చెమ్మ చేరడం ద్వారా మీ దుస్తులు వాసన వస్తున్నాయా? చెమ్మ నుంచి వచ్చే వాసనను పోగొట్టేందుకు కొన్ని సులభమైన మార్గాలు

వాషింగ్‌ మెషీన్‌ నుంచి తడి బట్టలను వెంటనే బయటకు తీసి, విడిగా ఆరేయాలి. కానీ కొన్ని సార్లు ఇలా వెంటనే చేయకపోవడం కారణంగా, వాటిలో చెమ్మ నుంచి వాసన వస్తూ ఉంటుంది.

వ్యాసం నవీకరించబడింది

చెమ్మ చేరడం ద్వారా మీ దుస్తులు వాసన వస్తున్నాయా? చెమ్మ నుంచి వచ్చే వాసనను పోగొట్టేందుకు కొన్ని సులభమైన మార్గాలు
ప్రకటన
Surf Excel Matic Liquid

మీ దుస్తులను వెచ్చని నీటిలో ముందుగా నానబెట్టండి మరియు తిప్పడానికి ముందు ఒక కప్పు వెనిగర్‌ను వేయండి.

అసలు వాసన రాకుండా అడ్డుకోగలగడమే అన్నింటి కంటే ఉత్తమమైన పని. అయితే, వాసన రాకుండా అన్నివేళలా అడ్డుకోవడం అసాధ్యమైన పనే. అందుకే మీ దుస్తులు తాజా పరిమళాలు వెదజల్లేలా చేయడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకోండి.

  • దుస్తుల లోపలి భాగంలో వెనిగర్‌ను స్ప్రే చేసి, అలాగే కొన్ని గంటల పాటు హ్యాంగర్‌కు వేలాడదీయండి.

  • మీ వాషింగ్ మెషీన్‌లో ఈ దుస్తులను ఒకసారి డ్రై స్పిన్ చేయండి. ఈ సమయంలో మీరు నిమ్మరసం చుక్కలను కొన్నింటిని వేయడం ద్వారా, చెడువాసనను దూరం చేయచ్చు.

  • రాత్రి అంతా మీ దుస్తులను ఫ్రీజ్ చేయండి. మీరు తరువాత ఉతుకుతున్న సమయంలో ఇది దుర్గంధాన్ని పూర్తిగా నివారించగలుగుతుంది.

  • ఒక పూర్తి కప్పు వెనిగర్‌ను వేసి, వాషింగ్‌ మెషీన్‌లో గోరువెచ్చని నీటిలో మీ దుస్తులను ఉతకండి. వాటిని వెంటనే ఆరేయడం మరచిపోకండి.

కొన్ని తాజా పరిమళాలు మరియు ఫ్రెష్ లాండ్రీని ఆస్వాదించండి.

ప్రకటన

Surf Excel Matic Liquid

వ్యాసం మొదట ప్రచురించబడింది