మీ కిచెన్‌ డ్రాయర్‌ని తాజా సువాసనతో ఉంచేందుకు చిట్కాలు

మీరు సులభంగా మీ కిచెన్‌ డ్రాయర్స్ని అద్భుతమైన సువాసను జోడించవచ్చు. మీరు దీనిని సులభంగా చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో మేము మీకు చెబుతాము.

వ్యాసం నవీకరించబడింది

Tips to Keep Your Kitchen Drawer Smelling Fresh
ప్రకటన
Vim Dishwash Gel

మీ కిచెన్‌ అద్భుతమైన సువాసనతో ఉండటం అంటే మీకు ఇష్టమనే విషయం మాకు తెలుసు! కానీ, గది సువాసన వచ్చేలా ఎలా చేయాలనే విషయం తెలుసుకోవడంతో పాటు, డ్రాయర్స్ లాంటి మూసివుండే స్థలాలకు తాజా సెంట్‌ కూడా మీరు కలపవచ్చు. ఈ చర్యలు పాటించండి మరియు ఏడాది పొడవునా మీ కిచెన్‌లోని డ్రాయర్స్ని మీరు సువాసనతో ఉంచవచ్చు.

స్టెప్‌ 1: డ్రాయిర్స్ను ఖాళీ చేయండి

చేయవలసిన మొదటి పని ఏమిటంటేమీ కిచెన్‌ డ్రాయర్స్ నుంచి ప్రతి ఒక్కటీ తీసేయాలి. మీకు అవసరం లేని వస్తువులను పారేయాలి.

స్టెప్‌ 2: డ్రాయిర్స్ దుమ్ము దులపాలి

పరిశుభ్రమైన, పొడి వస్త్రం తీసుకొని డ్రాయర్స్ని దుమ్ము దులపండి, ఏదైనా లూజు మురికి లేదా ఆహార రేణువులను వాటి నుంచి తొలగించాలి. మీ వద్ద వ్యాక్యూమ్‌ క్లీనర్‌ ఉంటే, మీరు దానిని కూడా ఉపయోగించవచ్చు.

ప్రకటన

Vim Dishwash Gel

స్టెప్‌ 3: క్లీనింగ్‌ సొల్యూషన్‌ తయారుచేయండి

1 కప్పు గోరువెచ్చని నీటిని బౌల్‌లో పోసి దానికి  1/2  చిన్న చెంచా లిక్విడ్‌ వాషర్‌ కలపండి. రెండిటినీ బాగా మిశ్రమం చేయండి. 

స్టెప్‌ 4: ఉపరితలాలను తుడవండి

పరిశుభ్రమైన వస్త్రం తీసుకొని స్టెప్‌ 3లో తయారుచేసిన ద్రావణంలో ముంచండి, ఎక్కువగా ఉన్న నీటిని పిండేసి డ్రాయర్స్లోని ఉపరితలాలన్నిటినీ శుభ్రంచేయండి.

స్టెప్ 5: మూలలను శుభ్రంచేయండి

పాత టూత్‌బ్రష్‌ తీసుకొని ఇదే సబ్బు ద్రావణంలో ముంచి  మూలల్లో మరియు వస్త్రంతో శుభ్రం చేయడం కష్టంగా గల వెనుక ప్రాంతాలను రుద్దండి.

స్టెప్‌ 6: సువాసన మిశ్రమం తయారుచేయండి

ఒక బౌల్‌ తీసుకొని, 1 కప్పు గోరువెచ్చని నీటితో పాటు మీకు ఇష్టమైన 1 చిన్న చెంచా ఎసెన్షియల్‌ ఆయిల్‌ని దానికి కలపండి. పరిశుభ్రమైన వస్త్రం తీసుకొని దానిని ఈ ద్రావణంలో ముంచి మీ డ్రావర్‌ మొత్తాన్ని తుడవండి. ఇది మీ డ్రావర్‌ని తాజా సువాసనతో ఉంచుతుంది.

స్టెప్‌ 7: పొడి వస్త్రంతో తుడవండి

పొడి వస్త్రం తీసుకొని నీటి గుర్తులు  లేవని నిర్థారించేందుకు మీ డ్రాయర్‌లను తుడవండి.

స్టెప్‌ 8: ప్రతిదీ తిరిగి పెట్టండి

చివరగా,మీరు తీసిన ప్రతి ఒక్కదానినీ తిరిగి మీ డ్రాయర్ లో పెట్టండి.

ఈ సరళమైన చర్యలను పాటించారంటే మీ కిచెన్ డ్రాయర్‌లు మీరు కోరుకున్న విధంగా పరిశుభ్రంగా మరియు సువాసనతో ఉంటాయి. సువాసన 3-4 వారాలు ఉంటుంది, కాబట్టి మీకు నెలకు కనీసం ఒక సారి ఈ ప్రక్రియను తిరిగి చేయవలసిందిగా మేము సిఫారసు చేస్తున్నాము.

వ్యాసం మొదట ప్రచురించబడింది