మీ లివింగ్ రూమ్ తాజా సువాసనతో మరియు ఆహ్లాదకరంగా చేసేందుకు అబ్బురపరిచే చిట్కాలు

ఇంట్లో ఆహ్లాదకరమైన సువాసన మీలో ఉల్లాసాన్ని పెంచుతుంది మరియు అతిథులు స్వాగత అనుభూతి పొందుతారు. మీ లివింగ్‌ రూమ్‌ని చాలా సువాసనగా చేసేందుకు ఈ సహజ-సూచనలను పాటించండి!

వ్యాసం నవీకరించబడింది

Amazing Tips to Make Your Living Room Smell Fragrant and Inviting
ప్రకటన
Surf Excel Matic Liquid

మీకు అతిథులు వచ్చినా లేదా మీ సొంత లివింగ్‌ రూమ్‌లో సేదతీరుతున్నా, మీ గదిని సువాసనతో ఎలా ఉంచాలో మీరు తెలుసుకోవాలనుకుంటారు. సహజ ఘటికాంశాలను ఉపయోగించి మీరు దీనిని ఎలా సాధించవచ్చనే దానిపై మా వద్ద అబ్బురపరిచే చిట్కాలు ఉన్నాయి.

కాఫీ బీన్‌ సువాసన

తాజాగా రూపొందించిన కాఫీ సువాసన మీకు నచ్చితే, మీకు ఈ చిట్కా కచ్చితంగా నప్పుతుంది. మీ గదిని ఆర్టిసనల్‌ కేఫ్‌ మాదిరిగా సువాసన వచ్చేలా చేసేందుకు, ఒక బౌల్‌ తీసుకొని ¾వ వంతు వరకు కాఫీ బీన్స్ నింపండి మరియు మూత లేదా ప్లేటుతో దానికి మూత పెట్టండి. తరువాత, దాని పైన టీలైట్స్‌ పెట్టండి. వెలుగుతున్న క్యాండిల్‌ బీన్స్‌ ని వెచ్చగా చేస్తుంది మరియు వెచ్చని కాఫీ పరిమళాన్ని మీ లివింగ్‌ రూమ్‌ అంతటా వ్యాపింపజేస్తుంది.

ఆరంజ్‌ పీల్‌ క్యాండిల్‌

నారింజ పండుని సగానికి కోయండి. తరువాత చెంచాతో గుజ్జు మొత్తాన్ని తీసేసి తొక్క మాత్రమే ఉంచండి. నారింజ లోని గుజ్జును తీసేటప్పుడు, తెల్లని స్టెమ్‌ (క్యాండిల్‌ మైనాన్ని పొలివుంటుంది) భాగం అలాగే ఉండిపోవాలి. ఈ భాగం చెక్కుచెదరకుండా మరియు తొక్కకు అతుక్కొనివుండేలా చూడాలి, లేదా మీరు మార్కెట్‌ నుంచి తెచ్చిన వత్తిని కూడా ఉపయోగించవచ్చు. నారింజ తొక్కల్లో ప్రతి సగాన్ని ఆలివ్‌ ఆయిల్‌తో నింపండి, అంచు, మరియు వయోలా నుంచి ఒక సెం.మీ వదిలేయండి, అంతే మీరు ఆరంజ్‌ సెంటెడ్‌ క్యాండిల్‌ని తయారుచేసినట్లే.

ప్రకటన

Surf Excel Matic Liquid

వనిల్లా సారం మరియు ఎసెన్షియల్ ఆయిల్‌ ఫ్రెష్‌నర్‌

మీరు స్వయంగా గృహ తయారీ ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని తయారు చేసేందుకు, ఒక గ్లాసులో ¾ కప్పు నీళ్ళు తీసుకొని, దానికి 1 పెద్దచెంచా  వనిల్లా సారం మరియు 6-7 చుక్కల మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపండి. ఈ మిశ్రమాన్ని పిచికారి బాటిల్‌లో పోయండి మరియు అవసరమైనప్పుడల్లా మీ లివింగ్‌ రూమ్‌లో పిచికారి చేయండి. ఇది మీ ఇంటిని కమ్మని సువాసనతో ఉంచుతాయి. మీ ఇల్లు సువాసనతో ఉండటానికి కావలసిన అత్యుత్తమ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌లో పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌ ఒకటి.

వినిగర్‌  మరియు ఎసెన్షియల్‌ ఆయిల్ ఫ్రెష్‌నర్‌

వినిగర్‌ని ఉపయోగించేందుకు ఇది అద్భుతమైన మార్గం. పరిశుభ్రమైన బౌల్‌ తీసుకొని దానికి ¾ వరకు నీళ్ళు పోసి 2  చిన్నచెంచాల వినిగర్‌ మరియు 6-7 చుక్కల మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్ కలిపి బాగా మిశ్రమం చేయండి. దుర్వాసనలను పోగొట్టి మీ లివింగ్‌ రూమ్‌ తాజా మరియు ఆహ్లాదకర సువాసనతో వచ్చేలా గదిలో ఒక మూలన పెట్టండి.

ఈ సరళ చిట్కాలతో, సోఫాలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునేందుకు  మీ స్నేహితులు తప్పకుండా మీ ఇంటికి తరలివస్తారు.

వ్యాసం మొదట ప్రచురించబడింది