బూజు మీ కిచెన్పై దండయాత్ర చేస్తోందా? ఇప్పుడే దీనిని తొలగించండి!

మీ సింకు చుట్టూ బూజు ఏర్పడుతోందనే మీరు గమనించిన ఈ సారి, దానిని నిపుణుడి మాదిరిగా శుభ్రం చేసేందుకు ఈ సూచనలు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Mould Invading Your Kitchen? Evict It Now!
ప్రకటన
Vim Dishwash Gel

మీ ఇంట్లో తడిగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా బూజు మరియు ఫంగస్‌ ఏర్పడతాయి. మీ ఇంట్లో ఉండిపోయిన అధిక తేమ వీటికి పోషణ స్థలంగా మారుతుంది.

కాబట్టి కిచెన్‌లో, ప్రత్యేకించి గోడలు మరియు సింకు మూలల్లో శుచి మరియు శుభ్రత పాటించడం ముఖ్యం.

ఇది కనిపించినట్లుగా సమయం తీసుకోదు. మీ కిచెన్‌ని బూజు లేకుండా ఉంచేందుకు రెండు సరళ టెక్నిక్‌లను అర్థంచేసుకుందాం.

మీ ఆహారం కలుషితం కాకుండా ఉండేందుకు తప్పకుండా బ్లీచ్‌ని క్షుణ్ణంగా శుభ్రం చేయండి.

1) ఫంగస్‌పై దాడిచేసేందుకు వినిగర్‌ని ఉపయోగించండి

ప్రకటన

Vim Dishwash Gel

4 కప్పుల వినిగర్‌, ¼ కప్పు ఉప్పు మరియు 2 చిన్న చెంచాల లిక్విడ్‌ డిష్‌ సబ్బును ఒక డబ్బాలో మిశ్రమం చేయండి. ఈ మిశ్రమాన్ని స్ప్రేయర్‌లో పోసి బూజు మరియు ఫంగస్‌పై వినియోగించండి. మరకలు పడిన ఉపరితలం మొత్తానికి మీరు తప్పకుండా ఆచ్ఛాదన కల్పించండి మరియు 10-15 నిమిషాల సేపు దానిని ఉండనివ్వండి. ఆ ప్రాంతాన్ని బాగా రుద్దండి మరియు పొడి వస్త్రంతో దానిని తుడవండి. ఈ ప్రాంతం చుట్టూ మీకు ఇప్పటికీ కొద్దిగా ఫంగస్‌ కనిపించవచ్చు. చింతించకండి! ప్రభావిత ప్రాంతంపై మళ్ళీ సులభంగా ద్రావకాన్ని పిచికారి చేయండి, 15 నిమిషాల సేపు ఆగి దానిని తుడిచి శుభ్రం చేయండి.

2) బూజును తొలగించేందుకు బ్లీచ్‌ని ఉపయోగించండి

¼ కప్పు బ్లీచ్‌ మరియు 2 కప్పుల గోరువెచ్చని నీటిని ఒక బౌల్‌లో మిశ్రమం చేయండి. ఈ మిశ్రమాన్ని ఖాళీ పిచికారి సీసాలో పోసి ప్రభావిత ప్రాంతాలపై దాన్ని పిచికారి చేయండి. దీనిని బాగా రుద్దండి మరియు తుడిచి శుభ్రం చేయండి. మీకు తక్షణం ఫలితాలు కనిపించకపోతే, ద్రావకాన్ని మళ్ళీ పిచికారి చేసి రుద్దడానికి ముందు 15 నిమిషాల సేపు దానిని ఉంచండి. దానిని తుడిచి శుభ్రం చేయండి మరియు చాలామటుకు బూజు పోవడాన్ని మీరు గమనిస్తారు.

వెంటనే మీ ఇంట్లో బూజు లేకుండా ఉండేందుకు ఈ సూచనలు పాటించడానికి ప్రయత్నించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది