టాప్‌ లోడింగా లేక ఫ్రంట్‌ లోడింగా? ఇప్పుడే అయోమయానికి స్వస్తి పలకండి!

మార్కెట్‌లో అనేక రకాల వాషింగ్‌ మెషీన్‌లు లభిస్తున్నాయి. ఈ వ్యాసంలో, మీరు టాప్‌ లోడ్‌ లేదా ఫ్రంట్‌ లోడ్‌లో ఏదో ఒకటి ఎంచుకునేందుకు మేము మీకు సహాయపడతాము.

వ్యాసం నవీకరించబడింది

Top Loading Or Front Loading? End the Confusion Now!
ప్రకటన
Surf Excel Matic Liquid

టాప్‌-లోడింగ్‌ వర్సెస్‌ ఫ్రంట్‌-లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌ల మధ్య జరుగుతున్న పోరాటంలో, విజేతను ఎంచుకోవడం కష్టమైన పని. రెండు మెషీన్‌లు బాగా పనిచేస్తాయి, కానీ అంతిమంగా, చాయిస్‌ మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది.

ప్రతి రకం వాషింగ్‌ మెషీన్‌ని వివరంగా అర్థంచేసుకుందాం.

ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌ల ప్రయోజనాలు

1) కొద్ది సైకిల్స్‌ నడుస్తుంది

ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌ యొక్క భారీ లోడింగ్‌ సామర్థ్యం ఒక ఉతుకు చక్రంలో దుస్తులు పెద్ద కుప్పలో ఉతకడానికి మీకు వీలు కల్పిస్తుంది. కాబట్టి, మీ దుస్తులు ఉతకడం మీ సగం రోజును తీసుకోదు. కేవలం కొద్ది లోడ్‌ల్లోనే మీ దుస్తులు ఉతకబడతాయి.

ప్రకటన

Surf Excel Matic Liquid

2) నీరు మరియు ఎనర్జీ సామర్థ్యం

సగటు టాప్‌-లోడింగ్‌ మెషీన్‌ ప్రతి వాష్‌కి 90-100 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. దీనికి భిన్నంగా, ఫ్రంట్‌ లోడింగ్‌ మెషీన్స్‌ దీనిలో సగం లేదా అంతకంటే తక్కువ ఉపయోగిస్తుంది. అంతే కాదు, ఇవి  టాప్‌ లోడింగ్‌ మెషీన్‌లతో పోల్చుకుంటే మూడింట ఒక వంతు ఎనర్జీని మరియు డిటర్జెంట్‌ని ఉపయోగిస్తుంది.

3) స్పిన్‌ సైకిల్లో తక్కువ శబ్దం

అనేక ఫ్రంట్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌లకు వైబ్రేషన్‌ నియంత్రణ విశిష్టత ఉంటుంది. ఇది అంతర్గత డ్రమ్మును స్థిరీకరిస్తుంది, దీనివల్ల యూనిట్‌ మొత్తం ఊగిపోదు, పైగా మీ ఫ్లోర్‌లను కూడా కాపాడుతుంది.

టాప్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌ల వల్ల కలిగే ప్రయోజనాలు

1) సరసమైన ధర

టాప్‌-లోడింగ్‌ వాషింగ్‌ మెషీన్‌లు కొనడం వల్ల కలిగే అత్యంత ముఖ్య ప్రయోజనం దాని ధర. ఫ్రంట్‌ లోడ్‌ వాటితో పోల్చుకుంటే ఇది చాలా సరసమైన ధరకు లభిస్తుంది.

2) ఎర్గోనామికల్‌గా స్నేహపూర్వకమైనది

మీరు వెన్ను నొప్పితో బాధపడుతుంటే, దుస్తులు ఉతికేందుకు ముందుకు వంగడం బాధాకరంగా ఉండొచ్చు. టాప్‌-లోడింగ్‌ మెషీన్‌లు సౌకర్యవంతమైన ఎత్తులో, సాధారణంగా మీ నడుము ఎత్తులో దుస్తులను లోపల వేయడానికి మరియు బయటకు తీయడానికి వీలు కల్పిస్తుంది.

టాప్‌ లోడింగ్‌ లేదా ఫ్రంట్‌ లోడింగ్‌కి మధ్య దేనిని ఎంచుకోవాలో తెలుసుకునేందుకు అవసరమైన ప్రతి ఒక్కటీ మీకు అర్థమైందనుకుంటా! ఆనందంగా దుస్తులు ఉతికించండి!

వ్యాసం మొదట ప్రచురించబడింది