
టోస్టర్ వంటగదిలో ఉండే అత్యంత సులభమైన వస్తువు కావచ్చు, మీ అల్పాహారం క్షణంలో సిద్దం చేసే గొప్ప ఉపకరణం కావచ్చు. దీనిని రెగ్యులర్ గా వాడడంతో మీ టోస్టర్ పై మాడిన మరకలు ఎక్కువ అయి తినే ఆహారంకు అంటుకునే అవకాశం ఉంది. టోస్టర్ పై మాడిన మరకలు తొలగించడానికి, కొత్తదాని వలే మెరిసేందుకు మేము తెలిపే చర్యలన ు అనుసరించండి.
స్టెప్ 1: టోస్టర్ ను ప్లగ్ నుంచి వేరు చేయండి
ఎదైన ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసే ముందు ఇది మొదటి చర్య. ఏ పని చేసిన భద్రతే ప్రామాణికంగా చేయాలి.
స్టెప్ 2: చిన్న ముక్క ట్రేను తొలగించాలి
మీ టోస్టర్ నుంచి బ్రేడ్ నుంచి పడే చిన్న ముక్క ట్రేని జాగ్రత్తగా తీసి వేయాలి. ట్రేలో చిక్కుకున్న ఆహారాన్ని తొలగించడానికి కిచెన్ సింక్ దగ్గరకు తీసుకెళ్లి క్లీన్ చేయాలి. ట్రేను శుభ్రం చేయడానికి చేయడానికి మృదువైన కుచ్చులున్న టూత్ బ్రష్ ను ఉపయోగించాలి. ట్రే జిడ్డుగా ఉంటే, అర బకెట్ నీళ్లలో 1 స్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్ ను కలపాలి. అందులో ఈ జిడ్డు ట్రేను 5 నిమిషాల వరకు నానబెట్టాలి.

స్టెప్ 3: క్లీన్ ద కాయిల్ కాయిల్‌ని శుభ్రం చేయాలి
మీ టోస్టర్ ను తలక్రిందులుగా తిప్పి దానిలో వదులుగా ఉన్న ఆహార కణాలను తొలగించుకోవాలి. పాత టూత్ బ్రష్ ఉపయోగించి కాయిల్ లో చిక్కుకున్న చిన్న ముక్కలను బ్రష్ చేయాలి. పై భాగం నుంచి మొదలు పెట్టి కింది భాగం వరకు బ్రష్ తో రుద్దాలి. కాయిల్స్ నుంచి పడే చిన్న చిన్న ముక్కలు అక్కడ ఇక్కడ పడకుండా దిగువ భాగంలో కాగితపు తువ్వాళ్లను పరచాలి. కాయిల్స్ ప్రతి మూల మూలన బ్రష్ తో రుద్దాలి.
స్టెప్ 4: టోస్టర్ బయటి ప్రదేశం శుభ్రం చేయడం
ఒక గిన్నె నీటిలో 1 చిన్న చెంచా తేలికపాటి డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపి ద్రవం సిద్ధం చేసుకోవాలి. స్పాంజ్ ను ద్రవంలో ముంచి టోస్టర్ వెలువలి భాగాలపై క్షుణ్ణంగా రుద్దాలి. తరువాత మంచి నీటిలో నానబెట్టిన కాటన్ నూలు వస్త్రంతో టోస్టర్ ను తుడచుకోవాలి. వెంటనే శుభ్రమైన పొడి వస్త్రంతో తేమ తుడుచుకుంటే సరిపోతుంది.
స్టెప్ 5: కఠినమైన మరకలను శుభ్రం చేయడం
మీ టోస్టర్ వెలుపల నుంచి కఠినమైన మరకలు, జి డ్డు మరకలను తొలగించడానికి, బేకింగ్ సోడాను నీటిలో కలిపి రెగ్యులర్ టూత్ పేస్టు కంటే మందంగా ఉండే విధంగా పేస్టు సిద్ధం చేసుకోవాలి. మరకలు ఉన్న ప్రదేశంలో దీన్ని పూసి 5 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఇప్పుడు, పేస్ట్ ని నైలాన్ స్క్రబ్బింగ్ ప్యాడ్ తో రుద్ది , ఒక గుడ్డతో శుభ్రంగా తుడుచుకుంటే మీ టోస్టర్ కొత్తగా మెరిసిపోతుంది.
ఈ చర్యలు మీ టోస్టర్ ప్రకాశాన్ని పునరుద్ధరించడానికి, కొత్తగా కనిపించడానికి సహాయపడతాయి.