మార్కెట్‌లో బోలెడన్ని రకాల వాషింగ్ మెషీన్‌లు లభిస్తున్నాయా? వాటిలోంచి మీకు తగిన, సరైన మెషీన్‌ను ఎంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలని ఉందా!

వాషింగ్ మెషీన్ అంటే మదుపు పెట్టడం లాంటిది, దీనిని జాగ్రత్తగా చేయాలి. వాషింగ్ మెషీన్ కొనుగోలు చేసే సమయంలో ధర మినహాయిస్తే, మిగిలిన అంశాలను తరచుగా ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు.

వ్యాసం నవీకరించబడింది

check out these tips and tricks to keep your taps and other bathroom fittings shining all the time
ప్రకటన
Surf Excel Matic Liquid

సరైన నిర్ణయం తీసుకునేందుకు అవసరమైన జాబితాను పరిశీలించండి.

మీరు రూ. 14,000 మరియు రూ. 21,000 మధ్య ధర ఉండే మెషీన్‌ను ఎంచుకోవచ్చు.

లోడ్ రకం

టాప్ లోడ్ మెషీన్‌లతో పోల్చితే, ఫ్రంట్‌ లోడ్ మెషీన్‌ల ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లు పెద్ద మొత్తంలో నీటిని ఆదా చేస్తాయి.

శక్తి వినియోగ సామర్థ్యం

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పని చేసే యంత్రాలను ఎంచుకోండి. ఆక్వా సేవర్, మోటార్ ఎఫిషియెన్సీ, ఎకో ఫ్రెండ్లీ వాష్, వంటివి. ఇలాంటి మెషీన్‌లు 35 శాతం తక్కువ నీటిని మరియు 20 శాతం తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి.

ప్రకటన
Surf Excel Matic Liquid

పరిమాణం

మరీ పెద్ద సైజు మెషీన్‌ను కొనుగోలు చేయకండి. 4గురు సభ్యులు గల ఒక కుటుంబానికి అవసరం అయిన రేంజ్ 6 కిలోలు మాత్రమే. ఆ స్థాయికి కట్టుబడి ఉండండి.

మిగిలిన అంశాలు

ఉష్ణోగ్రత నియంత్రణ, ఆటోమేటిక్ లోడింగ్, మరొకసారి జాడించే అవకాశం వంటి అదనపు సౌకర్యాలను పరిశీలించండి.

మీరు వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయాలని భావించినప్పుడు, ఈ జాబితా మీకు పక్కా గైడ్‌గా ఉపయోగపడుతుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది