వాటర్ ప్యూరిఫైయర్ని కొనడానికి ముందు మీరు తెలుసుకోవలసిన విషయాలు.

మీరు మీ ఇంటికి వాటర్‌ ప్యూరిఫైయర్‌ కొనాలనుకుంటున్నారా? అనేక ఎంపికలు మిమ్మల్ని తికమకపెట్టనివ్వకండి. ఎంపిక ప్రక్రియను సరళీకృతం చేసేందుకు చదవండి.

వ్యాసం నవీకరించబడింది

Things You Should Know Before Buying a Water Purifier
ప్రకటన
Surf Excel Matic Liquid

విభిన్న టెక్నాలజీలతో బోలెడన్ని వాటర్‌ ప్యూరిఫైయర్‌లు మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి, వేటిల్లో వేటి ప్రత్యేకతలు వాటివే.

మీరు సరైన వాటర్‌ ప్యూరిఫైయర్‌ని ఎలా ఎంచుకోవచ్చో ఇక్కడ ఇస్తున్నాము

1) మీరు కోరుకుంటున్న వాటర్‌ ప్యూరిఫైయర్‌ రకాన్ని ఎంచుకోండి

వాటర్‌ ప్యూరిఫైయర్‌ని కొనడానికి ముందు వాషర్‌లో ఉన్న కాలుష్యాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. నీటిలో అత్యధిక స్థాయిల్లో టోటల్‌ డిజాల్వ్‌డ్‌ సాలిడ్స్‌ (టిడిఎస్‌) ఉంటే, ఆర్‌ఒ (రివర్స్‌ ఓస్మోసిస్) ఆధారిత ప్యూరిఫైయర్‌ని తీసుకోవలసిందిగా మేము సూచిస్తున్నాము. వాటర్‌ ప్యూరిఫైయర్‌లో టిడిఎస్‌ తక్కువ స్థాయిల్లో ఉంటే, యువి (అల్ట్రావయొలెట్‌) లేదా యుఎఫ్‌ (అల్ట్రాఫిల్ట్రేషన్‌) ఆధారిత వాటర్‌ ప్యూరిఫైయర్‌ మీకు ఉత్తమ ఎంపిక అవుతుంది. అయితే మలినాలన్నిటినీ నిర్మూలించే మరియు మీకు ఆరోగ్యకరమైన నీటి గ్లాసును ఇచ్చేందుకు మొత్తం మూడు - ఆర్‌ఒ + యువి + యుఎఫ్‌ టెక్నాలజీలు గల వాటర్‌ ప్యూరిఫైయర్‌లు ఉన్నాయి. ఇవి మలినాలన్నిటినీ తొలగిస్తాయి మరియు ఆరోగ్యకరమైన నీటి గ్లాసు మీకు అందివ్వబడుతుంది. కాబట్టి మీరు కొంటున్న వాటర్‌ ప్యూరిఫైయర్‌లో ఈ విశిష్టతలు ఉన్నాయా అనే విషయం అడగటం లేదా పరిశీలించడం ముఖ్యం.

గ్రావిటి మరియు బహుళ-దశ ఫిల్టరింగ్‌ స్థాయిల సహాయంతో టిడిఎస్‌ తక్కువ స్థాయిలు ఉన్న నీటిని ఫిల్టర్‌ చేసే నాన్‌-ఎలక్ట్రిక్‌ ప్యూరిఫైయర్‌ లాంటి కొన్ని ఇతర రకాల ప్యూరిఫైయర్‌లు ఉన్నాయి. మెంబ్రేన్‌ ద్వారా నీటిని ఫిల్టర్‌ చేయడానికి ఆర్‌ఒ ప్రెషరైజ్‌ చేసేందుకు ఎలక్ట్రిక్‌ ప్యూరిఫైయర్‌ కరెంటును మరియు సూక్ష్మజీవులను చంపేందుకు యువి రేడియేషన్‌లను ఉపయోగిస్తుంది.

ప్రకటన

Surf Excel Matic Liquid

అత్యధిక స్థాయిల్లో టిడిఎస్‌ గల నీటికి ఈ ప్యూరిఫైయర్‌లు అత్యంత అనువైనవి.

2) నిల్వ సామర్థ్యం పరీక్షించండి

మీ కుటుంబం యొక్క సైజు మరియు నీటి వినియోగ విధానాన్ని బట్టి, తగినంత నీటిని నిల్వచేసే ప్యూరిఫైయర్‌ని ఎంచుకోండి. ఒకవేళ కరెంటు పోయినా కూడా తగినంత త్రాగు నీటిని ఇది ఉంచుతుంది. నాన్‌-ఎలక్ట్రిక్‌ ప్యూరిఫైయర్‌లు ఒకసారి 25 లీటర్ల నీటిని ఫిల్టర్‌ చేయగలవు, అదే సమయంలో ఎలక్ట్రిక్‌ ప్యూరిఫైయర్‌లు 12 లీటర్ల సామర్థ్యం గల స్టోరేజ్‌ ట్యాంకుతో వస్తున్నాయి. ఆర్‌ఒ ప్యూరిఫైయర్‌లు శుద్ధిచేసిన ప్రతి 1 లీటరు నీటికి 3 లీటర్ల వృధా నీరు ఉత్పత్తి చేస్తాయని కూడా గమనించండి.

3) బడ్జెట్‌ నిర్ణయించుకోండి

మీ నీటి సరఫరాలో ఉన్న నీటిలో టిడిఎస్‌ స్థాయిని పరిగణనలోకి తీసుకొని బడ్జెట్‌ రూపొందించుకోండి. మీరు ఆర్‌ఒ, యువి లేదా యుఎఫ్‌ని ఎంచుకుంటున్నారా అనే దానిపై ఆధారపడి నాన్‌-ఎలక్ట్రిక్‌ ప్యూరిఫైయర్‌ దాదాపు రూ. 5000కి లభిస్తుండగా ఎలక్ట్రిక్‌వి రూ. 6,000 నుంచి రూ. 20,000 మధ్య లభిస్తున్నాయి.

వాటర్‌ ప్యూరిఫైయర్‌ల విషయానికొస్తే మీ ఎంపికల గురించి మీకు అవగాహన ఉండటం ముఖ్యం.

వ్యాసం మొదట ప్రచురించబడింది