మీ బొంత మరియు దుప్పట్లని ఎల్లప్పుడూ సువాసనతో ఎలా ఉంచాలి!

మీ బొంత లేదా దుప్పట్లకి తాజా సువాసన కల్పించడం ఎలా అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇకపై చూడకండి! మేము ఇస్తున్న ఈ సరళమైన చర్యలను పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

How to Keep Your Duvet and Bedsheets Smelling Great Always!
ప్రకటన
Surf Excel Matic Liquid

మీరు ఈ బెడ్‌రూమ్‌లో రిలాక్స్‌ అవుతారు, నిద్రపోతారు, కాబట్టి మీ దుప్పట్లు మరియు బొంతలు మంచి సువాసనతో ఉండాలని మీరు కోరుకుంటారు. మీ దుప్పట్లు మరియు బొంతకు తాజా సువాసన కల్పించే సులభ మార్గం వాటిని వెంటనే ఉతకడమే. ఉతికిన తరువాత మీ బట్టలు మరియు దుప్పట్లను సువాసనతో ఉంచే సరళ స్టెప్‌ బై స్టెప్‌  ప్రక్రియను మేము మీకు ఇస్తాము.

సువాసన వచ్చే దుప్పట్ల కొరకు

స్టెప్‌ 1: మీ దుప్పట్లు నానబెట్టండి

గోరువెచ్చని నీటితో నింపిన బక్కెట్‌ తీసుకోండి. నీటికి 1 పెద్ద చెంచా  డిష్‌వాషింగ్‌ పౌడరుతో పాటు 1 కప్పు వినిగర్‌  కలపండి. మీ దుప్పట్లను ఈ బక్కెట్‌లో పెట్టండి, వాటిని గుండ్రంగా తిప్పండి మరియు వాటిని 30 నిమిషాల సేపు నానబెట్టండి. ఎలాంటి వాసనలనైనా కప్పిపెట్టడానికి వినిగర్‌ సహాయపడుతుంది.

స్టెప్‌ 2: ఉతుకును సువాసనగా చేయండి

ప్రకటన

Surf Excel Matic Liquid

మీ దుప్పట్లను నానబెట్టిన బక్కెట్‌ నుంచి బయటకు తీయండి. ఎక్కువగా ఉన్న నీటిని పిండేసి వాటిని మీ వాషింగ్‌ మెషీన్‌లో వేయండి. ఉతికిన తరువాత మీ దుప్పట్లు తాజా సువాసనతో ఉంచేందుకు, మీ వాషర్‌కి నేరుగా ½ కప్పు బేకింగ్‌ సోడాతో పాటు 4-5 చుక్కల మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని నేరుగా వేయండి మరియు మీ దుప్పట్లకు తాజా పరిమళం కలిపేందుకు మీ మామూలు సైకిల్‌ రన్‌ చేయండి. మీ వాషింగ్‌ మెషీన్‌కి నీటి కోసం టెంపరేచర్‌ సెట్టింగ్‌ ఉంటే, మీరు ‘వామ్‌’ ఎంచుకోవచ్చు. అయితే, టెంపరేచర్‌ని ఎంచుకోవడానికి ముందు మీ దుప్పట్లపై గల కేర్‌ లేబుల్‌ని ఎల్లప్పుడూ పరీక్షించండి.

స్టెప్‌ 3: మీ దుప్పట్లను ఆరబెట్టండి

చివరగా చేయవలసిన పని మీ దుప్పట్లను ఆరబెట్టాలి. దీనిని ఎండ స్వల్పంగా ఉన్నప్పుడు  చేయడం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఇది క్రిములను కూడా చంపుతుంది, తాజా గాలి మీ దుప్పట్లను మంచి సువాసనతో ఉంచుతుంది.

బొంతలు సువాసనతో ఉండేందుకు

స్టెప్‌ 1: మీ బొంతలను ఉతకండి

మీ బొంతను వాషింగ్‌ మెషీన్‌లో పెట్టి మీ రెగ్యులర్‌ సైకిల్‌ రన్‌ చేయండి.

స్టెప్‌ 2: ద్రావణం తయారుచేయండి

నీళ్ళు, వినిగర్‌  మరియు నిమ్మ రసం సమాన భాగాలు గల ద్రావణం తయారుచేయండి. దీనిని పిచికారి బాటిల్‌లో పెట్టండి మరియు ఆరిపోయిన తరువాత దీని మొత్తాన్ని మీ బొంతపై పూయండి. వినిగర్‌  మరియు నిమ్మ రసం దుర్వాసనలను చంపేస్తాయి మరియు మీ బొంతకు తాజా సువాసన కలిగిస్తుంది.

స్టెప్‌ 3: మీ బొంతలను ఆరబెట్టండి

మీ బొంతను సమతల ఉపరితలంపై ఉంచి సహజంగా ఆరబెట్టండి.

ఈ సరళ చిట్కాలు పాటించారంటే మీ బొంతలు మరియు దుప్పట్లు పరిశుభ్రంగా, తాజా సువాసనతో ఉంటాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది