మీరు కిచెన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? దీనిని శుభ్రంగా ఎలా ఉంచాలో ఇక్కడ సూచిస్తున్నాము

ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటం అంటే మీ కిచెన్‌ని తరచుగా ఉపయోగించడం మరియు మామూలుగా కంటే ఎక్కువగా భోజనం తయారుచేయడమని అర్థం. మీ కిచెన్‌ మరింత తరచుగా మురికిగా మారుతుందని కూడా అర్థం.మీ కిచెన్‌ని శుభ్రం చేయడంలో అగ్రగామిగా ఉండేందుకు మేము మీకు సులభ సూచనలు ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

Are You Spending More Time in the Kitchen? Here’s How to Keep it Clean
ప్రకటన
Vim Dishwash Gel

కిచెన్‌ని శుభ్రం చేయడానికి అంతం ఉండదు, ప్రత్యేకించి మీరు మరియు మీ కుటుంబం ఎక్కువ సమయం ఇంటి నుండి పనిచేస్తుంటే లేదా చదువుతుంటే. ఈ సమయంలో ఆహారం ఎక్కువగా వండుతారు. మీ కిచెన్‌ని తరచుగా ఉపయోగించడం దానిని చిందరవందరగా చేయవచ్చును, కానీ దానిని శుచిగా మరియు శుభ్రంగా ఉంచడం ముఖ్యం.

ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలను క్రమంతప్పకుండా శుభ్రం మరియు క్రిమిసంహారం చేయాలని ప్రముఖ అంతర్జాతీయ మరియు జాతీయ ఆరోగ్య సంస్థలు సలహా ఇచ్చాయి. ఈ వ్యాసంలో, మీ కిచెన్‌ని ఎలా శుభ్రంగా ఉంచాలో మరియు శానిటైజ్‌ చేయాలో మేము మీకు చెబుతాము.

మిగిలిపోయినవి వదిలించుకొనుట

మీ కిచెన్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని మూతపెట్టకుండా లేదా బహిరంగ ప్రదేశంలో పడేయకుండా చూడాలి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి మరియు గడువు ముగిసిన తినుబండారాలన్నిటినీ పారేయాలి.

పచారీ సరుకులను శుభ్రం చేయాలి

ప్రకటన

Vim Dishwash Gel

మీరు తాజా కిరాణా సరుకులను కొనుగోలు చేస్తే, తప్పకుండా మీరు వాటిని పక్కన పెట్టండి. ప్లాస్టిక్‌ ప్యాక్‌లు లాంటి గట్టి, రంధ్రాలు లేని సరకులను నిల్వ చేయడానికి ముందు క్రిమిసంహారక వైప్స్‌తో క్రిమిసంహారం చేయండి. కొళాయి నీటి కింద పండ్లు మరియు కూరగాయలు బాగా కడగండి. ఫుడ్‌ ప్యాకేజింగ్‌ని సంభాళించిన తరువాత, ప్యాకేజింగ్‌ నుంచి ఆహారపదార్థాలు తీసిన తరువాత, తినడానికి మీరు ఆహారపదార్థాలు తయారుచేయడానికి ముందు మరియు భుజించే ముందుగా ఎల్లప్పుడూ మీ చేతులు కడుక్కోండి. మీరు సబ్బు లేదా లైఫ్‌బాయ్‌ లాంటి వాటి నుంచి లభించే ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ని ఉపయోగించవచ్చు.

వంటపాత్రలు కడగండి

వండిన తరువాత, మీరు ఆహార పదార్థాలు తయారుచేయడానికి ఉపయోగించే వంటపాత్రలు కడగండి. వాటిని శుభ్రంచేసేందుకు, మీరు నీళ్ళు మరియు డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ని ఉపయోగించవచ్చు. వీటిల్లో ఒకటి మార్కెట్‌లో సులభంగా లభించే విమ్‌ లిక్విడ్‌. స్కౌరింగ్‌ ప్యాడ్‌ని ఉపయోగించి, వంటపాత్రలను బాగా రుద్దండి మరియు నీటితో కడగండి. ఏవైనా కఠినమైన మరకలను పోగొట్టేందుకు, వంట పాత్రలను గోరువెచ్చని నీటి టబ్‌లో వేసి 30 నిమిషాల సేపు వేచివుండండి. అనంతరం క్లీనింగ్‌ ప్రక్రియను తిరిగిచేయండి.

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అల్యూమినియం, నాన్‌- స్టిక్‌ తదితర లాంటి విభిన్న రకాల వంట పాత్రలను లోతుగా శుభ్రంచేయడంపై సూచనల కోసం మా వ్యాసం చదవండి.

గ్యాస్‌ స్టౌవ్‌ని శుభ్రం చేయండి

మీ గ్యాస్‌ స్టౌవ్‌పై మరకలను శుభ్రం చేసేందుకు, స్పాంజి లేదా పరిశుభ్రమైన వస్త్రాన్ని నీటిలో ముంచి మీ గ్యాస్‌ స్టౌవ్‌పై మరకలు పడిన ప్రాంతాన్ని తుడవండి. అనంతరం స్టౌవ్‌ ఉపరితలంపై 2-3 చుక్కల డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ పోసి స్పాంజితో రుద్దడం ప్రారంభించండి. సబ్బు అవశేషాన్ని సాదా నీటితో కడిగేయండి.

వంట స్టౌవ్‌ని క్షుణ్ణంగా శుభ్రం చేయడంపై మరిన్ని సూచనలు ఈ వ్యాసంలో ఇవ్వబడ్డాయి.

కౌంటర్‌టాప్స్‌, క్యాబినెట్‌ హ్యాండిల్స్‌, ఫ్లోర్‌ని శుభ్రం చేయండి

ప్రతి భోజనం వండిన తరువాత, మీ కిచెన్‌ కౌంటర్‌టాప్స్‌ని శుభ్రంచేయడం ముఖ్యం. మీరు శుభ్రం చేయడం ప్రారంభించే ముందు మసాలా జార్స్‌, కట్లరీ మరియు ఇతర వస్తువులను వాటిని నిర్ణీత స్థలాల్లో తిరిగి పెట్టండి.

కౌంటర్‌టాప్‌నే కాకుండా, మీరు మీ కిచెన్‌ అరలు, రిఫ్రిజిరేటర్‌ డోర్‌, హ్యాండిల్స్‌, నాబ్‌లు తదితర వాటిని కూడా మీరు తప్పకుండా శుభ్రం మరియు క్రిమిసంహారం చేయాలి. ఇవి ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలు, అంటే కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది తరచుగా తాకుతుంటారని అర్థం. ఇంకా మీ కిచెన్‌ ఫ్లోర్‌ని బాగా ఊడవండి మరియు తుడవండి మరియు మీ చెత్తను ప్రతి రోజూ పారేయండి.

ఎక్కువగా తాకుతుండే ఈ ఉపరితలాలను ఇంట్లో రెగ్యులర్గా వాడే డిటర్జెంట్ మరియు నీటితో శుభ్రంచేసిన తరువాత, మెరుగైన పరిశుభ్రత కోసం వాటిని క్రిమిసంహారం చేయండి. క్రిమిసంహారం చేయడానికి, మీరు డోమెక్స్ మల్టీ పర్పస్ డిజ్ఇన్ఫెక్టంట్ స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇంట్లోని వస్తువులను క్రిమిసంహారం చేసేందుకు ప్రముఖ ఆరోగ్య సంస్థలు సిఫారసు చేసినట్లుగా దీనిలో సోడియం హైడ్రోక్లోరైట్ ఉంది. గదుల్లో ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలపై క్రిములను ఇది సురక్షితంగా చంపుతుంది మరియు ఆహ్లాదకరమైన సువాసన ఇస్తుంది. మొదటగా అనుకూలతను పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కొద్దిపాటి గుప్త ప్రదేశంపై పరీక్షించండి మరియు కడగండి. ప్యాక్పై ఇవ్వబడిన సూచనల ప్రకారం ఉపయోగించవలసిందిగా సిఫారసు చేయడమైనది.

మీ కిచెన్‌లో పై భాగాన్ని శుభ్రంచేయేడం మొదట్లో అలసటగా అనిపించవచ్చు, అయితే క్రమపద్ధతితోకూడిన దినచర్య మీరు పనులను చేయదగిన చిన్న పనులుగా విభజించడం మీకు సహాయపడుతుంది. నేడే ఈ సూచనలను పాటించండి!

కిచెన్‌ని పరిశుభ్రంగా ఉంచడానికి కూడా ఈ గైడ్‌ మీకు ఉపయోగపడుతుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది