మీరు ఎల్లవేళలా మీ కప్బోర్డులు తాజా సువాసనతో ఎలా ఉంచవచ్చు

మీ కప్‌బోర్డును తాజా సువాసన వచ్చేలా చేసే సులభ మార్గాల కోసం మీరు ఎదురుచూస్తున్నారా, అయితే మీరు సరైన చోటుకు వచ్చారు. మీకు సహాయపడేందుకు మేము కొన్ని సులభ మార్గాలను సూచిస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

How You Can Keep Your Cupboards Smelling Fresh At All Times
ప్రకటన
Surf Excel Matic Liquid

మీరు కప్‌బోర్డు తెరిచిన ప్రతిసారి మీరు సుగంధభరిత సువాసన గుబాళించాలనుకుంటున్నారా? మీ క్లోసెట్‌లో  మీ బట్టలను తాజా సువాసనతో ఉంచే కొన్ని అబ్బురపరిచే చిట్కాలను మేము సూచిస్తున్నాము.

కాఫీ గుండ్లు

మీకు కాఫీ సువాసన ఇష్టమైతే, డబ్బాను కాఫీ గుండ్లతో నింపండి మరియు అల్యూమినియం ఫాయిల్‌తో దానికి మూత పెట్టండి. అనంతరం, ఫాయిల్‌కి కొద్ది రంధ్రాలు పొడిచి దానిని మీ కప్‌బోర్డులో పెట్టండి. ఇది కాఫీ సువాసనను మీ క్లోసెట్‌లో వ్యాపింపజేస్తుంది. తాజాదనం నిలబెట్టుకునేందుకు నెలకు కనీసం ఒకసారి గుండ్లు మార్చాలని గుర్తుంచుకోండి.

అత్యావశ్యక ఆయిల్స్‌

ఒక కప్పు నీళ్ళు తీసుకొని దానిలో మీకు ఇష్టమైన అత్యావశ్యక ఆయిల్‌ 6-7 చుక్కలు తీసుకొని దానికి 4-5 చుక్కల వనిల్లా సారం కలపండి. ఇప్పుడు మీరు కోరుకున్న అనేక అత్యావశ్యక ఆయిల్స్‌ ని  కూడా మిశ్రమం చేసి పోల్చవచ్చు. దీనిని బాగా మిశ్రమం చేసి, పిచికారి బాటిల్‌లో పోసి బాగా కుదపండి. దీనిని ప్రతి రెండు రోజులకు ఒకసారి మీ కప్‌బోర్డులోని మూలలు మరియు అరలలో పిచికారి చేయండి. నిల్వచేయడానికి, బాటిల్‌ని చల్లని, నీడ ప్రదేశంలో ఉంచండి. 

ప్రకటన

Surf Excel Matic Liquid

శాండల్‌వుడ్‌

మీ కప్‌బోర్డులోని అరలలో చిన్న శాండల్‌వుడ్‌ (గంధకపు చెక్క) ముక్క పెట్టండి. ఇది తాజాగా, మట్టి సువాసనతో ఉంటుంది మరియు మీ కప్‌బోర్డు మరియు బట్టలు కమ్మని సువాసనతో ఉండేలా చేస్తుంది!

సెంటుగల బ్యాగ్‌ లేదా హ్యాంగర్‌

సువాసనగల హ్యాంగర్‌లు మార్కెట్‌లో లభిస్తాయి. ఇవి మీ కప్‌బోర్డుకు తాజా సువాసన ఇస్తాయి. అయితే, మీరు కప్‌బోర్డు ఫ్రెష్‌నర్‌ని కూడా తయారుచేయవచ్చు. రోజా పూరేకులు, పుదీనా ఆకులు లాంటి సువాసవచ్చే వాటితో లేదా అత్యావశ్యక ఆయిల్స్‌ లో ముంచిన దూది లాంటి దానితో  కూడా మీరు మెష్‌ బ్యాగ్‌ ని నింపండి. దీనిని హ్యాంగర్‌  రెయిల్స్‌ పై వేలాడదీయండి, మీ కప్‌బోర్డు తాజా మరియు ఆహ్లాదకరమైన సువాసనతో ఉంటుంది. మెష్‌ బ్యాగ్‌ ని క్రమంతప్పకుండా మార్చాలని గుర్తుంచుకోండి.

మీకు అర్థమై ఉంటుంది! సీజన్‌ ఏదైన సరే దానితో నిమిత్తం లేకుండా ఈ చిట్కాలు మీ కప్‌బోర్డులను తాజా సుసవాసతో ఉంచుతాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది