ఎల్లవేళలా మీ వాషింగ్‌ మెషీన్‌ని కమ్మని సువాసనతో ఉంచడమెలా!

సువాసన వచ్చే వాషింగ్‌ మెషీన్‌ మీ దుస్తులు తాజా సువాసనతో వచ్చేలా కూడా ఉంచుతుంది. మీ వాషింగ్‌ మెషీన్‌ని కమ్మని వాసనతో ఉంచేందుకు ఈ చిట్కాలను ప్రయత్నించండి.

వ్యాసం నవీకరించబడింది

How to Keep Your Washing Machine Smelling Great All the Time!
ప్రకటన
Surf Excel Matic Liquid

మీ వాషింగ్‌ మెషీన్‌ కూడా మీ బట్టలను సువాసన వచ్చేలా చేయగలవు. కొన్ని సరళ చిట్కాలతో మీ వాషింగ్‌ మెషీన్‌ని సువాసనతో ఎలా ఉంచాలో మేము ఇక్కడ మీకు చూపిస్తాము.

మీ బట్టలు మరియు మీ వాషింగ్‌ మెషీన్‌ సువాసనతో వచ్చేలా చేసేందుకు, సువాసన వచ్చే డిటర్జెంట్‌ని కొనవలసిందిగా మేము మీకు సూచిస్తున్నాము. ప్రతి ఉతుకు తరువాత ఇది మీ వాషింగ్‌ మెషీన్‌ని సువాసనతో ఉంచుతుంది.

డ్రమ్‌ని శుభ్రం చేయండి

మీ వాషింగ్‌ మెషీన్‌ని తాజాగా ఉంచేందుకు చేయవలసిన మొదటి పని దానిని క్రమంతప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లోడ్‌ చేసిన తరువాత సాధ్యమైనంత వెంటనే తడి బట్టలను బయటకు తీయండి. మీ మెషీన్‌ డ్రమ్‌ని శుభ్రం చేయడానికి, గోరువెచ్చని నీటిని మరియు బ్లీచ్‌ని 1 కప్పు చొప్పున తీసుకొని పెద్ద బౌల్‌లో  మిళితం చేయండి. దీనిని బాగా మిశ్రమం చేయండి. పరిశుభ్రమైన వస్త్రం తీసుకొని దానిని ఈ ద్రావణంలో ముంచి డ్రమ్‌ని శుభ్రం చేయండి. అనంతరం మరొక పరిశుభ్రమైన తడి వస్త్రంతో తుడవండి. దీనిని వారానికి ఒకసారి చేయండి. బ్లీచింగ్‌ని ఉపయోగించేటప్పుడు, సురక్షితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తగా రబ్బరు గ్లౌజులు ధరించాలని గుర్తుంచుకోండి.

సబ్బు డిస్పెన్సర్‌ని శుభ్రం చేయండి

సబ్బు డిస్పెన్సర్‌ని మీ వాషింగ్‌ మెషీన్‌ నుంచి బయటకు తీయండి. ద్రావణాన్ని 1 కప్పు గోరువెచ్చని నీటిలో పోసి దానికి 1 చిన్న చెంచా డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ కలపండి. మీ సబ్బు డిస్పెన్సర్‌ని శుభ్రం చేయడానికి ఈ ద్రావణంలో ముంచిన స్పాంజిని ఉపయోగించండి. ఇది సువాసన వచ్చేలా చేసేందుకు, 1/2 బక్కెట్‌ గోరువెచ్చని నీళ్ళు, ఎసెన్షియల్‌ ఆయిల్‌ తీసుకోండి మరియు సబ్బు డిస్పెన్సర్‌ని ఈ ద్రావణంలో వదలండి. దీనిని 15 నిమిసాల సేపు స్థిరపడనివ్వండి. అనంతరం దీనిని తిరిగి మీ వాషింగ్‌ మెషీన్‌లో పెట్టండి.

ప్రకటన
Surf Excel Matic Liquid

వినిగర్‌  మరియు బేకింగ్‌ సోడా ఉపయోగించండి

2 కప్పుల గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, దానికి 3 కప్పుల వినిగర్‌ మరియు 1/2 కప్పు బేకింగ్‌ సోడా కలపండి. బాగా మిశ్రమం చేసి ఈ క్లీనింగ్‌ ఏజెంట్‌ని ఈ వాషర్‌కి కలపండి. అతిపెద్ద సైకిల్ని రన్‌ చేయండి. జమయిన మురికి మొత్తాన్ని ఇది శుభ్రం చేసి మీ వాషర్‌ని సువాసనతో ఉంచుతుంది.

మీ మెషీన్‌ని పొడిగా ఉంచండి

ఎల్లప్పుడూ మీ వాషింగ్‌ మెషీన్‌ని పొడిగా ఉంచండి. ప్రతి లోడ్‌ తరువాత, మీ మెషీన్‌ మూతను తెరిచివుంచండి. గాలి ప్రసారం కావడానికి ఇది వీలు కల్పిస్తుంది. గ్లాస్‌ మరియు డోర్‌ గాస్కెట్‌ని కూడా తుడవండి. మీ వాషింగ్‌ మెషీన్‌ లోపల మరియు బయట తుడించేందుకు మీరు 1 బౌల్‌ గోరువెచ్చని నీరు మరియు 5-6 చుక్కలు మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలిపి మీరు ద్రావణాన్ని ఉపయోగించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది