
దశ 1: చల్లబరచడానికి అనుమతించండి
వంట చేసిన తర్వాత, చల్లబరచడానికి వాటిని కాసేపు పక్కన ఉంచండి.
దశ 2: శుభ్రపరచే ద్రావకం చేయండి
ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. ఆ నీళ్లలో డిష్ వాషింగ్ ద్రవాన్ని కలిపి వంట పాత్రలను ఆ బకెట్ లోపల వేయాలి.
దశ 3: నాని పోవడానికి అనుమతించండి
దీన్ని 10-15 నిమిషాల వరకు అలాగే నాని పోయే విధంగా ఉండాలి.

దశ 4: రుద్దాలి
వంటపాత్రలను నీళ్లలో నుంచి బయటికి తీసి స్క్రబ్బింగ్ ప్యాడ్‌తో రుద్దాలి.
దశ 5: కడగాలి
పంపు నీటి కింద వాటిని బాగా కడగాలి.
దశ 6: వెనిగర్ వాడండి
ఒక నూలు బట్ట తీసుకొని దాని పై కొంచెం తెల్లని వెనిగర్ పోయాలి. ఆ బట్టతో వంటపాత్రలను బాగా రుద్దండి.
దశ 7: 5 నిమిషాలు వేచి ఉండండి
ఇది 5 నిమిషాలు ఉండనివ్వండి.
దశ 8: కడగాలి
పంపు నీటి కిందా వాటిని మళ్లీ కడగాలి.
దశ 9: తుడవడం
పొడి నూలు వస్త్రంతో వాటిని తుడవండి.
మీ వంటపాత్రలు ఇప్పుడు కొత్తవాటి వలే ఉంటాయి!