా అది  మీ బట్టలపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రుచికరమైన వంటలు తీపి అయితే, బెల్లం మరకలు అంత తీపిగా ఉండవు.  వెంటనే శుభ్రం చేయకపోతే అవి మొండి మరకలుగా మారవచ్చు. అలాంటి మరకలను తొలగించడానికి దిగువ చర్యలను  ఉపయోగించండి. 

దశ 1: మరకను శుభ్రం చేయండి

బెల్లం మరక వస్త్రం పై పడిన వెంటనే వీలైతే ఒక శుభ్రమైన బట్టతో తుడవండి, బెల్లం మరక ఎండిపోతే మెండిమరకగా మారుతుంది.

దశ 2: శుభ్రపరచే ద్రావకం చేయండి

ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకొని దానికి 1 కప్పు ఫాబ్రిక్ క్లీనింగ్ ద్రావణాన్ని జోడించండి.

ప్రకటన
Surf Excel Matic Liquid

దశ 3: వస్త్రాన్ని నానబెట్టండి

ఆ బకెటలో వస్త్రాన్ని వేసి రాత్రంతా నానబెట్టండి.

దశ 4: మరకను రుద్దండి

మరుసటి రోజు ఉదయం, బట్టను తీసివేసి, బ్రష్ ఉపయోగించి మరక పై మెత్తగా రుద్దండి.

దశ 5: కఠినమైన మరకల కోసం వెనిగర్ వాడండి

మరక ఇంకా కనిపిస్తే, ఒక కప్పు తెలుపు వెనిగర్ తీసుకొని మరక మీద పోసి గంటసేపు అలాగే ఉండడానికి పక్కన ఉంచండి.

దశ 6: మరక పై బ్రష్ చేయండి

ఇప్పుడు వృత్తాకార కదలికలో మరకను బ్రష్ చేయడానికి ప్రయత్నించండి. వస్త్రం తెల్లగా ఉంటే, ½ ఒక కప్పు బ్లీచ్ పోయాలి, ఇది ఖచ్చితంగా మరకను తొలగిస్తుంది.

దశ 7: ఫాబ్రిక్ సాఫ్‌నర్‌ని ఉపయోగించండి

ఇప్పుడు మరో బకెట్ వెచ్చని నీటిని తీసుకొని 1 కప్పు ఫాబ్రిక్ సాఫ్‌నర్‌ని వేసి, బకెట్ లోపల వస్త్రాన్ని ఉంచి 5 నిమిషాలు ఉంచండి.

దశ 8: అదనపు నీటిని పారబోయండి

ఆ తరువాత, వస్త్రంను బయటకు తీసి, నీరుంతా పోయే వరకు మెల్లగా పిండాలి. 

దశ 9: సహజ సూర్యకాంతిలో ఆరబెట్టండి

దీన్ని బాగా విస్తరించి, సహజంగా ఆరబెట్టడానికి ఎండ కింద వేలాడదీయండి.

అంతే! బెల్లం మరకల గురించి చింతించాల్సిన అవసరం లేదు. నూలు , పాలిస్టర్, రేయాన్ వంటి బట్టల పై కూడ ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది