మీ చేతి తువ్వాళ్ళను శుభ్రంగా మరియు తాజా సువాసనతో ఉండేలా ఎలా చేయాలి

రోజంతా మీ చేతి తువ్వాళ్ళను సువాసనతో ఉండేలా చేసే కొన్ని చిట్కాల కోసం మీరు ఎదురుచూస్తున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే!

వ్యాసం నవీకరించబడింది

How to Get Your Hand Towels Clean and Smelling Fresh
ప్రకటన
Surf Excel Matic Liquid

మీరు చేతులు కడుక్కున్న తరువాత చేతి తువ్వాలుతో తుడుచుకుంటారు, కాబట్టి వాటిని సురక్షితంగా మరియు తాజా సువాసనతో ఉంచడం ముఖ్యం. మీ చేతి తువ్వాళ్ళను సువాసనతో ఉంచేందుకు మీరు ఉపయోగించగల కొన్ని చిట్కాలు మరియు ఉపాయాలు మా వద్ద ఉన్నాయి.

మీ చేతి తువ్వాళ్ళను అన్నిటినీ ఉతకడానికి ఇదే పద్ధతి మరియు పరిమళం ఉపయోగించండి, దీనివల్ల మీ సిగ్నేచర్‌ పెర్‌ఫ్యూమ్‌ మీ ఇంట్లోని ప్రతి బాత్‌రూమ్‌లోకి చొచ్చుకుపోతుంది.

ఉతకడానికి ముందు

మీ చేతి తువ్వాళ్ళను ఉతికేటప్పుడు, మీ వాషింగ్‌ మెషీన్‌ రిన్స్‌ సైకిల్‌లో ఉండగా మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ 1 కప్పు కలపండి. మీరు వాటిని చేతులతో ఉతుకుతుంటే, ఒక బక్కెట్‌ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 1 చిన్న చెంచా  ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపండి. తువ్వాళ్ళను 10-15 నిమిషాల సేపు నానబెట్టి, ఉతికిన తరువాత ఎక్కువగా ఉన్న నీటిని పిండేసి గాలికి ఆరబెట్టండి. మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ దేనినైనా మీరు ఉపయోగించవచ్చు, అంటే లావెండర్‌, పెప్పర్‌మింట్‌, ఒరిజెనో, లేదా నిమ్మ. మీరు ఉతికిన తువ్వాళ్ళకు సువాసన చేర్చేందుకు ఇవి కొన్ని మంచి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌.

ఉతికేటప్పుడు

ప్రకటన

Surf Excel Matic Liquid

మీ చేతి తువ్వాళ్ళను సువాసన వచ్చేలా చేసేందుకు ఫ్యాబ్రిక్‌ సాఫ్టనర్‌ని ఉపయోగించండి. మీరు వాటిని మెషీన్‌లో ఉతుకుతుంటే, రిన్స్‌ సైకిల్‌కి 1 పెద్ద చెంచా  ఫ్యాబ్రిక్‌  సాఫ్టనర్‌ని కలపండి. తరువాత మామూలుగా ఉతకండి. మీరు వాటిని చేతులతో ఉతుకుతుంటే, ఉతికిన తరువాత, ఒక బక్కెట్‌ నీటికి ½ టేబుల్‌స్పూన్‌ పెద్ద చెంచా  ఫ్యాబ్రిక్‌ సాఫ్టనర్‌ని కలపండి మరియు మీ చేతి తువ్వాళ్ళని వాటిల్లో 15 నిమిషాల సేపు నానబెట్టండి. ఎక్కువగా ఉన్న నీటిని పిండేసి గాలికి ఆరబెట్టండి.

ఉతికిన తరువాత

మీ చేతి తువ్వాళ్ళను పూల మాదిరిగా సువాసనతో ఉండాలంటే వినిగర్‌  మరియు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ సమ్మేళనం బాగా పనిచేస్తుంది. ఒక బక్కెట్‌ గోరువెచ్చని నీటిలో 1/2 కప్పు వినిగర్‌  మరియు 6-7 చుక్కల మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలిపి క్లీనింగ్‌ సొల్యూషన్‌ తయారుచేయండి. మీరు మామూలుగా చేసే విధంగా ఉతకడానికి ముందు ఈ ద్రావణాన్ని 30 నిమిషాల సేపు మీ చేతి తువ్వాళ్ళను నానబెట్టండి.

ఈ చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. మీరూ వాటిని ప్రయత్నించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది