మీ రంగురంగుల దుపట్టా నుంచి ఆహార మరకలను ఎలా శుభ్రం చేయాలి

ఒక దుపట్టా మీ రూపాన్ని వెంటనే మెరిసేలా చేయవచ్చును, కాని అనుకోకుండా దానిపై పడే చిందులు మరియు మరకలు మీ దుస్తుల అందాన్ని మసకగా చేయవచ్చును. మీ దుపట్టా నుండి మరకలను శుభ్రం చేయడానికి ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి

వ్యాసం నవీకరించబడింది

How to Clean Food Stains from Your Colourful Dupatta
ప్రకటన
Surf Excel Matic Liquid

చాలామంది మహిళలకు ఒక దుపట్టా బట్టల బీరువాలో ఉండే ప్రధాన వస్తువు మరియు మీ పాత దుస్తులకు కూడా స్టైలైన  రూపాన్ని సంతరింపచేయవచ్చును. ప్రత్యేక వేడుకలకు మీరు డిజైనర్‌ సూటును ధరించవచ్చును లేదా ఉద్యోగానికి లేదా కాలేజీకి దుపట్టాతో సాదా కుర్తాను ధరించవచ్చును.

మీ దుపట్టాపైన ఆహార మరకేదైనా కనిపిస్తే, గాభరా పడిపోవద్దు. గుండె ఆగిపోనక్కరలేదు. కెచ్‌అప్‌, గ్రేవి మరియు చాక్లెట్‌ లాంటి సాధారణ మరకలను మీ దుపట్టా నుండి తేలికగా  తొలగించడానికి కొన్ని శుభ్రపరచే పద్ధతులను మేము వివరంగా తెలియజేస్తున్నాము

గమనిక – మరకలను తొలగించే ద్రావకాన్ని దేనినైనా ఉపయోగించే ముందు, దానిని దుపట్టా పైన  ఒక చిన్న, అంతగా గమనించబడని చోట  పరీక్షించాలి. ఇంకా, మీ పట్టు, నూలు మరియు చిఫాన్‌ దుపట్టాలపైన కూడా వీటిని ప్రయత్నించవచ్చును. కాని పట్టు విషయంలో, తేలికపాటి లాండ్రి డిటర్జెంట్‌ను ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి.

శుభ్రపరచే ప్రక్రియ ప్రారంభించే ముందుగా, మరకలు కనుక ఎండిపోతే, ఏదైనా ఆహారం లేదా ద్రవం దుస్తులకు అంటుకుంటే, పాత టూత్‌బ్రష్‌ లేదా చెంచా తీసుకుని రుద్దేయాలి. మరకలను తొలగించే ప్రక్రియను ఇది తేలికపరుస్తుంది.

1) నూలు దుపట్టా

ప్రకటన

Surf Excel Matic Liquid

ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో 2 పెద్ద చెంచాల  బేకింగ్ సోడాను కలిపి  బాగా కలియబెట్టాలి.  ఈ ద్రావణాన్ని మరకల మీద పోయాలి, 15 నిమిషాల పాటు ద్రావకం ఉండిపోనివ్వాలి.  తర్వాత ఆ మరకను చన్నీళ్లతో కడగాలి. అంతే మరక మాయమై మీ దుపట్టా కొత్తగా కనిపిస్తుంది.

2) పట్టు దుపట్టా

మీ పట్టు దుపట్టాపైన మరకని శుభ్రం చేయడం ప్రారంభించే ముందుగా మరకపై కొద్దిగా నీళ్ళను పోయాలి. ఇప్పుడు, నిమ్మ కాయని సగానికి కోసి దానిని మరకపై రుద్దాలి. తరువాత మీరు మామూలుగా చేసేలా ఉతకాలి. ఉతకడానికి తేలికపాటి లాండ్రి డిటర్జెంట్‌ను లేదా పట్టుకు ప్రత్యేకంగా రూపొందించబడిన డిటర్జెంటులను ఉపయోగించమని మా సలహా

3) నెట్ దుపట్టా

నెట్ లాంటి దుపట్టాను శుభ్రం చేయడానికి ముందుగా ఒక కప్పు చల్లటి  నీటిలో 1 చిన్నచెంచా  తేలికపాటి లాండ్రి డిటర్జెంట్ ను కలపాలి. ద్రావకాన్ని నెట్ దుపట్టా పై ఉన్న మరకలపై వేసి, మీ వేళ్ళతో  మెల్లగా గుండ్రంగా  రుద్దాలి. ఎక్కువ బలం ఉపయోగిస్తే అది చినిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ద్రావకం టీ మరియు పండ్ల రసం మరకలను కూడా శుభ్రం చేయగలదు

ఇప్పుడు అర్థం అయింది కదా. మీకు ఇష్టమైన దుపట్టాపైన ప్రమాదవశాత్తూ ఆహార మరకలు పడితే అది పాడవుతుందని మీరు దిగులు పడవలసిన పని లేదు

వ్యాసం మొదట ప్రచురించబడింది