కిచెన్‌ని శుభ్రం చేసేందుకు అత్యుత్తమ గైడ్

మీ కిచెన్‌లో నిరంతరం వేడి, జిడ్డు మరియు ఆహారం చిందడం జరుగుతుంటాయి, కాబట్టి ఇది గందరగోళంగా మారవచ్చు. పరిశుభ్రతను పాటించడానికి బాగా శుభ్రం చేయవలసి ఉంటుంది. మీ కిచెన్‌ని శుభ్రం చేసేందుకు మరియు దానిని తాజాగా ఉంచేందుకు సులభ గైడ్‌ని ఇక్కడ ఇస్తున్నాము!

వ్యాసం నవీకరించబడింది

The Ultimate Guide for a Squeaky-Clean Kitchen
ప్రకటన
Vim Dishwash Gel

మీ కిచెన్‌ని బాగా శుభ్రం చేయడం మొదటగా అలసటతోకూడిన పనిగా అనిపిస్తుంది. రిలాక్స్‌ అవ్వండి! మేము ఈ పనిని చేయదగిన కొద్ది చర్యల్లోకి విభజించాము, దీనివల్ల మీరు సాధ్యమైనంత సులభంగా చేయవచ్చు. మంచి ప్లేలిస్టు ఈ పనిని సరదాగా కూడా చేయవచ్చు మరియు ఈ ప్రక్రియను మామూలు పనిచేస్తున్నట్లుగా చేస్తుంది.

1) దుమ్ము తొలగించండి

శుభ్రంచేసే బ్రష్‌ తీసుకొని ఏదైనా లూజు దుమ్ము తొలగించేందుకు కిచెన్‌ ఉపరితలాలు మరియు అరలు అన్నిటినీ బ్రష్‌ చేయండి.

2) మురికి మరియు జిడ్డు మచ్చలు

ఉపరితలాలపై కిచెన్‌ క్లీనర్‌ని పిచికారి చేయండి. మీరు మురికి మరియు జిడ్డు మచ్చలన్నిటినీ పైన తప్పకుండా పిచికారీ  చేయండి. తరువాత, మైక్రోఫైబర్‌ వస్త్రం తీసుకొని ఆ ప్రాంతాన్ని తుడిచి శుభ్రం చేయండి. కిచెన్‌ క్లీనర్‌ లేబుల్‌పై ఇవ్వబడిన సూచనలను ఎల్లప్పుడూ పాటించాలని గుర్తుంచుకోండి.

ప్రకటన

Vim Dishwash Gel

3) ఉపరితలాలను శుభ్రం చేయండి

2-4 చుక్కల డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో వేయండి. అనంతరం పరిశుభ్రమైన వస్త్రం తీసుకొని, దీనిని ఈ ద్రావకంలో ముంచండి, అమితంగా ఉన్న నీటిని పిండేసి కిచెన్‌ ఉపరితలాలు మరియు అరలను తుడవండి. పై నుంచి కిందకు క్రమేపీ పనిచేయడం డ్రిప్‌ మరకలను నిరోధించడానికి సహాయపడుతుంది.

4) మూలలపై ప్రత్యేక శ్రద్ధ

మీ కిచెన్‌ ఉపరితలాల మూలలకు చేరుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది మరియు తరచుగా విస్మరిస్తుంటాము. మీ గోడల మూలలను కూడా విస్మరిస్తుంటారు. కాబట్టి, ఈ ప్రాంతాలపై కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. చేరుకోవడం కష్టంగా ఉన్న మూలలకు చేరుకోవడం మరియు ఆ మూలల్లో ఇరుక్కుపోయిన మురికి మొత్తాన్ని పాత టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయండి.

5) కొత్త సరఫరాలకు స్థలం ఇవ్వండి

కొత్త వస్తువులను పెట్టేందుకు వీలుగా వాడని మరియు గడువు ముగిసిన వస్తువులను అరలు మరియు ఫ్రిడ్జ్‌ నుంచి తీయండి. ఈ స్టోరేజ్‌ ఏరియాలను తుడవాలని గుర్తుంచుకోండి, దీనివల్ల మీ కొత్త ఉత్పాదనలు పెట్టే చోటు మురికి రహితంగా ఉంటుంది.

6) దీనిని పొడిగా ఉంచండి

తడి వస్త్రంతో తుడిచిన తరువాత మీ కిచెన్‌ ఉపరితలాలను పొడిగా ఉంచేందుకు పరిశుభ్రమైన వస్త్రం ఉపయోగించండి. నీటి మరకలను పోగొట్టేందుకు చేయవలసిన పని ఇదే. సింకు చుట్టూ మరియు క్రోమ్‌ ఉపకరణాలపై ఉన్న నీటి చిందులను ఆరబెట్టేందుకు పరిశుభ్రమైన వస్త్రంతో తుడవండి, దీనివల్ల ఇవి ప్రకాశంగా ఉంటాయి.

7) ఫ్లోర్‌ని ఊడ్చండి

మీ కిచెన్‌ ఏరియాను బాగా శుభ్రంచేసిన తరువాత, ఫ్లోర్‌ని ఊడవడం మరచిపోకండి. మీ కిచెన్‌ స్థలానికి అవసరమైన తుది మెరుగులు ఇది ఇస్తుంది, మరియు దీనిని మరింత మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.

మీ కిచెన్‌ శుచి మరియు శుభ్రంగా ఉన్నప్పుడు వంటచేయడం ఆనందంగా ఉంటుంది. ఈ ఉపయోగకరమైన సూచనలు మీ కిచెన్‌ని నిత్యం శుభ్రం చేయడం మీ దినచర్యలో అగ్రస్థానంలో ఉంటుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది