మీరు మీ బెడ్రూమ్ నుంచి పనిచేస్తున్నారా? మీ బెడ్ని పరిశుభ్రంలా ఎలా ఉంచాలో ఇక్కడ సూచిస్తున్నాము.

మీరు ఎక్కువ కాలం ఇంటిలోనే ఉంటుంటే, మీరు మీ బెడ్‌రూమ్‌ నుంచి పని చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ బెడ్‌ని శుచిగా శుభ్రంగా ఉంచడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి.

వ్యాసం నవీకరించబడింది

Are You Working From your Bedroom? Here’s How to Keep Your Bed Clean
ప్రకటన
Surf Excel Matic Liquid

మీరు హాయిగా నిద్రపోవాలంటే మరియు ఆరోగ్యకరమైన లివింగ్‌ స్థలం పొందాలంటే పక్క దుప్పట్లు, దిండు గలీబులు మరియు దుప్పట్లు పరిశుభ్రంగా ఉంచవలసి ఉంటుంది. కాబట్టి, మీ పక్క దుప్పట్లను క్షుణ్ణంగా శుభ్రం చేయడం మరియు ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలను క్రమంతప్పకుండా చేయడం ముఖ్యం. మీ పక్క దుప్పట్లను క్షుణ్ణంగా ఎలా శుభ్రం చేయాలని ఆశ్చర్యపోతున్నారా, అయితే మీరు సరైన చోటుకు వచ్చారు.

ఈ వ్యాసంలో, మీ పక్కదుప్పట్లు పరిశుభ్రంగా ఉండేలా చేసే పరిశుభ్రమైన సూచనలు మేము ఇస్తున్నాము. శుభ్రంచేయడం గురించి మేము ఇచ్చే సలహాను నేడే పాటించండి.

పక్కదుప్పట్లు

కేర్‌ లేబుల్‌లో పేర్కొన్న ఉష్ణోగ్రత సెట్టింగులను పాటించడం ద్వారా మీరు మీ వాషింగ్‌ మెషీన్‌లో పక్కదుప్పట్లను  ఉతకవచ్చు. పాలియెస్టర్‌ ఫ్యాబ్రిక్‌తో తయారుచేసి పక్కదుప్పట్లను ఉతకడానికి గోరువెచ్చని నీటి సెట్టింగ్‌ని ఉపయోగించండి. కాటన్‌ దుస్తులకు చల్లని నీటి సెట్టింగ్‌ అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్‌కి ప్రత్యేక వాషింగ్‌ లేదా డ్రైయింగ్‌ కేర్‌ అవసరం, కాబట్టి కేర్‌ లేబుల్‌ని చెక్‌ చేయడం ఉత్తమంగా ఉంటుంది. ఉతికిన తరువాత, మీ పక్కదుప్పట్లను సహజమైన ఎండలో దండెంపై వేలాడదీయండి. ముదురు మరియు లేత రంగు దుస్తులను వేర్వేరుగా ఉతకాలని గుర్తుంచుకోండి. రిన్‌ యాంటీబ్యాక్‌ లాంటి మంచి డిటర్జెంట్‌తో తప్పకుండా మీ దుప్పట్లు ఉతకండి. మార్కెట్‌లో లభించే లైఫ్‌బాయ్‌ లాండ్రీ శానిటైజర్‌ లాంటి లాండ్రీ శానిటైజర్‌ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ప్యాక్‌పై ఇవ్వబడిన వాడకపు సూచనలు పాటించండి మరియు అనుకూలతను పరీక్షించేందుకు కొద్ది గోప్యమైన ప్రదేశంలో ముందుగా  పరీక్ష చేయండి.

మీ డువెట్స్‌ మరియు పక్కదుప్పట్లను శుభ్రంగా ఉంచడంపై మరిన్ని చిట్కాల కోసం మీరు మా ఆర్టికల్‌ని చదవండి.

ప్రకటన

Surf Excel Matic Liquid

దిండ్లు మరియు కుషన్‌లు

మీ దిండు మరియు కుషన్‌పై ఉన్న వాష్‌ కేర్‌ లేబుల్‌ ‘డ్రై క్లీన్‌ మాత్రమే’ అని పేర్కొంటే తప్ప, మీరు ఇంట్లో వాటిని మెషీన్‌లో ఉతకవచ్చు. గుండ్రంగా తిరిగేందుకు మరియు సరిగ్గా శుభ్రంచేసేందుకు వీలుగా తగినంత స్థలం కోసం ఒకసారి రెండు దిండ్లు లేదా కుషన్‌లు మాత్రమే ఉపయోగించండి. ఒక కప్పు డిటర్జెంట్‌ వేసి అతితక్కువ సైకిల్‌పై కోల్డ్‌ వాటర్‌ సెట్టింగుపై ఉతకండి. ఇదే సైకిల్‌లో మీ దిండు మరియు కుషన్‌ కవర్‌లను కూడా మీరు ఉతకవచ్చు.

పరుపులు

పరుపుని ఎలా శుభ్రంచేయాలని ఆలోచిస్తున్నారా, అయితే పరుపు కవర్ని తీసి ప్రారంభించండి. మీరు దీనిని మీ దిండు గలీబులతో పాటు వాష్ సైకిల్లో ఉతకవచ్చు. తదుపరి చేయవలసిన పని మీ పరుపుని  బాగా వ్యాక్యూమ్ చేయడమే. వెంటిలేషన్ కోసం కిటికీలు తెరిచివుంచండి. తరువాత, పరుపుని మళ్ళీ వ్యాక్యూమ్ చేయండి. పరుపుని శుభ్రంచేసే చర్యలపై మీరు మా సవివరమైన వ్యాసం కూడా చదవవచ్చు.

దుప్పట్లు

మీరు మీ దుప్పట్లను మీ వాషింగ్‌ మెషీన్‌లో కోల్డ్‌ వాటర్‌ సెట్టింగులో మరియు సౌమ్యమైన వాష్‌ సైకిల్‌లో ఉతకవచ్చు. దీని కోసం, స్వల్ప డిటర్జెంట్‌ని ఉపయోగించవలసిందిగా మేము మీకు సూచిస్తున్నాము. ఈ పద్ధతి ఉన్ని, ఫ్లీస్‌ మరియు కాటన్‌ దుప్పట్లకు పనిచేస్తుంది. ఉతికిన తరువాత, ఎక్కువగా ఉన్న నీటిని తొలగించేందుకు సౌమ్యంగా ఒత్తండి మరియు పాక్షిక నీడలో ఆరబెట్టండి.

ఇంకా, ఏదైనా ఉపరితలాన్ని తాకిన తరువాత, మీరు సబ్బుతో లేదా లైఫ్‌బాయ్‌ నుంచి లభించే వాటి లాంటి ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో మీ చేతులు కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

బెడ్‌రూమ్‌ నీటుగా ఉండేందుకు ఈ సూచనలు పాటిస్తే మీ బెడ్‌ పరిశుభ్రంగా మరియు సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది