
మీ కాన్వాస్ ష్యూస్‌ని చూడటానికి కొత్త వాటిల్లా ఉంచాలనుకుంటున్నారా? చింతించకండి. ఇది కష్టం కాదు.
మీరు మీ స్పోర్ట్స్ ష్యూస్ చూడటానికి కొత్త వాటిల్లా ఉంచాలనుకున్నా లే దా వాటిని బాగా శుభ్రంచేయాలనుకున్నా, ఈ సులభ మరియు ప్రభావవంతమైన వాషింగ్ పద్ధతి అద్భుతాలు సృష్టిస్తుంది!
మీ స్పోర్ట్స్ ష్యూస్‌ని ప్రభావవంతంగా ఉతికేందుకు ఈ సరళ చర్యలు పాటించండి.
స్టెప్ 1:
లేస్‌లను విప్పేసి సోల్స్ మరియు మీ స్పోర్ట్స్ ష్యూస్ నుంచి లూజు మురికిని బాగా బ్రష్ చేయండి. మీరు ఈ పని మీ చేతులతో లేదా బ్రష్ ఉపయోగించి (పాత, గట్టి పెయింట్‌బ్రష్ లేదా పాత టూత్‌బ్రష్ రెండూ బాగా పనిచేస్తాయి) చేయవచ్చు.

స్టెప్ 2:
1 చిన్న చెంచా లాండ్రీ డిటర్జెంట్ ద్రావణం మరియు 1 కప్పు నీళ్ళు మిశ్రమం చేయండి. ఇదే బ్రష్‌నిఈ ద్రావణంలో ముంచండి మరియు ద్రావణాన్ని సౌమ్యంగా బ్రష్ చేయడం ద్వారా ఫ్యాబ్రిక్, మెష్ మరియు రబ్బరు ఏరియాలను శుభ్రం చేయండి. అనంతరం పరిశుభ్రమైన తడి వస్త్రం లేదా స్పాంజి తీసుకోండి మరియు ఏదైనా నురుగు ఉంటే తుడవండి.
స్టెప్ 3:
స్పోర్ట్స్‌మెష్ బ్యాగ్ తీసుకొని మీ స్పోర్ట్స్ ష్యూస్‌ని దీనిలో పెట్టండి. మెష్ బ్యాగ్‌ని మీ వాషింగ్ మెషీన్‌లో పడేయండి. ఎప్పటి లాగానే లాండ్రీ డిటర్జెంట్‌ని కలపండి మరియు చల్లని సెట్టింగ్‌పై సైకిల్‌ని రన్ చేయండి.
స్టెప్ 4:
వాటిని కడిగిన తరువాత, మీ స్పోర్ట్స్ ష్యూస్‌ని బాగా గాలి వెలుతురు వచ్చే ప్రాంతంలో ఆరబెట్టండి. వాటిని శుభ్రం చేసేందుకు మరియు శ్రమలేకుండా మెరిసేలా చేసేందుకు పై చర్యలు పాటించండి!
కీలక స్టెప్
మీ స్పోర్ట్స్ ష్యూస్‌ని ఉతికిన తరువాత, త్వరలోనే మీరు వాటిని ధరించాలనుకోకపోతే, పాత దినపత్రికను వాటిల్లో పెట్టండి. వాటి అసలు ఆకారాన్ని నిలబెట్టుకోవడానికి ఇది సహాయపడుతుంది.