
ఈ కింది జాబితాలో ఇచ్చిన మాదిరిగా చేస్తే, మీ బడ్జెట్‌కు తగినట్లుగా, అలాగే మీ ఉతికే అవసరాలకు అనుగుణంగా, అంతకు మించి మీ కుటుంబం మెచ్చే పరిమళాలను వెదజల్లే విధంగా బట్టలను శుభ్రం చే సే డిటర్జెంట్‌ను ఎంచుకోవచ్చు.
గ్రీజు కారణంగా ఏర్పడే మరకలను పోగొట్టడానికి ద్రవ రూపంలో ఉన్న (లిక్విడ్) డిటర్జెంట్‌లు రంగులపై సున్నితంగా పని చేస్తాయి.
1) ఉతకడం
కొన్ని లాండ్రీ డిటర్జెంట్‌లు ఇతర వాటితో పోల్చితే, ప్రభావవంతంగా పని చేస్తాయి. సులభంగా చెప్పాలంటే, మీరు చెల్లించే మొత్తానికి తగినట్లుగా పొందుతారన్న మాట. చవకగా లభించే డిటర్జెంట్‌లు మీ దుస్తులను బాగానే శుభ్రం చేయవచ్చు, అయితే, ధరను పోల్చి చూడడం కంటే ఎక్కువగా, ఒకసారి ఉతికేందుకు అయ్యే డిటర్జెంట్ పరిమాణాన్ని మీరు పరిగణించాలి.
2) ప్రభావవంతమైన డిటర్జెంట్
కొన్ని మెషీన్‌లు నీటిని తక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాయి; అధిక ప్రభావిత డిటర్జెంట్‌లను ఈ తరహా యంత్రాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేకంగా రూపకల్పన చేస్తారు. ఈ డిటర్జెంట్లు లోడ్‌ను ప్రభావవంతంగా జాడించగలుగుతాయి.

3) పరిమళం
ఖచ్చితంగా, ఒక తరహా డిటర్జెంట్‌ను కొనుగోలు చేయడానికి పరిశీలించే అంశాలలో, దాని న ుంచి వచ్చే పరిమళం కూడా అతి ముఖ్యమైనదే. అలాగే, మీకు గానీ లేదా మీ కుటుంబంలో ఎవరికైనా గానీ కొన్ని రకాల వాసనలు పడకపోతే, అప్పుడు ఎలాంటి వాసన లేని డిటర్జెంట్‌ను ఎంచుకోవడం మీకు తగిన పని.
4) అలర్జీ
సుకుమారమైన చర్మం గల వారు లేదా అలర్జీలతో బాధ పడేవారు, రంగు రహిత పదార్ధాలతో తయారయ్యే డిటర్జెంట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.
డిటర్జెంట్‌ను ఎంచుకునే సమయంలో ఈ అన్ని అంశాలను తప్పకుండా పరిశీలించండి.