
కాటన్ చికంకరి కుర్తా వంటి అందమైన మరియు సున్నితమైన వస్త్రాలకు కొంత అదనపు జాగ్రత్త అవసరం. సంరక్షణ మరియు నిర్వహణ సూచనలు సమయం తీసుకుంటాయి మరియు ఇబ్బంది పెట్టేవ ిగా అనిపించినప్పటికీ, అవి అలా కాదు. మీ ప్రయత్నాలను సరళీకృతం చేయడానికి మరియు ఫలితం గరిష్ఠంగా చేయడానికి మేము సులభమైన సంరక్షణ చిట్కాలతో ముందుకు వచ్చాము.
ఈ అద్భుతమైన సంరక్షణ చిట్కాలను ప్రయత్నించండి.
**1) మీ కుర్తాను చేతితో ఉతకాలి**
మీ చికంకరి కుర్తాను చల్లటి నీటితో ఉతుక్కోవడం మంచిది. వేడి నీటిని ఎప్పుడూ ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇది కాటన్ వస్త్రంను కుంచించుకుపోయేలా చేసి ఎంబ్రాయిడరీని దెబ్బతీస్తుంది.
2) మైల్డ్ డిటర్జెంట్ వాడండి
ఉతకడానికి తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించమని మేము సూచిస్తున్నాము. ఆర బకెట్( ½) చల్లటి నీటిలో ఆర కప్పు తేలికపాటి డిటర్జెంట్ కలపాలి. అందులో మీ కుర్తాను వదలండి, 10 నిమిషాలు నానబెట్టండి. అప్పుడు, మీ కుర్తాను మాములు నీటిలో సున్నితంగా ఝాడించి శుభ్రం చేసుకోండి. దీని కోసం మీరు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ వంటి తేలికపాటి డిటర్జెంట్ ను ప్రయత్నించవచ్చు.

3) బ్రషింగ్ చేయవద్దు
మీ చికంకరి కుర్తాను ఉతికేటప్ప ుడు, స్క్రబ్బింగ్ బ్రష్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఇది ఎంబ్రాయిడరీని దెబ్బతీస్తుంది. ఏదైనా మరకలను ఉంటే, సున్నితంగా రుద్దడానికి మీరు మీ వేళ్లను ఉపయోగించవచ్చు. వృత్తాకార కదలికలో తేలికపాటి డిటర్జెంట్ యొక్క 2-3 చుక్కలను రుద్దండి, మరకను తుడిచివేసి చల్లటి నీటిలో ఝాడించండి.
4) పిండడం లాంటిది చేయవద్దు
చికంకరి కాటన్ కుర్తా ఉతికిన తర్వాత ఎప్పుడూ పిండడం లాంటిది చేయవద్దు. మందపాటి కాటన్ టవల్ లో రోల్ చేసి, మిగిత నీటిని పిండి వేయడానికి నొక్కండి. ఇలా ఈ ప్రక్రియను రెండుసార్లు చేయండి.
5) చదునైన దాని పై మీ కుర్తాను ఆరేయండి
ఉతికిన తరువాత, చదునైన దాని పై నీడలో ఆరబెట్టండి. ప్రత్యక్ష సూర్యకాంతి ఎంబ్రాయిడరీ యొక్క అందాన్ని పనికి రాకుండా చేసి రంగు మసకబారడానికి కారణమవుతుంది.
కుర్తా పూర్తిగా ఆరిపోయిన తర్ వాత, దాన్ని లోపలికి తిప్పి మస్లిన్ వస్త్రంలో మడిచి పెట్టండి. తదుపరి ఉపయోగం వరకు మీ అల్మరాలో నిల్వ చేయండి. ఈ చిట్కాలు మీ కాటన్ చికంకరి కుర్తాను ఎక్కువ కాలం ఉత్తమ స్థితిలో ఉంచుతాయి.