
మీ వంటగదిని శుభ్రపరిచేటప్పుడు కిచెన్ క్యాబినెట్ హ్యాండిల్స్ పూర్తిగా శుభ్రం చేయబడవు. ధూళి, నూనె మరియు ఆవిరి తరచుగా మీ క్యాబినెట్ హ్యాండిల్స్ పై పేరుకుపోతాయి. తద్వారా అవి జిడ్డుగా కనిపిస్తాయి.
సులభమైన పద్దతితో పేరుకుపోయిన దుమ్ము, జిడ్డును శుభ్రపరచి వాటిని తిరిగి ప్ర కాశవంతంగా చేసే మార్గం ఇక్కడ ఉంది.
మీ క్యాబినెట్ హ్యాండిల్స్ ను స్థాయి వారిగా, నిలువుగా లేదా అడ్డంగా శుభ్రం చేసుకోవచ్చు.
స్టెప్ 1: దుమ్ము
మీ క్యాబినెట్ హ్యాండిల్స్ ను వస్త్రాన్ని ఉపయోగించి దుమ్మును దులుపు కోవాలి. ఇది చాలా వదులుగా ఉన్న ధూళిని తొలగిస్తుంది మరియు శుభ్రపరిచే ప్రక్రియను సులభతరం చేస్తుంది.

స్టెప్ 2: సిద్ధం చేసుకోవాలి
ముడవ (3వ) దశకు వెళ్ళే ముందు, నీటి బిందువులను పట్టుకోవడానికి ఒక టవల్ నేలపై ఉంచండి.
స్టెప్ 3 హ్యాండిల్స్ ను శుభ్రపరచు
ఓ తడిబట్టను తీసుకొని హ్యాండిల్స్ ను శుభ్రపరచడం మొదలు పెట్టాలి.
స్టెప్ 4: శుభ్రపరచే ద్రావకం తయారీ
ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకోని, 2 చిన్న చెంచాల డిష్ వాషింగ్ జెల్, 1 చిన్న చెంచా నిమ్మరసం తీసుకోని బాగా కలపాలి.
స్టెప్ 5: హ్యాండిల్స్ శుభ్రపరచు
స్క్రబ్బింగ్ ప్యాడ్ తీసుకొని, ఈ ద్రావణంలో తడిపి, హ్యాండిల్స్‌ను పూర్తిగా శుభ్రం చేయండి. ఒక నిమిషం పాటు పూర్తిగా రుద్దాలి. నిమ్మరసంలోని లక్షణాలు కష్టతరమైన చమురు నిక్షేపాలను సైతం తొలగిస్తాయి. స్క్రబ్బింగ్ ప్యాడ్ నుండి మురికి నీటిని పిండి వేసి శుభ్రపరిచే ద్రావణంలో మరోసారి ముంచండి.
స్టెప్ 6: శుభ్రంగా రుద్దాలి
చేరుకోలేని మూలలను శుభ్రం చేయడానికి పాత టూత్ బ్రష్ ను ఉపయోగించండి.
స్టెప్ 7: తుడుచుకోవాలి
రుద్దిన తరువాత, నీటిలో తడిపిన శుభ్రమైన స్పాంజిని తీసుకొని శుభ్రంగా తుడవండి. సబ్బు అవశేషాలు హ్యాండిల్స్ నుంచి పూర్తిగా తొలగించబడ్డాయని నిర్ధారించుకోండి. అవసరమైతే ఈ విధానాన్ని మరోసారి కొనసాగించండి.
మీ కిచెన్ క్యాబినెట్ చాలా శుభ్రంగా నిర్వహించడానికి ఈ సులభమైన పద్ధతిని ప్రయత్నించండి. మీ శుభ్రమైన మెరిసే క్యాబినెట్ హ్యాండిల్స్ మీ వంటగది అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి.